ఆ డైరెక్టర్‌ నన్ను పనిమనిషిలా చూశాడు.. అందరిముందు.. | Director Ratheesh Balakrishnan Treated Like a Maid: Costume designer Liji Preman | Sakshi
Sakshi News home page

ఎంతో కష్టపడ్డా.. కనీసం నా పేరు వేయలేదు.. ఊరుకునే ప్రసక్తే లేదు!

Published Mon, Jun 10 2024 1:31 PM | Last Updated on Mon, Jun 10 2024 1:38 PM

Director Ratheesh Balakrishnan Treated Like a Maid: Costume designer Liji Preman

మలయాళ దర్శకుడు రథీశ్‌ బాలకృష్ణ తనను మొదటినుంచీ ఇబ్బందిపెడుతూనే ఉన్నాడంది కాస్ట్యూమ్‌ డిజైనర్‌ లిజి ప్రేమన్‌. తనను ఒక ఆర్టిస్టుగా కాకుండా పనిమనిషిగా చూశాడని వాపోయింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో లిజి మాట్లాడుతూ.. సురేశంతియం సుమలతయుదేయమ్‌: హృదయహరియయ ప్రణయకథ అనే సినిమాకు నేను కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పని చేశాను. 35రోజులు పని ఉంటుందన్నారు. అందుకుగానూ రెండున్నర లక్షలు అడిగాను. సరేనంటూ లక్ష రూపాయలు అడ్వాన్స్‌గా ఇచ్చారు. 

ఎన్నో ఇబ్బందులు..
ఈ సినిమా ప్రీపొడక్షన్‌ దగ్గరి నుంచి షూటింగ్‌ వరకు దాదాపు 110 రోజులు పని చేశాను. ఈ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. ముఖ్యంగా ఈ సినిమా డైరెక్టర్‌ రథీశ్‌కు ఇగో ఎక్కువ. నన్ను ఒక పనిమనిషిలా చూశాడు. అతడి ప్రవర్తన నాకు ఏమాత్రం నచ్చలేదు. అందరిముందు చులకన చేసి మాట్లాడేవాడు. ఆయన వల్ల ఎంతో మానసిక వేదన అనుభవించాను. తన టార్చర్‌ భరించలేక చివర్లో ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వచ్చేశాను. 

నాకు క్రెడిట్‌ ఇవ్వలేదు
తీరా చూస్తే సినిమా క్రెడిట్స్‌లో నా పేరు వేయలేదు. అసిస్టెంట్‌ అని రాశారు. కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా మరో వ్యక్తికి క్రెడిట్‌ ఇచ్చారు. ఇది నన్ను అవమానించడం కాకపోతే ఇంకేమవుతుంది. పైగా నాకు ఇవ్వాల్సిన డబ్బు పూర్తిగా ముట్టజెప్పలేదు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న నాపై ఇలా కక్ష సాధింపు చర్యలు చేపట్టిన వారిని ఊరికే వదిలిపెట్టను. నా వల్ల సినిమాకు ఇబ్బంది ఉండకూడదనే రిలీజ్‌ అయ్యేవరకు ఆగాను. 

ఓటీటీలో అయినా..
ఇప్పుడు న్యాయపోరాటం చేస్తాను. కనీసం ఓటీటీలో విడుదల చేసేటప్పుడైనా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా సినిమాలో నా పేరు వేయాలని డిమాండ్‌ చేస్తున్నాను. అలాగే నా పట్ల దురుసుగా ప్రవర్తించినందుకుగానూ డైరెక్టర్‌ నాకు సారీ చెప్పాలి. మానసిక వేధింపులకు గురి చేసినందుకు పరిహారం చెల్లించాలి. నాలాంటి పరిస్థితి మరెవరికీ రాకూడదు అని లిజి పేర్కొంది.

చదవండి: గుడిలో కమెడియన్‌ పెళ్లి.. వధువు బ్యాక్‌గ్రౌండ్‌ ఇదే!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement