కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్‌.. నిజమేనా? | Is Nimisha Sajayan Had Cosmetic Surgery? Rumours Goes Viral On Social Media | Sakshi
Sakshi News home page

కాస్మెటిక్ సర్జరీ చేయించుకున్న నిమిషా సజయన్‌.. నిజమేనా?

Published Mon, Jun 10 2024 8:49 AM | Last Updated on Mon, Jun 10 2024 11:11 AM

Nimisha Sajayan Have Cosmetic Surgery

నిమిషా సజయన్.. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ఈ నల్లకలువ తెలుగు వారందరికి కూడా పరిచయమే. చామనఛాయ, కుదురైన ఆకృతి, నటన తెలిసిన కళ్లు ఆమె ప్రత్యేకత. ముంబైలో పుట్టిపెరిగినా తన మూలాలు మాత్రం మలయాళంలోనే ఉన్నాయి. తన టాలెంట్‌తో సౌత్‌ ఇండియాలోని అన్ని భాషల్లోనూ నటిస్తుంది. 2017లో ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ తక్కువ సమయంలోనే గుర్తింపు తెచ్చుకుంది. రీసెంట్‌గా జిగర్తాండ డబుల్ ఎక్స్, చిన్నా, నాయట్టు (కోట బొమ్మాళి పీఎస్) వంటి చిత్రాలతో టాలీవుడ్‌ వారికి బాగా దగ్గరైంది.

తాజాగా ఈ బ్యూటీ కాస్మెటిక్ సర్జరీ చేపించుకున్నారని ప్రచారం జరుగుతుంది. నటి నిమిషా సజయన్ ప్రస్తుతం కాస్మెటిక్ సర్జరీ చర్చల అంశం మలయాళ పరిశ్రమలో చర్చ జరుగుతుంది. కెరీర్ ప్రారంభంలో ఆమెను చూసిన క్షణం నుంచి ప్రస్తుతం ఆమె ముఖం కొద్దిగా మారిపోయిందని వారు అంటున్నారు. దీనిపై కాస్మోటాలజిస్టుల అభిప్రాయం అందరినీ ఆకర్షిస్తోంది. ఇటీవల సోషల్ మీడియా ద్వారా దృష్టిని ఆకర్షించిన డాక్టర్ శిఖా, తాను కాస్మెటిక్ సర్జరీలు చేయించుకోలేదని చెప్పింది. నిమిషా ముఖంలో వచ్చిన మార్పులకు కారణాన్ని కూడా పంచుకున్నారు.

నిమిషా సజయన్‌ మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ బరువు తగ్గిందని ఆమె తెలిపింది. రింగులుగా ఉన్న ఆమె జుట్టు స్ట్రెయిట్ చేయబడింది. ఆమె పెదవిలోనూ ఏమీ మార్పులేదు. తన మొహంలో కూడా ఎలాంటి మార్పూ లేదని తాను అనుకుంటున్నట్లు డాక్టర్ శిఖా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం తన అందానికి ఫిదా అయిన చాలామంది నిమిషా సోషల్‌మీడియా ఖాతా కామెంట్ బాక్స్‌లో ప్రశంసిస్తున్నారు. సహజ సౌందర్యం ఉన్న గొప్ప నటి నిమిషా అని పలువురు వ్యాఖ్యానించారు. గత కొన్ని రోజులుగా నిమిషాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున సైబర్ ఎటాక్ జరుగుతోంది.

మలయాళ ప్రముఖ నటుడు సురేష్ గోపి త్రిసూర్ ఎన్నికల్లో గెలవలేరని ఆమె పబ్లిక్ ఫోరంలోనే కామెంట్‌ చేసింది. అయితే, తాజాగా సురేష్ గోపీ విజయం సాధించారు. దీంతో పాత ప్రస్తావన పేరుతో ఆమెపై ట్రోల్స్ వచ్చాయి. దీంతో ఆమె సోషల్ మీడియా కామెంట్ బాక్స్‌ను ఆఫ్ చేసింది. 
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement