మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు.
రాజేంద్రనగర్ (హైదరాబాద్) : మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో ఇద్దరు బాలికలు అదృశ్యమయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... మైలార్‌దేవ్‌పల్లి బృందావన్ కాలనీకి చెందిన అక్కా చెల్లెళ్లు ఇష్రాత్‌బేగం(17), నూర్జహాబేగం(15)లు ఈ నెల 2వ తేదీన ఇంట్లో ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లారు. వెళ్లేటప్పుడు ఇంట్లోని సెల్‌ఫోన్‌ను తమ వెంట తీసుకువెళ్లారు. రాత్రి అయినా వారు తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లి కౌరున్‌బేగం చుట్టుపక్కల ప్రాంతాలలో విచారించింది.
4వ తేదీ సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఇష్రాత్‌బేగం తమ దగ్గరున్న సెల్‌ఫోన్ ద్వారా తల్లికి కాల్ చేసి తాము క్షేమంగానే ఉన్నామని, నెల రోజుల అనంతరం తిరిగి వస్తామని తెలిపింది. ఇతర వివరాలు అడిగితే ఫోన్ కట్ చేసింది. తెలిసినవారి ఇళ్లలో వెతికినా లాభం లేకపోవడంతో మంగళవారం ఉదయం పోలీసులు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.