
బాలీవుడ్ సీనియర్ నటుడు గోవిందా ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన గోవిందా బాలీవుడ్‌పై విమర్శలు చేశారు. బాలీవుడ్‌లో తనపై కుట్ర చేశారని షాకింగ్ కామెంట్స్ చేశారు. నన్ను ఇండస్ట్రీ నుంచి బయటికి పంపేందుకు కొందరు ప్రయత్నించారని వెల్లడించారు. తాను పెద్దగా చదువుకోలేదని.. వారంతా చదువుకున్న వారు కావడంతోనే నాతో ఆడుకున్నారని తెలిపారు. కేవలం నా నటన వల్లే ఇప్పటికీ ఇండస్ట్రీలో కొనసాగుతున్నానని వెల్లడించారు. నన్ను టార్గెట్ చేసిన వారి పేర్లను వెల్లడించడం తనకు ఇష్టం లేదని పేర్కొన్నారు. కాగా.. ముఖేష్ ఖన్నా యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో గోవిందా ఈ వ్యాఖ్యలు చేశారు.
పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించిన గోవిందా ప్రస్తుతం పెద్దగా కనిపించడం లేదు. ఆయన చివరిసారిగా 2019 విడుదలైన రంగీలా రాజాలో కనిపించాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద పెద్దగా రాణించలేకపోయింది. నటుడు తన కెరీర్‌లో 100 కోట్ల ప్రాజెక్ట్‌లను చేయలేకపోయినట్లు వెల్లడించారు. నిజం చెప్పాలంటే తాను రూ. 100 కోట్ల చిత్రాలను తిరస్కరించానని తెలిపారు. వాటిని వద్దనుకున్నప్పుడు అద్దంలో చూసుకుని నన్ను చెంపదెబ్బ కొట్టుకునేవాడినని పేర్కొన్నారు.
విడాకుల రూమర్స్..
గత కొద్ది కాలంగా గోవిందాపై విడాకుల రూమర్స్ వినిపిస్తూనే ఉన్నాయి. తన భార్య సునీతా అహుజాతో విడిపోతున్నారని వార్తలు తెగ వైరలవుతున్నాయి. వీటిపై ఇటీవలే ఆయన భార్య కూడా స్పందించింది. గోవిందను... తనను ఎవరూ విడదీయలేరని సునీతా అహుజా తేల్చిచెప్పారు. మేము విడివిడిగా ఉంటున్నా మాట వాస్తవమే.. కానీ గోవింద రాజకీయాల్లోకి ఉండడం వల్లే తాము దూరంగా ఉంటున్నట్లు తెలిపింది. పిల్లలు పెద్దవాళ్లు అవుతున్నారు.. తరచుగా పార్టీకి చెందిన పలువురు మా ఇంటికి వస్తూ ఉంటారు..అందుకే మేము పక్కనే ఉన్న మరో ఇంట్లో ఉంటున్నామని తెలిపింది. కాగా.. గోవిందా, సునీత 1987లో వివాహం చేసుకున్నారు. వీరిద్దరికీ కుమారుడు యశ్వర్ధన్, కుమార్తె టీనా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment