బాలీమస్త్ | new dress fashion | Sakshi
Sakshi News home page

బాలీమస్త్

Published Thu, May 26 2016 11:21 PM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

బాలీమస్త్ - Sakshi

బాలీమస్త్

బాలీవుడ్‌లో ప్రతీ తార మస్త్ మస్త్‌గా కనపడుతుంది కదూ! కొరియోగ్రాఫర్‌గా కెరియర్ స్టార్ట్ చేసి కాస్ట్యూమ్ డిజైనర్‌గా హిట్టు కొడుతున్న విక్రమ్ ఫడ్నిస్ డిజైన్లు బాలీవుడ్‌కే మస్త్ మస్త్. అందుకే, ఈయన స్టెప్ మస్త్... ఈయన కట్ మస్త్.. ఎంజాయ్ బాలీ మస్త్!! హిందీ సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా పని చేసిన ఓ వ్యక్తి తన పంథాను మార్చుకుని అంతకు మించిన ఫ్యాషన్ డిజైనర్‌గా ఎదిగితే.. ఆ వ్యక్తి పేరు విక్రమ్ ఫడ్నిస్ అని సెలబ్రిటీలు ఇట్టే చెప్పేయగలరు. బాలీవుడ్ స్టార్ల ఫేవరేట్ డిజైనర్‌గానే కాకుండా ఇండియా ఫేమస్ ఫ్యాషన్ డిజైనర్లలో ఒక ఊపు, ఉత్సాహాన్ని తీసుకువచ్చిన వ్యక్తిగా మంచి పేరుంది విక్రమ్‌కు.


ముంబయ్‌లో జుహూ పేరుతో రిటైల్ స్టోర్‌ను నడుపుతున్న విక్రమ్ తన పేరు మీదుగా ఇండియన్, వెస్ట్రన్ వేర్‌ను ఆడ-మగ ఇద్దరికీ సరికొత్త ఆకర్షణలను అలంకరిస్తున్నాడు. విదేశాలలో డర్బన్, చికాగో, జమైకా వంటి నగరాలతో పాటు మన దేశంలో ప్రముఖ పట్టణాలలో స్టోర్స్‌ను ఏర్పాటు చేశారు. హైదరాబాద్ లోనూ ప్రముఖ ఫ్యాషన్ షోల ద్వారా తన డిజైన్స్‌ను తెలుగువారికీ పరిచయం చేశారు విక్రమ్.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement