స్టైలిష్‌గా కాబోయే అమ్మ .. | Maternity Wear brand Chikkommz by Aanchal Jaura and Aashna | Sakshi
Sakshi News home page

స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..

Published Fri, Feb 5 2021 12:36 AM | Last Updated on Fri, Feb 5 2021 3:54 AM

Maternity Wear brand Chikkommz by Aanchal Jaura and Aashna  - Sakshi

అమ్మాయిలకు డిజైన్‌ వేర్‌ తప్పనిసరి. అమ్మలకూ డ్రెస్‌ డిజైన్స్‌లో బోలెడన్ని ఎంపికలు ఉన్నాయి. కాబోయే అమ్మలకు సౌకర్యవంతమైన, స్టైలిష్‌ డిజైనర్‌ వేర్‌ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకున్నారు ఢిల్లీలో ఉంటున్న ఇద్దరు సోదరీమణులు.

ఆంచల్‌ జౌరా, ఆష్నా అనే అక్కాచెల్లెళ్ళిద్దరూ గర్భిణులకు అందమైన దుస్తుల రూపకల్పన చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. తమ బ్రాండ్‌ దుస్తులకు బాలీవుడ్‌ నటి కరీనాకపూర్‌ను బ్రాండ్‌ ఎంబాసిడర్‌గా తీసుకున్నారు. మాస్టర్స్‌ డిగ్రీ చేసిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ దారిని కాబోయే తల్లులవైపుగా ఎందుకు మళ్లించుకున్నారో వారినే అడిగితే ఎన్నో ఆసిక్తకర విషయాలు తెలుస్తాయి.

తక్కువ ఖర్చుతో డిజైనింగ్‌
    ఆంచల్‌ జౌరా, ఆష్నా షా ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘చిక్‌ మామ్జ్‌’ అనే పేరుతో ప్రసూతి వేర్‌ను రూపొందించారు. గర్భధారణలో ఉన్న కరీనా కపూర్‌ వాటిని ధరించి, మెరిసిపోయారు. ఆంచల్‌ మాట్లాడుతూ– ‘కరీనా కపూర్‌కు దుస్తులను డిజైన్‌ చేయడానికి మాకు అవకాశం లభించడం చాలా పెద్ద విషయం, ఇదంతా మా అమ్మ అందించిన స్ఫూర్తిగానే మేం భావిస్తున్నాం’ అని తెలియచేసింది. వీరిద్దరూ గర్భిణీ స్త్రీలకు సౌకర్యవంతమైన, స్టైలిష్, తక్కువ ఖర్చుతో ప్రసూతి దుస్తులను డిజైన్‌ చేస్తారు. ఆంచల్, అష్నా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్పూర్‌లో ఉండేవారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఐబిఎస్‌ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. కంప్యూటర్‌ సై¯Œ ్సలో ఇంజనీరింగ్‌ చేసిన అష్నా ఇంగ్లాండ్‌లో మాస్టర్స్‌ డిగ్రీ పొందింది.

గర్భిణులకు తక్కువ డ్రెస్సులు ఉండేవి
అష్నా మాట్లాడుతూ ‘నేను గర్భవతిగా ఉన్నప్పుడు చాలా వదులుగా ఉండే దుస్తులు కావాలనుకునేదాన్ని. అందుకు నా భర్త టీ షర్టు, కుర్తా ధరించేదాన్ని. ఆఫీసుకు వెళ్లడానికి చాలా తక్కువ డ్రెస్సులు ఉండేవి. మార్కెట్లో నేను చూసిన అన్ని ప్రసూతి దుస్తులు చాలా ఖరీదైనవి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా పొట్టను స్టైలిష్‌ లుక్‌లో ఆత్మవిశ్వాసంతో చూపించాలనుకునేదాన్ని. నా పొట్టను దాచాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అందుకు సరైన దుస్తులు ఉండేవి కావు. చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఈ ఇబ్బందిని గమనించి గర్భవతుల కోసం స్టైలిష్‌ దుస్తులను తీసుకువచ్చాం’ అని తెలిపింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement