Hari Hara Veera Mallu: Stylist Reveals Interesting Things About Pawan Kalyan Movie - Sakshi
Sakshi News home page

ఆసక్తికర విషయాలు వెల్లడించిన పవన్‌ స్టైలిష్ట్

Published Mon, Mar 15 2021 6:18 PM | Last Updated on Mon, Mar 15 2021 8:09 PM

Hari Hara Veera Mallu Movie Stylist Aishwarya Rajesh Reveals Interesting Things - Sakshi

పవర్‌ స్టార్‌ పవన్‌ కల్యాణ్‌ ప్రస్తుతం క్రిష్‌ డైరెక్షన్లో‌ ‘హరిహర వీరమల్లు’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. పిరియాడికల్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, టైటిల్‌ ఇటీవల చిత్ర యూనిట్‌ విడుదల చేసింది. ఇందులో పవన్‌ పోరాటయోధుడి దుస్తుల్లో కొత్తగా కనిపించాడు. దీంతో పవన్‌ కొత్త లుక్‌ చూసి ఆయన అభిమానులు మురిసిపోతున్నారు. ఈ తరుణంలో ఈ మూవీకి సంబంధించిన మరో క్రేజీ అప్‌డేట్‌ వైరల్‌గా మారింది. ఓ ఇంటర్వ్యూలో ‘హరిహర వీరమల్లు’లో పవన్‌ కల్యాణ్‌కు స్టైలిస్ట్‌గా వ్యవహరిస్తున్న ఐశ్వర్య రాజేష్‌ కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. 

‘హరిహర వీరమల్లు’లో పవన్‌ 3 డిఫరెంట్‌ లుక్స్‌తో, దాదాపు 30 రకాల కాస్ట్యూమ్స్‌ ధరించనున్నాడని ఆమె చెప్పింది. ఇక పవన్‌ మూవీ కోసం రెండు రకాల  కాస్ట్యూమ్స్‌ మాత్రమే ట్రయల్‌ చేసి మిగతా కాస్ట్యూమ్స్‌కు ఓకే చెప్పడం తనని ఆశ్చర్యానికి గురిచేసిందన్నారు. ఈ మూవీలో ఆయన చేతికి ధరించిన బ్రేస్‌లేట్‌ (కడియం), ఇతరత్రాల ఆభరణాలను తన బృందమే తయారు చేసిందని, ఇక కాస్ట్యూమ్స్‌ను కూడా ఆయన కోసం స్పెషల్‌గా తయారు చేసినట్లు పేర్కొన్నారు. 17 శతాబ్దం నాటి మొఘల్స్‌ కతుబ్‌ షాహిల కాలం నాటి బ్యాక్‌ డ్రాప్‌లో ఈ చిత్రం తెరకెక్కనున్నందున ఆనాటి వస్రాధారణకు ఏమాత్రం తీసిపోకుండా ఉండేందుకు దర్శకుడు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడన్నారు.

ఇందుకోసం తాము దేశంలోని పలు ప్రాంతాలు సందర్శించి పవన్‌ కల్యాణ్‌ అవుట్‌ ఫిట్స్‌ కోసం దాదాపు 1000 థాన్ల ఫ్యాబ్రిక్‌ తీసుకున్నట్లు ఆమె వివరించారు. కాగా ఈ సినిమాలో పవన్‌ సరసన నిధి అగర్వాల్‌, బాలీవుడ్‌ నటి జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌ హీరోయిన్‌లుగా నటిస్తున్నారు. ఇందులో బాలీవుడ్‌ నటుడు అర్జున్‌ రాంపాల్‌ ఓ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. మెగా సూర్య ప్రొడక్షన్‌ పతాకంపై ఎ. దయాకర్‌ రావు నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాకు ఎం. ఎం. కీరవాణి సంగీతం అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా విడుదల కానుంది. 

చదవండి: 
సర్‌ప్రైజ్‌: pspk27 టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ వచ్చేసింది
పవన్‌ కల్యాణ్‌ న్యూలుక్‌.. షాకవుతున్న ఫ్యాన్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement