Beauty Tips: Sonakshi Sinha Reveals About Her Beauty Secret - Sakshi
Sakshi News home page

Sonakshi Sinha: అమ్మ చెప్పింది.. ఇలా చేస్తే మొటిమలు, మచ్చలు, ట్యాన్ దరిచేరవు!

Published Sun, Aug 21 2022 10:14 AM | Last Updated on Sun, Aug 21 2022 11:40 AM

Beauty Tips: Sonakshi Sinha Reveals About Her Beauty Secret - Sakshi

కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా కెరీర్‌ ఆరంభించింది సోనాక్షి సిన్హా. మేరా దిల్‌ లేకే దేఖోతో సినిమాకు డిజైనర్‌గా పనిచేసింది. ఇక ‘దబాంగ్‌’ సినిమాతో బాలీవుడ్‌లో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది ఈ స్టార్‌ కిడ్‌. అందం, అభినయంతో ఆకట్టుకుని తొలి సినిమాకే ఫిల్మ్‌ఫేర్‌ అవార్డు అందుకుంది. ఇక సెలక్టెడ్‌గా సినిమాలు చేస్తున్న 35 ఏళ్ల సొనాక్షి తన సౌందర్యానికి అమ్మ చెప్పిన సహజమైన చిట్కాలే కారణం అంటోంది. 

నా బ్యూటీ సీక్రెట్‌ అదే!
‘‘నా చిన్నప్పుడు చూసేదాన్ని అమ్మ తన మొహానికి అలోవెరా రాసుకోవడం. ఆ ఆకు జిగురును అలా ఎందుకు రాసుకుంటుందో అప్పుడు అర్థం కాలేదు కానీ సినిమాల్లోకి వచ్చాక అర్థమైంది. ప్లస్‌ ఆమ్మ గ్లోయింగ్‌ స్కిన్‌ రహస్యమేంటో కూడా తెలిసింది. నా బ్యూటీ సీక్రెట్‌ కూడా అదే.

షూటింగ్స్‌తో ఎంత బిజీగా ఉన్నా రోజుకు రెండు సార్లు మొహానికి అలోవెరా రాసుకుంటాను. అప్లయ్‌ చేసుకున్నాక ఇరవై నిమిషాలకు చల్లటి నీళ్లతో మొహం కడుక్కోవాలి. ఈ అలవాటును దినచర్యలో భాగం చేసుకుంటే  మొటిమలు, మచ్చలు, ట్యాన్, పిగ్మెంటేషన్‌ ఎట్‌సెట్రా జీవితంలో దరిచేరవు’’ అని చెప్పింది సోనాక్షి సిన్హా.

చదవండి: Actress Poorna: ‘పర్‌ఫెక్ట్‌ బ్రాండ్‌’... పూర్ణ కట్టిన ఈ చీర ధర 54 వేలు! ప్రత్యేకత ఏమిటంటే!
Radhika Madan: నా చర్మ సౌందర్య రహస్యం ఇదే.. వారానికోసారి ఇలా చేశారంటే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement