two sisters
-
నడిపించేది నాన్న
కల నిజం అయ్యేది కష్టంతోనే. ఆర్థిక కష్టాల్లో ఉన్న ఆఫ్రీన్ కుటుంబానికి కలలు కనేంత వెసులుబాటు లేకపొవచ్చు. అయినా సరే.... ఆ తండ్రి కల కన్నాడు. ఆయన కూతురు కల కన్నది. ఆ కల సాకారం అయింది. ఖమ్మంకు చెందిన షేక్ ఆఫ్రీన్ జాతీయ స్థాయిలో అథ్లెట్‌గా రాణిస్తోంది....‘ఇది వేరే ప్రపంచం’ అనుకున్నారు అక్కాచెల్లెళ్లు సమ్రీన్, ఆఫ్రీన్. ఆ ప్రపంచం పేరు....స్టేడియం. ఖమ్మంలోని సర్దార్ పటేల్ స్టేడియంలో కొందరు రన్నింగ్ చేస్తున్నారు. కొందరు జంపింగ్ చేస్తున్నారు. ఒకవైపు క్రికెట్ ఆడుతున్నారు. కొందరు వాలీబాల్ ఆడుతున్నారు. వారి ఒంటికి పట్టిన చెమటల మాట ఎలా ఉన్నా...అందరి కళ్లల్లోనూ అంతులేని ఉత్సాహం పొంగిపొర్లుతుంది.ఆ ఉత్సాహమే పద్నాలుగు సంవత్సరాల ఆఫ్రీన్‌ను ఆ స్టేడియంకు దగ్గర చేసింది. ‘పప్పా... మేము నీతో పాటు రోజూ స్టేడియంకు వస్తాం’ అని అడిగారు. ఆఫ్రీన్ తండ్రి రహీమ్ హోంగార్డ్. స్పోర్స్›్టపర్సన్ కూడా. రోజూ తప్పకుండా స్టేడియంకు వచ్చి ఎక్సర్సైజ్లు చేయడం ఆయన దినచర్యలో భాగం. కుమార్తె విన్నపాన్ని విన్న రహీమ్... ‘అలాగే’ అన్నాడు. దీనికి ముందు ‘ఇక్కడికి వచ్చి ఏంచేస్తారు?’ అన్నాడు నవ్వుతూ. ‘మీలాగే ఎక్సర్సైజ్లు చేస్తాం’ అన్నారు సీరియస్‌గా.‘వీరిది ఒకటి రెండు రోజుల ఉత్సాహం. ఆ తరువాత అంతా మామూలే!’ అనుకున్నాడు రహీమ్. కానీ, అతడి అంచనా తప్పయింది. రకరకాల ఎక్సర్సైజ్లు చేయడం నుంచి ఆటల వరకు ఆఫ్రీన్‌కు స్టేడియం ప్రాణం అయింది. స్టేడియంకు రాని రోజూ అంటూ ఉండేది కాదు. ‘ఎప్పుడూ స్టేడియంలోనే కనిపిస్తావు. ఎప్పుడు చదువుకుంటావు!’ అని అడిగే వాళ్లు కొందరు.‘స్టేడియంలో కూడా చదువుకుంటూనే ఉన్నాను’ అని ఆఫ్రీన్ అన్నదో లేదు తెలియదుగానీ స్టేడియంలో తాను ఆటల ప్రపంచాన్ని చదువుతోంది. కట్ చేస్తే... షేక్ అఫ్రీన్ ప్రస్తుతం ఖమ్మంలోని ‘కవిత మెమోరియల్ డిగ్రీ కాలేజ్’లో బీఏ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. చదువుతో పాటు అథ్లెటిక్స్‌లోనూ రాణిస్తోంది. రాష్ట్ర, జాతీయ స్థాయిలో పొటీల్లో ఎన్నో పతకాలు సాధించింది. ఎంతో మంది పేదింటి అమ్మాయిలకు రోల్‌మోడల్‌గా నిలుస్తోంది. మొదట్లో కుమార్తెల ఉత్సాహానికి సంతోషపడిపొయిన రహీం ఆ ఇద్దరికి పరుగు పందెం నిర్వహించాడు. రన్నింగ్‌లో వారి ప్రతిభను చూసి ‘ఈ వజ్రాలకు సానబెట్టాల్సిందే’ అనుకున్నాడు. అదే సమయంలో కోచ్ గౌస్.... ‘ఆఫ్రీన్‌కు శిక్షణ ఇస్తే మంచి అథ్లెట్ అవుతుంది’ అన్నాడు. అతడి నోటి వాక్కు ఫలించింది. ఆఫ్రీన్ తో పాటు సమ్రీన్ కూడా అథ్లెటిక్స్‌లో రాణించింది. జాతీయ, రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్‌లో పాల్గొంది. ఆఫ్రీన్ ట్రాక్ రికార్డ్2016లో మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ 600 మీటర్ల పరుగులో మూడో స్థానం, 2017లో హైదరాబాద్‌లో జరిగిన తెలంగాణ స్టేట్ సబ్ జూనియర్స్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో 800 మీటర్ల పరుగులో మొదటిస్థానం, 400 మీటర్లలో రెండోస్థానంలో నిలిచింది. (నో జిమ్.. నో డైటింగ్ : ఏకంగా 20 కిలోల బరువు తగ్గింది!)2022లో జరిగిన తెలంగాణ స్టేట్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్లో 300 మీటర్ల పరుగులో ద్వితీయస్థానం, లాంగ్‌జంప్‌లో ద్వితీయస్థానం సాధించింది. 2023లో వరంగల్‌లో నిర్వహించిన సౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్‌జంప్‌లో 5వ స్థానంలో నిలిచింది. 2023లో కరీంనగర్లో జరిగిన తెలంగాణ సౌత్‌జోన్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో ట్రిపుల్ జంప్‌లో ద్వితీయస్థానంలో నిలిచింది. ఈ ఏడాది అక్టోబర్ 17 నుంచి 19 వరకు గుంటూరులోని నాగార్జున యూనివర్సిటీలో నిర్వహించినసౌత్ జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పొటీల్లో మిడిల్రిలేలో 3వ స్థానం సాధించింది.ఇంకా ఎన్నో సాధించాలి...సాధిస్తానుపొటీల్లో పాల్గొనేటప్పుడు ఆటపైనే ధ్యాస ఉంటుంది. ఫలితం గురించి ఆలోచించను. మా నాన్న కూడా అదే చెబుతారు. నీ వంతుగా శ్రమిస్తే ఓడిపొయినా ఫర్వాలేదని ధైర్యం చెబుతారు. నేను పొటీల్లో రాణించడానికి నాన్న, అమ్మ కష్టపడుతున్నారు. అమ్మ జమీలా అసలు చదువుకోలేదు. నేను అథ్లెటిక్స్‌లో పాల్గొన్న వీడియోలు చూస్తూ నన్ను అభినందిస్తోంది. దేశం తరుపున పొటీల్లో పాల్గొని ఎన్నో పతకాలు సాధించాలనేదే లక్ష్యం. – షేక్ ఆఫ్రీన్– బొల్లం శ్రీనివాస్, సాక్షి, ఖమ్మంఫొటోలు: రాధారపు రాజు -
కేశాలతో రూ. కోట్లు.. హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ అదుర్స్!
అందాల ప్రపంచంలో జుట్టుకున్న ప్రాధాన్యత గురించి తెలిసిందే. చాలా మంది భారతీయ మహిళలకు జుట్టు రాలడం, పొట్టి కేశాలు అనేవి తీవ్రవైన సమస్యలు. ఈ నేపథ్యంలో ఇటీవల హెయిర్ ఎక్స్టెన్షన్లకు ఆదరణ బాగా పెరిగింది. ఈ రహస్యాన్ని గ్రహించిన హైదరాబాదీ సిస్టర్స్ బిజినెస్ ప్రారంభించి కోట్లు సంపాదిస్తున్నారు. రిచా గ్రోవర్ భద్రుకా (Richa Grover Badruka), రైనా గ్రోవర్ (Raina Grover).. హైదరాబాద్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు. భారత్‌లో హెయిర్ ఎక్స్టెన్షన్లకు పెరుగుతున్న డిమాండ్‌ను అర్థం చేసుకున్నారు. 2019లో ఇన్స్టాగ్రామ్ కమ్యూనిటీగా తమ బ్రాండ్ ‘1 హెయిర్ స్టాప్’ (1 Hair Stop)ను ప్రారంభించారు. మొదట్లో రోజుకు 2-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు ఆర్డర్ల సంఖ్య 130-150కి పెరిగింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిన వీరి బిజినెస్ ఈ ఏడాది రూ. 31 కోట్లు ఆర్జించే దిశగా అడుగులు వేస్తోంది. అదే ప్రేరణ మహిళల జుట్టు సమస్యలకు ఏకైక పరిష్కారాలు మార్కెట్లో లేవని తాము గ్రహించామని, 1 హెయిర్ స్టాప్‌తో నిజమైన పరిష్కారాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని రిచా గ్రోవర్ భద్రుకా చెబుతున్నారు. భారత్ గ్లోబల్ హెయిర్ ఎగుమతిలో అగ్రగామిగా ఉన్నప్పటికీ, భారత మార్కెట్లో అంతరాన్ని గుర్తించడంతో వారి ప్రయాణం ప్రారంభమైంది. భారతీయ మహిళల ప్రత్యేక అవసరాలకు ప్రత్యేకంగా అధిక-నాణ్యత జుట్టు ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని నిర్ణయించుకున్నామని అని ఆమె పేర్కొంటున్నారు. కలిసొచ్చిన తండ్రి వ్యాపారం ఈ సిస్టర్స్ బిజినెస్ ప్రయాణంలో తమ వ్యక్తిగత నేపథ్యం కూడా కీలక పాత్ర పోషించింది. హైదరాబాద్‌లో పెరిగిన రిచాకు చిన్నప్పటి నుంచి అందం, ఫ్యాషన్‌పై మక్కువ ఎక్కువ. ఆమె తండ్రి ఒకటిన్నర దశాబ్దం పాటు జుట్టు వ్యాపారంలో ఉండటం కూడా ఆమె సంకల్పానికి కలిసొచ్చింది. చదువును పూర్తి చేసిన తర్వాత రిచా కుటుంబ వ్యాపారంలో చేరారు. భారతీయ మార్కెట్‌కు నేరుగా సేవలందించే లక్ష్యంతో 2019లో ‘1 హెయిర్ స్టాప్’ను ప్రారంభించే ముందు ఆమె మొదట్లో హోల్‌సేల్ ఎగుమతులపై దృష్టి సారించారు. స్టార్టప్‌గా ప్రారంభమై.. స్టార్టప్‌గా ప్రారంభమైన ‘1 హెయిర్ స్టాప్’ మంచి వృద్ధిని సాధించింది. నేడు ఆధిపత్య పరిశ్రమగా అభివృద్ధి చెందుతోంది. ప్రారంభంలో రోజుకు కేవలం 1-3 ఆర్డర్లు వచ్చేవి. ఇప్పుడు రోజుకు 150-160 ఆర్డర్లు వస్తున్నాయి. ప్రారంభ రోజులలో కేవలం రూ. 10,000 మార్కెటింగ్ బడ్జెట్ ఉండేది. ఇప్పుడు మార్కెటింగ్ కోసం నెలకు రూ. 10-16 లక్షలు ఖర్చు పెడుతున్నారంటే వారి బిజినెస్ ఏ స్థాయిలో పెరిగిందో అర్థం చేసుకోవచ్చు. తమ ఉత్పత్తులను బయటి దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. 1 హెయిర్ స్టాప్ ఆదాయంలో 75 శాతం భారత్ నుంచి వస్తుంటే మిగిలినది అమెరికా, యూకే, కెనడా, ఆస్ట్రేలియా, యూఏఈ, సింగపూర్ వంటి దేశాల నుంచి వస్తోంది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు 1 హెయిర్ స్టాప్ ఇప్పటివరకూ 1.2 లక్షలకు పైగా ఆర్డర్లను అందుకుంది. 2.1 లక్షలకు పైగా ఉత్పత్తులను విక్రయించింది. మొత్తం అమ్మకాలు రూ. 61 కోట్లు దాటాయి. 2022 ఆ సంస్థకు అత్యంత లాభదాయకమైన సంవత్సరం. ఎందుకంటే ఆ సంవత్సరంలో కంపెనీకి 47,000 ఆర్డర్లు రాగా 90,000 ఉత్పత్తులను విక్రయించింది. 2022-23లో రూ. 27 కోట్ల ఆదాయాన్ని సాధించింది. ట్రెండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు కొత్త తరం అమ్మాయిలు హెయిర్‌స్టైల్‌తో ప్రయోగాలు చేయడానికి ఇష్టపడతారు. క్లీన్ గర్ల్ ఈస్తటిక్, ఫెయిరీ గర్ల్ ట్రెండ్, బార్బీ కోర్ ఈస్తెటిక్ హెయిర్ స్టైల్స్ ప్రస్తుతం ట్రెండింగ్‌లో ఉన్నాయి. వీటన్నింటికీ హెయిర్ ఎక్స్టెన్షన్లు అవసరం. దీనికి అగుణంగా 1 హెయిర్ స్టాప్ పోర్ట్‌ఫోలియోలో కలర్‌ఫుల్ స్ట్రీక్స్, మెస్సీ బన్స్, పోనీ టెయిల్స్, ఫ్లైఫిక్స్, లేస్, సిల్క్ టాపర్లు ఉన్నాయి. హైదరాబాద్‌లో ఎక్స్పీరియన్స్ సెంటర్‌ని ప్రారంభించడం ద్వారా ఆఫ్‌లైన్ స్పేస్‌లోకి ప్రవేశించాలని 1 హెయిర్ స్టాప్ యోచిస్తోంది. అదనంగా బ్రాండ్ తన హెయిర్‌కేర్ శ్రేణిని విస్తరించడం, సెలూన్ నెట్‌వర్క్‌లతో సహకారాన్ని అన్వేషించడం, సెమీ-పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్లను భారతీయ కస్టమర్లకు పరిచయం చేయడంపై దృష్టి సారించింది. -
వింత మనుషులు.. చీకటి గదిలో నుంచి వెలుగులోకి..
అనంతపురం శ్రీకంఠంసర్కిల్: మూడేళ్లుగా చీకటి గదిలో మగ్గిన జీవితాల్లో వెలుగులు నిండాయి. స్వీయ నిర్బంధంలో ఉన్న అన్నా చెల్లెళ్లు పోలీసుల చొరవతో జనంలోకి వచ్చారు. అనంతపురం నగరంలోని వేణుగోపాల్ నగర్ ఆటోస్టాండ్ సమీపంలో నివాసముండే అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి తల్లిదండ్రుల మరణంతో తీవ్రంగా కుంగిపోయి స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. ఇంటి నుంచి వచ్చే దుర్గంధాన్ని భరించలేక స్థానికులు పోలీసులకు తెలపడంతో ఈ అన్నా చెల్లెళ్ల దయనీయ స్థితి వెలుగులోకి వచ్చింది. చదవండి: ఛీ..ఛీ..ఇదేం పాడు పని...ఫ్యామిలీ రెస్టారెంట్లో... శుక్రవారం సాయంత్రం పోలీసులు వారి ఇంటికి వచ్చి అన్నా చెల్లెళ్లతో మాట్లాడారు. తిరిగి శనివారం ఉదయం స్థానిక కార్పొరేటర్ సుజాత, ఇన్చార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, మునిసిపల్ కమిషనరు కె.భాగ్యలక్ష్మి వారి ఇంటికి వెళ్లారు. మురికి కూపంగా ఉన్న బాధితుల ఇంటిని శుభ్రం చేయించారు. విద్యుత్తు, నీటి సరఫరాను పునరుద్ధరించారు. అన్నా చెల్లెళ్లకు ఆహారం, కొత్త దుస్తులు అందజేశారు. అన్నా చెల్లెళ్లకు స్నానం చేయించి, దుస్తులు మార్చి జన జీవన స్రవంతిలోకి తెచ్చారు. ఇన్నాళ్లూ ఆ ఇంటిని చూసి భయపడిన వీధిలోని చిన్నారులు సైతం వారితో మాట్లాడేలా పోలీసులు మమేకం చేశారు. జిల్లా ఎస్పీ ఆదేశాలతో వీరికి ఈ సహాయం చేసినట్లు ఇన్చార్జి డీఎస్పీ తెలిపారు. నాడెంతో వైభవం శ్రీ సత్యసాయి జిల్లా బత్తలపల్లి మండలం దంపెట్ల చెర్లోపల్లికి చెందిన అంబటి రామయ్య, అనంతపురం జిల్లా ఆత్మకూరు మండలం మదిగుబ్బకు చెందిన లక్ష్మిదేవి దంపతులు 50 ఏళ్ల క్రితం అనంతపురానికి వచ్చి స్థిరపడ్డారు. వీరికి ముగ్గురు ఆడపిల్లలు, ఒక కుమారుడు సంతానం. స్థానిక పాతూరు పూల మండీల పక్కనే ఉన్న వీధిలో అంబటి రామయ్య హోటల్ నడిపేవారు. బాగానే సంపాదించారు. పెద్ద కుమార్తెను కనగానపల్లి మండలం భానుకోటకు చెందిన వ్యక్తికి ఇచ్చి వివాహం చేశారు. అప్పటికే అల్లుడికి మరో మహిళతో పెళ్లయిందని తెలిసి కుమార్తెను ఇంటికి తెచ్చుకున్నారు. చిన్న కుమార్తె ప్రేమ వివాహం చేసుకుంది. రామయ్య వయసు మళ్లి కొన్నేళ్ల క్రితం చనిపోయారు. మూడేళ్ల క్రితం భార్య లక్ష్మీదేవి కూడా మృతి చెందింది. తల్లిదండ్రుల మరణం తర్వాత అన్నా చెల్లెళ్లు తిరుపాల్, కృష్ణవేణి, లక్ష్మి కుంగిపోయారు. పిల్లలను చిన్నప్పటి నుంచి పెద్దగా బయటకు పంపకపోవడంతో అటు బంధువులు, ఇటు ఆత్మీయులు పెద్దగా లేరు. చిన్న చెల్లెలు, ఆమె భర్త ఎప్పుడైనా ఇంటికి వెళ్లినా, అన్నా చెల్లెళ్లు వారిని కూడా పెద్దగా పట్టించుకోలేదు. దీంతో క్రమేణా వారూ దూరమయ్యారు. తిరుపాల్ బయటకు వెళ్లినప్పుడు ఏదో ఒకటి తేవడం, దాంతోనే ముగ్గురూ సరిపెట్టుకోవడంతో బక్కచిక్కిపోయారు. చివరకు స్థానికుల సమాచారంతో పోలీసులు స్పందించి వారికి కొత్త వెలుగు ప్రసాదించారు. -
వైరల్ ప్రధాని మెచ్చారు!
జాతీయోద్యమ కాలంలో పాట చూపించిన ప్రభావం తక్కువేమీ కాదు. ఊరూరు తిరిగింది... ఉర్రూతలూగించింది. అణువణువులో దేశభక్తి నింపుకొని కదం తొక్కింది.... పాట బలమైన ఆయుధం అయింది. అలాంటి తమిళ దేశభక్తి గీతం ఒకటి ఇప్పుడు సామాజిక వేదికలలో వైరల్ అయింది. ‘అద్భుతం’ అనిపించిన ఆ పాటను ఆలపించింది తమిళులు కాదు... అరుణాచల్‌ప్రదేశ్‌కు చెందిన అక్కాచెల్లెళ్లు... అశప్‌మై, కుమారి బెహల్టీలు స్వాతంత్య్ర సమరయోధుడు, మహాకవి సుబ్రహ్మణ్య భారతి రాసిన తమిళ దేశభక్తి గేయం ‘పారుక్కుళ్లే నల్ల నాళ్ ఎంగళ్ భారతినాడు’ను ఆలపించారు. ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మొదటిసారి ఈ వీడియోను అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి పేమా ఖండూ ట్విట్టర్లో పోస్ట్ చేసి ప్రశంసావాక్యాలు రాశారు. 24 నిమిషాల నిడివి ఉన్న ఈ వీడియోను చూసిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ట్విట్టర్లో స్పందించారు. ‘ఈ వీడియోను చూసి చాలా సంతోషంగా, గర్వంగా అనిపించింది. ఈ షైనింగ్ స్టార్స్‌కు అభినందనలు తెలియజేస్తున్నాను. అరుణాచల్ సిస్టర్స్ గొంతులో వినిపించిన తమిళదేశభక్తి గీతం ఏక్ భారత్, శ్రేష్ఠభారత్ స్ఫూర్తిని చాటుతుంది’ అని ట్వీట్ చేశారు ప్రధాని. ఇక సోషల్ మీడియా ‘కామెంట్ సెక్షన్’లో దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రశంసలు వచ్చాయి. ‘అచ్చం తమిళ సిస్టర్స్ పాడినట్లుగానే ఉంది’ అని ఎంతోమంది అరుణాచల్ ప్రదేశ్ సిస్టర్స్‌ను ఆకాశానికెత్తారు. ‘మా అమ్మాయిలు కూడా అరుణాచల్‌ప్రదేశ్‌లోని గొప్పదేశభక్తి పాటలు పాడడానికి సిద్ధం అవుతున్నారు’ అని ఒక తమిళియన్ కామెంట్ పెట్టాడు. ‘మన దేశంలో ఎన్నో రాష్ట్రాలలో ఎన్నో దేశభక్తి గీతాలు ఉన్నాయి. అవి ఆ రాష్ట్రానికి మాత్రమే పరిమితమై పోకుండా, అందరికీ సుపరిచితమై పోవాలంటే ఇలాంటి ప్రయత్నాలు మరిన్ని జరగాలి’ అని ఒకరు స్పందించారు. మంచిదే కదా! -
స్మార్ట్‌గా నేర్చుకున్నారు
నీటి కొలనులో నుంచి పైకి ఉద్భవిస్తున్నట్లున్న నిండు చంద్రుడి పెయింటింగ్ పౌర్ణమిని డ్రాయింగ్ రూమ్‌లోకి తెచ్చినట్లుంది. ఒకరినొకరు తదేకంగా చూసుకుంటున్న రాధాకృష్ణుల చిత్రం... ఎన్నెన్నో ప్రశ్నలతో మనసును ఊపిరాడనివ్వదు. జుట్టు ముడిచుట్టిన ఆదివాసీ మహిళ చిత్రం... ఆధునికత ఫ్యాషన్ రీతులను ప్రశ్నిస్తున్నట్లు ఉంటుంది. వీటితోపాటు సూర్యోదయం, సూర్యాస్తమయాలు ఆ ఇంటి గోడల మీద వచ్చి వాలాయి. అడవిలో ఎగురుతున్న జింక ఈ ఇంట్లోకి తొంగి చూడడానికి వచ్చినట్లుంది ఓ చిత్రం. వీటి పక్కనే ఒక హృదయాకారంలో ‘ఐ లవ్ యూ అమ్మా’ అనే అక్షరాలు ఆ పెయింటింగ్‌ని మళ్లీ మళ్లీ చూడాలనిపిస్తున్నాయి. హైదరాబాద్, ఈసీఐఎల్ సమీపంలోని సాయినాథపురంలోని ప్రశంస, అభిజ్ఞల ఇల్లు ఇది. ఈ బొమ్మలు వేసిన పిల్లలు అచ్చంగా పిల్లల్లాగా, స్వచ్ఛతకు ప్రతీకల్లా ఉన్నారు. ప్రశంస తొమ్మిదవ తరగతి, అభిజ్ఞ ఏడవ తరగతి. వీళ్లకు బొమ్మలు వేయడం నేర్పిన గురువు టెక్నాలజీ. నిజమే! ఆశ్చర్యంగా ఉన్నప్పటికీ ఇది నిజం. కరోనా కారణంగా లాక్డౌన్ ప్రపంచాన్ని స్తంభింపచేస్తే ఈ పిల్లలిద్దరూ ఆ విరామాన్ని పెయింటింగ్ శిక్షణకు ఉపయోగించుకున్నారు. ఒకరి ఇంటికి మరొకరు వెళ్లడానికి భయపడే కోవిడ్ కాలంలో వాళ్లకు బొమ్మలు వేయడం నేర్పించడానికి ఏ గురువు కూడా ఇంటికి వచ్చే సాహసం చేయలేరు. ఏ గురువు కూడా తమ ఇంటికి శిష్యులను స్వాగతించే పరిస్థితి కూడా కాదు. అలాంటప్పుడు యూ ట్యూబ్ చూస్తూ పెయింటింగ్ వేయడం నేర్చుకున్నారు. రోజుకొక పెయింటింగ్ వీడియో చూస్తూ సొంతంగా ప్రాక్టీస్ చేస్తూ పూర్తి స్థాయి చిత్రకారులైపోయారు. ఏ చిత్రానికి ఏ తరహా రంగులు వాడాలో, ఎంత మోతాదులో మిశ్రమాలను కలుపుకోవాలో కూడా నేర్చుకున్నారు. లాక్డౌన్ కాలం పిల్లల బాల్యాన్ని హరించిందని, స్తబ్దుగా మార్చేసిందని ఆందోళన పడుతుంటాం. కానీ కాలం అందరికీ సమానమే. ఎవరికైనా రోజుకు ఉన్నది ఇరవై నాలుగ్గంటలే. ఆ ఇరవై నాలుగ్గంటలను ఉపయోగపెట్టుకునే వాళ్లు, నిరర్ధకంగా గడిపేసే వాళ్లూ ఉన్నట్లే... ఈ అక్కాచెల్లెళ్లు లాక్డౌన్ కాలంలో చిత్రకారిణులుగా నైపుణ్యం సాధించారు. తోటి పిల్లలకు మార్గదర్శనంగా నిలుస్తున్నారు. పిల్లలందరికీ హ్యాపీ చిల్డ్రన్స్ డే. ప్రశంస, అభిజ్ఞ ఫోన్ చేతికి వచ్చింది! ‘‘నేను పదవ సంవత్సరం నుంచి బొమ్మలేస్తున్నాను. స్కూల్లో డ్రాయింగ్ కాంపిటీషన్లలో పాల్గొన్నాను కూడా. లాక్డౌన్లో రోజంతా ఇంట్లోనే ఉండేవాళ్లం. బోర్ కొట్టేది. ఆన్లైన్ క్లాసుల కోసమని అమ్మానాన్న వాళ్ల స్మార్ట్ ఫోన్లు నాకు చెల్లికి ఇచ్చేశారు. క్లాస్‌లు అయిపోయిన తర్వాత నేను యూ ట్యూబ్ సెర్చ్ చేస్తూంటే పెయింటింగ్ క్లాసుల వీడియోలు కనిపించాయి. అప్పటి నుంచి రోజూ వీడియోలు చూస్తూ నోట్స్ రాసుకునేదాన్ని. అక్రిలిక్ కలర్స్, వాటర్ కలర్స్, ఆయిల్ పెయింటింగ్స్‌లో ఏ పెయింటింగ్‌కి ఏది వాడాలో వచ్చేసింది. ఈ ఏడాది కాలంగా నేను వందకు పైగా బొమ్మలు వేశాను. మధుబని, రంగోలి ఆర్ట్‌లు, రవీంద్రనాథ్ టాగూర్, స్వామి వివేకానంద పోట్రయిట్‌లు వేశాను. పెద్ద ఆర్టిస్ట్‌ను కావాలనేది నా లక్ష్యం. టెన్త్ క్లాస్ తర్వాత పెయింటింగ్ కోసం ఎక్కువ టైమ్ ప్రాక్టీస్ చేస్తాను’’. -
‘నాన్న కష్టం చూడలేక’.. సూర్యుడి కంటే ముందే డ్యూటీ
ఈ ఇద్దరమ్మాయిలు... అక్కాచెల్లెళ్లు. అక్క ఇంటర్ ఫస్టియర్... చెల్లి టెన్త్ క్లాస్. ఇద్దరూ ధైర్యానికి ప్రతీకలుగా నిలుస్తున్నారు. నాన్న కోసం కష్టమైన పనిని ఇష్టంగా అందుకున్నారు. ఆడపిల్లలు చేయని సాహసానికి సిద్ధమయ్యారు. చీకటి చీల్చడానికి సూర్యుడు డ్యూటీ చేస్తాడు. ఆ సూర్యుడికంటే ముందే వీళ్ల డ్యూటీ మొదలవుతుంది. సూర్యుడు వెలుతురును పంచేలోపు... ఈ అక్కాచెల్లెళ్లు అక్షరాల వెలుగును పంచుతున్నారు. నాన్నకు ఎదురైన కష్టాన్ని పంచుకున్నారు. ఇంటి చీకటిని తొలగిస్తున్న కాంతి వీచికలయ్యారు. తెలతెలవారుతోంది. హైదరాబాద్ నగర వీథుల్లో రోడ్డు మీద మాణింగ్ వాకింగ్ చేసే వాళ్లు, వీథులు చిమ్మేవాళ్లు తప్ప మనుష్య సంచారం పెద్దగా లేదు. ఓ అమ్మాయి రయ్యిమంటూ స్కూటీ మీద వచ్చి ఓ ఇంటి ముందు ఆగింది. న్యూస్ పేపర్ని రోల్ చుట్టి ఇంటి బాల్కనీలోకి విసిరేసింది. మరో కాలనీలో అంతకంటే చిన్నమ్మాయి ఇంటింటికీ వెళ్లి న్యూస్ పేపర్ వేస్తోంది. ఓ ఇంటి ముందు అప్పటికే నిద్రలేచి ఉన్న ఓ పెద్దావిడ నవ్వుతూ ఆ అమ్మాయిని పలకరించింది. ‘‘ఆడపిల్ల ఇంత ధైర్యంగా పొద్దున్నే ఇలా ఇంటింటికీ వచ్చి పేపర్ వేయడం చూస్తుంటే ఆశ్చర్యం వేస్తోందమ్మాయ్! అయినా ఇంత కష్టమైన పనికి ధైర్యంగా ముందుకు రావడం గొప్ప విషయమే. జాగ్రత్త తల్లీ’’ అని జాగ్రత్త చెప్పిందా పెద్దావిడ. ‘‘అలాగే మామ్మ గారూ!’’ అని ఆ అమ్మాయి కూడా నవ్వుతూ మామ్మగారికి టాటా చెప్పి మరో ఇంటిదారి పట్టింది. న్యూస్‌పేపర్ డెలివరీ చేస్తున్న ఈ అమ్మాయిలు కెలావత్ ప్రమీల, పవిత్ర. హైదరాబాద్, బోరబండ, శివమ్మ బాపురెడ్డి హిల్స్‌లో నివసిస్తున్నారు. రోజూ ఉదయం ఐదింటికే నిద్రలేచి ఆరు లోపు మోతీనగర్ చౌరస్తాలోని పేపర్ పాయింట్‌కు చేరుకుంటారు. ఏడు గంటల లోపు మోతీనగర్ చుట్టు పక్కల ఐదారు కాలనీల్లో పేపర్ వేసేసి, ఇంటికి వచ్చి రిఫ్రెష్ అయ్యి ఆన్లైన్ క్లాసులకు సిద్ధమవుతారు. పవిత్ర టెన్త్ క్లాస్, ప్రమీల ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నారు. కరోనా ప్రపంచాన్ని కుదిపేసింది. ఈ కుటుంబానికి కూడా పరీక్ష పెట్టింది. బాయ్స్ మానేశారు ‘‘మా నాన్నకు న్యూస్ పేపర్ లైన్ ఉంది. ఇరవై ఏళ్లుగా పేపర్లు వేస్తున్నాడు. నాన్న దగ్గర బాయ్స్ ఉండేవాళ్లు. మా లైన్లో మొత్తం ఏడు వందల పేపర్లు పడేవి. కరోనా కారణంగా చాలా మంది పేపర్ మానేశారు. బాయ్స్ కూడా పని మానేశారు. కరోనా భయం తగ్గిన తర్వాత కొందరు బాయ్స్ మళ్లీ వచ్చారు. కానీ అప్పటికే పేపర్ కాపీలు బాగా తగ్గిపోయాయి. బాయ్స్‌కు ఒక్కొక్కరికి వెయ్యి, పన్నెండు వందలు ఇవ్వాలంటే నాన్నకు కుదిరేది కాదు. బాయ్స్ లేకుండా అన్ని ఇళ్లకూ నాన్న ఒక్కడే వేయాలంటే టైమ్ సరిపోయేది కాదు. పేపర్ లేటుగా వేస్తే కోప్పడతారు కదా! పైగా నాన్న పేపర్ వేసిన తరవాత ఫిల్మ్ నగర్లో రేషన్ షాపులో ఉద్యోగానికి వెళ్లాలి. నాన్న అటూ ఇటూ పరుగులు తీయాల్సి వచ్చేది. నాన్న కష్టం చూస్తుంటే బాధనిపించేది. దాంతో ‘మేము పేపర్ వేస్తాం నాన్నా’ అని నాన్నని ఒప్పించాం’’ అని చెప్పింది ప్రమీల. రోజూ పేపర్ చదువుతాం నాన్న పనిలో ఉండడం వల్ల మాకు రోజూ ఇంగ్లిష్, తెలుగు పేపర్లు చదవడం అలవాటైంది. మేము చదివేది ఇంగ్లిష్ మీడియమే, కానీ చిన్నప్పటి నుంచి పేపర్లు చదవడం వల్ల తెలుగు కూడా బాగా వచ్చేసింది’’ అని చెప్పారు ప్రమీల, పవిత్ర. బాగా చదువుకుని పోలీస్ ఆఫీసర్ అవుతామని చెప్తున్న ఈ అక్కాచెల్లెళ్ల సాహస ప్రస్థానం పలువురికి స్ఫూర్తిదాయకం. మెచ్చుకుంటున్నారు! లాక్డౌన్ పోయి అన్‌లాక్ మొదలైంది. కానీ పరిస్థితులు మాత్రం పూర్వపు స్థితికి చేరనేలేదు. పేపర్‌తో కరోనా రాదని తెలిసిన తర్వాత కూడా కాపీలు ముందులాగ పెరగలేదు. ఇప్పుడు మా లైన్లో మూడు వందల కాపీలు వేస్తున్నాం. మేము పేపర్ వేసే ఇళ్లలో పెద్ద వాళ్లు చాలామంది మమ్మల్ని పలకరించి మాట్లాడతారు. ‘ఆడపిల్లలు బాగా చదువుకోవాలి, అన్ని పనుల్లోనూ ముందుకు రావాలమ్మా. మిమ్మల్ని చూస్తే ముచ్చటేస్తోంది’ అంటారు. – ప్రమీల పేపర్ల మధ్య పెరిగాం! మేము చిన్నప్పుడు సెలవుల్లో నాన్న పేపర్ వేయడానికి వెళ్తుంటే మారం చేసి మరీ నాన్న స్కూటీ మీద వెళ్లే వాళ్లం. ఈ కాలనీలన్నీ మాకు బాగా తెలుసు. పేపర్ల మధ్యనే పెరిగాం. ఏ కాలనీలో ఏ పేపర్ ఎన్ని కాపీలు వేయాలనే లెక్క కూడా త్వరగానే తెలిసింది. మాకిద్దరికీ స్కూటీ నేర్పించాడు నాన్న. మా అక్క రూట్లో ఇళ్లు ఒకదానికొకటి దూరంగా ఉన్నాయి. తను స్కూటీ మీద వెళ్తుంది. దగ్గర దగ్గరగా ఉన్న ఎనభై పేపర్ల రూట్ నాది. పేపర్ వేసిన తరవాత నాన్న, అక్క, నేను ముగ్గురం కలిసి ఇంటికి వెళ్తాం – పవిత్ర – వాకా మంజులారెడ్డి -
నా చెల్లికి కూడా తాళి కట్టాల్సిందే: సుప్రియ
కోలారు: నాటకీయ పరిణామాల మధ్య అక్కా చెల్లెళ్లను ఒక్కరే పెళ్లాడడం సాధారణంగా సినిమాల్లో చూస్తుంటాం. ఇటువంటి వింతలు నిజజీవితంలో అరుదుగా జరుగుతుంటాయి. కర్ణాటకలోని కోలారు జిల్లా ముళబాగిలు తాలూకాలోని వేగమడుగు గ్రామంలో ఇది జరిగింది. తన చెల్లిని కూడా వివాహం చేసుకోవాలని అక్క కాబోయే భర్తను పట్టుబట్టి ఒప్పించడం విశేషం. వివరాలు.. తాలూకాలోని తిమ్మరావుతనహళ్ళి గ్రామ పంచాయతీ వేగమడుగు గ్రామానికి చెందిన రాణెమ్మ, నాగరాజప్ప రైతు దంపతుల కుమార్తెలు సుప్రియ, లలితలు. చెల్లెలు లలిత మూగ–బధిర. ఆమెను ఎవరు పెళ్లి చేసుకుంటారని అక్క సుప్రియ బాధపడేది. పెళ్లిపీటలపై మెలిక ఈ తరుణంలో సుప్రియకు బాగేపల్లికి చెందిన ఉమాపతి అనే యువకునితో పెళ్లి నిశ్చయమైంది. ఈ నెల 7వ తేదీన పెళ్లి మండపంలో వరుడు తాళి కట్టబోతుండగా సుప్రియ తన ఆలోచనను చెప్పింది. చెల్లిని కూడా నీవు పెళ్లాడితే కానీ ఈ వివాహం జరగదని మొండికేయడంతో పెద్దల అనుమతితో ఉమాపతి ఇద్దరికీ మాంగళ్యధారణ చేశాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూడగా సోషల్ మీడియాలో ఇద్దరు భామల ముద్దుల మొగుడు వైరల్ అవుతున్నాడు. మరోవైపు వధువు లలితకు ఇంకా 18 ఏళ్లు దాటలేదని తెలియడంతో శిశు సంక్షేమ, పోలీసు అధికారులు వచ్చి వరుడు సహా ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు తెలిసింది. -
స్టైలిష్‌గా కాబోయే అమ్మ ..
అమ్మాయిలకు డిజైన్ వేర్ తప్పనిసరి. అమ్మలకూ డ్రెస్ డిజైన్స్‌లో బోలెడన్ని ఎంపికలు ఉన్నాయి. కాబోయే అమ్మలకు సౌకర్యవంతమైన, స్టైలిష్ డిజైనర్ వేర్ ఎందుకు ఉండకూడదు అని ప్రశ్నించుకున్నారు ఢిల్లీలో ఉంటున్న ఇద్దరు సోదరీమణులు. ఆంచల్ జౌరా, ఆష్నా అనే అక్కాచెల్లెళ్ళిద్దరూ గర్భిణులకు అందమైన దుస్తుల రూపకల్పన చేస్తూ అందరి మెప్పు పొందుతున్నారు. తమ బ్రాండ్ దుస్తులకు బాలీవుడ్ నటి కరీనాకపూర్‌ను బ్రాండ్ ఎంబాసిడర్‌గా తీసుకున్నారు. మాస్టర్స్ డిగ్రీ చేసిన ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు తమ దారిని కాబోయే తల్లులవైపుగా ఎందుకు మళ్లించుకున్నారో వారినే అడిగితే ఎన్నో ఆసిక్తకర విషయాలు తెలుస్తాయి. తక్కువ ఖర్చుతో డిజైనింగ్ ఆంచల్ జౌరా, ఆష్నా షా ఈ ఇద్దరు అక్కచెల్లెళ్లు ‘చిక్ మామ్జ్’ అనే పేరుతో ప్రసూతి వేర్‌ను రూపొందించారు. గర్భధారణలో ఉన్న కరీనా కపూర్ వాటిని ధరించి, మెరిసిపోయారు. ఆంచల్ మాట్లాడుతూ– ‘కరీనా కపూర్‌కు దుస్తులను డిజైన్ చేయడానికి మాకు అవకాశం లభించడం చాలా పెద్ద విషయం, ఇదంతా మా అమ్మ అందించిన స్ఫూర్తిగానే మేం భావిస్తున్నాం’ అని తెలియచేసింది. వీరిద్దరూ గర్భిణీ స్త్రీలకు సౌకర్యవంతమైన, స్టైలిష్, తక్కువ ఖర్చుతో ప్రసూతి దుస్తులను డిజైన్ చేస్తారు. ఆంచల్, అష్నా ఉత్తర్‌ప్రదేశ్‌లోని సహారన్పూర్లో ఉండేవారు. ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రులయ్యారు. ఆ తర్వాత ముంబైలోని ఐబిఎస్ నుంచి ఎంబీఏ పట్టా పొందారు. కంప్యూటర్ సై¯Œ ్సలో ఇంజనీరింగ్ చేసిన అష్నా ఇంగ్లాండ్‌లో మాస్టర్స్ డిగ్రీ పొందింది. గర్భిణులకు తక్కువ డ్రెస్సులు ఉండేవి అష్నా మాట్లాడుతూ ‘నేను గర్భవతిగా ఉన్నప్పుడు చాలా వదులుగా ఉండే దుస్తులు కావాలనుకునేదాన్ని. అందుకు నా భర్త టీ షర్టు, కుర్తా ధరించేదాన్ని. ఆఫీసుకు వెళ్లడానికి చాలా తక్కువ డ్రెస్సులు ఉండేవి. మార్కెట్లో నేను చూసిన అన్ని ప్రసూతి దుస్తులు చాలా ఖరీదైనవి. ప్రెగ్నెంట్‌గా ఉన్నప్పుడు నా పొట్టను స్టైలిష్ లుక్‌లో ఆత్మవిశ్వాసంతో చూపించాలనుకునేదాన్ని. నా పొట్టను దాచాలని ఎప్పుడూ అనుకోలేదు. కానీ, అందుకు సరైన దుస్తులు ఉండేవి కావు. చాలా ఇబ్బందిగా అనిపించేది. అందుకే ఈ ఇబ్బందిని గమనించి గర్భవతుల కోసం స్టైలిష్ దుస్తులను తీసుకువచ్చాం’ అని తెలిపింది. -
ఘోరం: అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై ఈడ్చుకెళ్లారు
సాక్షి, కోల్‌కతా: తమకు చెందిన భూమిలో తలపెట్టిన రోడ్డు నిర్మాణాన్ని అడ్డుకున్న అక్కాచెల్లెళ్లను నడిరోడ్డుపై కొట్టి, ఈడ్చుకెళ్లిన దారుణ ఘటన శుక్రవారం పశ్చిమ బెంగాల్లో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్మృతి ఇరానీ దాస్ స్థానిక పాఠశాలలో ఉపాధ్యాయురాలినిగా పని చేస్తోంది. తన తల్లి, సోదరితో కలిసి ఫటా నగర్లో నివాసముంటోంది. గతంలో పంచాయతీ రోడ్డు నిర్మాణం కోసం వీరికి చెందిన భూమిలో కొంత భాగాన్ని అప్పగించారు. అయితే గ్రామ పంచాయతీ మరోసారి రోడ్డు వెడల్పు చేయాలని భావించగా వారు దీనికి ఒప్పుకోలేదు. దీనివల్ల తమ భూమిలో ఎక్కువ మొత్తాన్ని కోల్పోతామని దీనికి వారు ససేమిరా అన్నారు. అయితే ఇదేదీ పట్టని పంచాయతీ పెద్దలు జేసీబీతో సహా ఇంటికి చేరుకొని రోడ్డు నిర్మాణం తలపెట్టారు. దీన్ని అడ్డుకుని నిరసన తెలిపిన ఇద్దరు యువతులపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ(టీఎంసీ)కి చెందిన పంచాయతీ నాయకుడు అమల్ సర్కార్, తన అనుచరులతో దాడికి తెగబడ్డాడు. నిందితుని సస్పెండ్ అతని అనుచరులు యువతుల కాళ్లను తాళ్లతో కట్టేసి, కొట్టుకుంటూ విచక్షణారహితంగా నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ వెళ్లారు. దాడిని అడ్డుకున్న సోదరిని సైతం కిందపడేసి ఇష్టమొచ్చినట్లుగా కొట్టారు. నిందితుడు ఆమె మెడలోని బంగారు గొలుసును, మొబైల్ ఫోన్‌ను లాక్కున్నాడు. ఇక ఈ ఘటనపై బాధితురాలు స్మృతి ఆదివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఇప్పటివరకు దాడికి కారణమైన వారిలో ఒక్కరిని కూడా అరెస్ట్ చేయకపోవడం గమనార్హం. ఈ దాడికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో టీఎంసీ అధిష్టానం నిందితుడు అమల్ సర్కార్‌ను పార్టీ నుంచి నిషేధిస్తున్నట్లు ప్రకటించింది. చంపుతామని బెదిరించారు ఈ ఘటనపై స్మృతి మాట్లాడుతూ.. ‘దాడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించాను. కానీ ఎప్పుడైతే కింద పడ్డానో ఆ క్షణం వాళ్లు నా కాళ్లు లాగి, తాళ్లతో కట్టేసి 30 అడుగుల వరకు ఈడ్చుకుంటూ పోయారు. వాళ్లు నన్ను తీవ్రంగా కొట్టారు. ఐరన్ రాడుతో తలపై బాదేందుకు ప్రయత్నించారు. చంపుతామని బెదిరించారు’ అని పేర్కొంది. బీజేపీ నాయకుడు, బలుర్ఘాట్ ఎంపీ సుకాంత మజుందార్ యువతులపై దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ దాడిని అనాగరిక చర్యగా అభివర్ణించారు. అభివృద్ధి చెందిన నాగరిక సమాజంలో ఇప్పటికీ ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయంటే నమ్మశక్యంగా లేదన్నారు. దీనికి కారణమైన పంచాయతీ నాయకుడిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. చదవండి: కర్రీ పాయింట్ వద్ద ఘర్షణ.. ఒకరికి గాయాలు వాళ్లు బానిసలు.. వారిద్దరి తలలు నరుకు అంటూ.. -
చావుకు లాటరీ వేసుకున్నారు!
సాక్షి, రాజమహేంద్రవరం క్రైం: తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మేనమామ వేధింపులే దీనికి కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. రాజమహేంద్రవరం మల్లికార్జుననగర్‌లో నివసించే నాగేశ్వరరావుకు ఇద్దరు కుమార్తెలు. పెద్ద కుమార్తె అనంతలక్ష్మి(25)కి కొత్తపేట మండలం కళ్లావారిపాలేనికి చెందిన తేజతో వివాహమైంది. రెండో కుమార్తె దేవీ అరుణకుమారి(22) తండ్రిదగ్గరే ఉంటోంది. నాగేశ్వరరావు ఐస్ బండి నడుపుతూ జీవిస్తున్నాడు. ఐదు రోజుల క్రితం పెద్ద కుమార్తె అనంతలక్ష్మి పుట్టింటికి వచ్చింది. బుధవారం రాత్రి వ్యాపారం ముగించుకుని ఇంటికి వచ్చిన నాగేశ్వరరావు తలుపు కొట్టగా.. కుమార్తెలు తలుపు తీయలేదు. దీంతో తలుపులు పగులగొట్టి చూడగా అక్కాచెల్లెళ్లిద్దరూ కిటికీలకు చీరతో ఉరివేసుకొని ఉన్నారు. ఈ యువతుల మేనమామ చప్పిడి ఉమామహేశ్వరరావు కొంత కాలం క్రితం సింగపూర్ వెళ్లి పది రోజుల కిందటే రాజమహేంద్రవరం వచ్చాడు. సింగపూర్ వెళ్లక ముందు ఉమామహేశ్వరరావు అనంతలక్ష్మిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనంత లక్ష్మి తేజను ప్రేమించి పెళ్లి చేసుకుంది. భర్తకు విడాకులు ఇచ్చి తనను పెళ్లి చేసుకోవాలని ఉమామహేశ్వరరావు అనంతలక్ష్మిపై ఒత్తిడి తెస్తూ ప్రతి రోజూ ఘర్షణకు దిగేవాడు. దీంతో మనస్తాపానికి గురైన అక్కాచెల్లెళ్లు ఉరి వేసుకొని ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎలా చనిపోవాలనే విషయమై అక్కాచెల్లెళ్లు మూడు చీటీలు రాశారు...అందులో ఉరి వేసుకొని...విషం తీసుకొని...గోదావరిలో పడి అని రాసి ఉంది. అందులో ఒక చీటీ తీసి ఉరినే మరణానికి ఎంచుకున్నట్లుగా మృత దేహాల పక్కన ఉన్న చీటీల ప్రకారం తెలుస్తోందని పోలీసులు చెబుతున్నారు. -
గాయపడ్డ మనసులు
-
అక్కాచెల్లెళ్ల దారుణ హత్య
చింతలపూడి/టి.నరసాపురం: జిల్లాలోని చింతలపూడి, టి.నరసాపురం మండలాల సరిహద్దులోని అటవీ ప్రాంతంలో శనివారం ఇద్దరు మహిళలు దారుణ హత్యకు గురయ్యారు. హత్యకు కారణాలు తెలియరాలేదు. మృతులు ఇద్దరి తలలపై ఒకే విధంగా బలమైన గాయాలు ఉన్నాయి. మృతులు టి.నరసాపురం మండలం టి.నరసాపురం ఇందిరాకాలనీకి చెందిన బైగాని మంగమ్మ (35), గండిగూడానికి చెందిన పూలదాసు సీతామహాలక్ష్మి (32)గా పోలీసులు గుర్తించారు. వీరిద్దరూ స్వయానా అక్కాచెల్లెళ్లు. శనివారం ఉదయం వీరిద్దరూ కలిసి చింతలపూడి మండలం తీగలవంచ సమీపంలోని తమకు చెందిన జీడితోటలో జీడిగింజలు ఏరడానికి వెళ్లారు. మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో వారిని ఇంటికి తీసుకురావడానికి మంగమ్మ కుమారుడు దుర్గాప్రసాద్ ద్విచక్ర వాహనంపై జీడితోటలోకి వెళ్లాడు. అయితే అక్కడ వారి జాడ కనిపించకపోవడంతో తండ్రి సత్యనారాయణకు సమాచారం అందించాడు. వీరిద్దరూ కలిసి తోటలోని కాలిజాడలను అనుసరిస్తూ వెళ్లగా రేచర్ల వనసంరక్షణ సమితికి చెందిన బందంచర్ల అటవీ ప్రాంతంలో సీతామహాలక్ష్మి మృతదేహం కనిపించింది. పక్కనే మంగమ్మ కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతుండటంతో ఆమెను ఆస్పత్రికి తీసుకువెళ్లేందుకు ప్రయత్నించగా కిలోమీటరు దూరం తీసుకువెళ్లే సరికి మృతిచెందింది. జంగారెడ్డిగూడెం డీఎస్పీ జె.వెంకటరావు, చింతలపూడి సీఐ పి.రాజేష్, చింతలపూడి ఎస్సై సైదానాయక్, టి.నరసాపురం ఎస్సై కె.నాగేంద్రప్రసాద్, తడికలపూడి ఎస్సై జీజే విష్ణువర్దన్ ఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. టి.నరసాపురంలో తీవ్ర విషాదం టి.నరసాపురం ఇందిరాకాలనీ, గండిగూడెంలో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి. మృతుల కుటుంబసభ్యుల రోదనలు మిన్నంటాయి. మృతులిద్దరూ కూలీ పనులు చేసుకుంటూ, సీజన్లో జీడిగింజలు ఏరుకుంటూ జీవనం సాగిస్తున్నారు. మధ్యాహ్నానికి వచ్చేస్తామని చెప్పి ఇంటి నుంచి వెళ్లారంటూ కుటుంబసభ్యులు బోరుమన్నారు. -
అక్కాచెల్లెళ్లు అదృశ్యం
రాజేంద్రనగర్ (హైదరాబాద్) : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి బృందావన్ కాలనీకి చెందిన అక్కా చెల్లెళ్లు ఇష్రాత్‌బేగం(17), నూర్జహాబేగం(15)లు ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. వెళ్లేటప్పుడు ఇంట్లోని సెల్‌ఫోన్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. రాత్రి అయినా వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి కౌరున్‌బేగం చుట్టుపక్కల ప్రాంతాలలో విచారించింది. 4వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇష్రాత్‌బేగం తమ దగ్గరున్న సెల్‌ఫోన్ ద్వారా తల్లికి కాల్ చేసి తాము క్షేమంగానే ఉన్నామని, నెల రోజుల అనంతరం తిరిగి వస్తామని తెలిపింది. ఇతర వివరాలు అడిగితే ఫోన్ కట్ చేసింది. తెలిసినవారి ఇళ్లలో వెతికినా లాభం లేకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు
మొరదాబాద్: ఈవ్ టీజింగ్‌కు పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి ఇద్దరు అక్కా చెల్లెళ్లు బుద్ధి చెప్పారు. తమ జోలికి ఇంకోసారి రాకుండా అతడికి చుక్కలు చూపించారు. ఉత్తరప్రదేశ్‌లోని మోరదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెకిలి చేష్టలకు పాల్పడిన ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని ఆ చెంపా ఈచెంపా వాయించడమే కాకుండా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు. మొరదాబాద్‌లో పోలీసు ఉద్యోగాలపై అభిరుచి ఉన్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ప్రతి రోజు ఉదయాన్నే రన్నింగ్‌కు వెళుతుంటారు. అదే సమయంలో రోడ్డుపక్కనే ఓ తోపుడుబండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి వారిని అభ్యంతరమాటలు అనేవాడు. అలా కొద్ది రోజులుగా అతడిని సహించిన ఆ ఇద్దరు యువతులు చివరకు తమ ఆగ్రహం ఆపుకోలేక అతడిని ఈడ్చి తన్నారు. చెంపలు వాయించి, కాళ్లతో తన్నారు. దీంతో వారి దెబ్బలు తాళలేక తనను వదిలిపెట్టమని అతడు బ్రతిమాలికున్నాడు. అయినా, వదిలిపెట్టని ఆ అక్కా చెల్లెళ్లు అతడిని కాలర్ పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు పట్టించారు. -
అక్కాచెల్లెళ్లు చనిపోయారు
కరీంనగర్: పుణ్య స్నానానికి వెళ్లి అక్కాచెల్లెలు ప్రమాదవశాత్తు చనిపోయిన విషాద ఘటన కరీంనగర్లో చోటుచేసుకుంది. కరీంనగర్ మండలం కొత్తపల్లికి చెందిన కట్ల లత, రాజేందర్ దంపతుల కుమార్తెలు శ్రావణి, పవిత్రలు అనే ఇద్దరు అక్కా చెల్లెళ్లు గురువారం ధర్మపురికి వెళ్లారు. అక్కడి నుంచి గోదావరి నదిలో పుణ్య స్నానానికి వెళ్లి అనుకోని విధంగా మృత్యువాత పడ్డారు. దీంతో వారి స్వగ్రామంలో విషాదం అలుముకుంది. తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.