ప్రముఖ తమిళ దర్శకుడు గంగై అమరన్ రెండో కుమారుడు, నటుడు ప్రేమ్‌జీ 45 ఏళ్ల వయసులో పెళ్లి పీటలెక్కాడు. తిరుత్తణి మురుగన్ సాక్షిగా తన ప్రేమికురాలు ఇందు మెడలో మూడు ముళ్లు వేశాడు. ఆదివారం (జూన్ 9న) నిరాడంబరంగా జరిగిన వివాహ వేడుకల్లో అత్యంత సన్నిహితులు, బంధుమిత్రులు పాల్గొని, నూతన వధూవరులను ఆశీర్వదించారు. కాగా ప్రేమ్‌జీ.. సేలం నగరానికి చెందిన బ్యాంకు ఉద్యోగి ఇందును కొన్నేళ్లగా ప్రేమిస్తూ వచ్చాడు.
గుడిలో సింపుల్‌గా పెళ్లి
వీరి ప్రేమకు ఇరుకుటుంబాలు పచ్చజెండా ఊపాయి. ఈ క్రమంలో ఆదివారం నాడు తమిళనాడు తిరువళ్లూరులోని తిరుత్తణి సుబ్రహ్మణ్యస్వామి సాక్షిగా వివాహం చేసుకున్నారు. ఈ వేడుకకు సినీ తారలు రావడంతో తిరుత్తణి ఆలయంలో సందడి నెలకొంది. వారిని చూసేందుకు, సెల్పీ దిగేందుకు భక్తులు ఆసక్తి చూపారు. గంగై అమవరన్, అతడి పెద్ద కుమారుడు, సినీ దర్శకుడు వెంకట్‌ప్రభు సమక్షంలో హిందూ సంప్రదాయ పద్ధతిలో ఈ పెళ్లి జరిగింది.
కమెడియన్ ప్రేమ్‌జీ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
పీటలపై ప్రియురాలికి ముద్దు
తన ప్రేమికురాలు జీవిత భాగస్వామి కావడంతో ప్రేమ్‌జీ పెళ్లిపీటలపైనే ఇందును ముద్దాడి తన ఆనందాన్ని పంచుకున్నాడు. అనంతరం నూతన దంపతులు సుబ్రహ్మణ్యస్వామిని దర్శించుకుని, స్వామివారి ఆశీస్సులు పొందారు. వివాహ వేడుకల్లో సినీ నటులు శివ, జయ్, వైభవ్, సంతాన భారతి, కార్తీక్‌రాజ, సంగీత, గాయకులు ఎస్‌పీబీ. చరణ్, క్రిష్ సహా ప్రముఖులు పాల్గొన్నారు.
చదవండి: కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్.. నిజమేనా?
Comments
Please login to add a commentAdd a comment