చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు | as brave sisters thrash eve-teaser in Uttar Pradesh. | Sakshi
Sakshi News home page

చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు

Published Tue, Feb 9 2016 6:08 PM | Last Updated on Thu, Jul 11 2019 8:06 PM

చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు - Sakshi

చుక్కలు చూపించిన అక్కా చెల్లెళ్లు

మొరదాబాద్: ఈవ్ టీజింగ్కు పాల్పడిన ఓ ప్రబుద్ధుడికి ఇద్దరు  అక్కా చెల్లెళ్లు బుద్ధి చెప్పారు. తమ జోలికి ఇంకోసారి రాకుండా అతడికి చుక్కలు చూపించారు. ఉత్తరప్రదేశ్లోని మోరదాబాద్ నగరంలో ఈ ఘటన చోటుచేసుకుంది. వెకిలి చేష్టలకు పాల్పడిన ఆ వ్యక్తిని కాలర్ పట్టుకొని ఆ చెంపా ఈచెంపా వాయించడమే కాకుండా కాలర్ పట్టుకొని ఈడ్చుకెళ్లి పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లారు. మొరదాబాద్లో పోలీసు ఉద్యోగాలపై అభిరుచి ఉన్న ఇద్దరు అక్కా చెల్లెల్లు ప్రతి రోజు ఉదయాన్నే రన్నింగ్కు వెళుతుంటారు.

అదే సమయంలో రోడ్డుపక్కనే ఓ తోపుడుబండి పెట్టుకొని వ్యాపారం చేసుకుంటున్న ఓ వ్యక్తి వారిని అభ్యంతరమాటలు అనేవాడు. అలా కొద్ది రోజులుగా అతడిని సహించిన ఆ ఇద్దరు యువతులు చివరకు తమ ఆగ్రహం ఆపుకోలేక అతడిని ఈడ్చి తన్నారు. చెంపలు వాయించి, కాళ్లతో తన్నారు. దీంతో వారి దెబ్బలు తాళలేక తనను వదిలిపెట్టమని అతడు బ్రతిమాలికున్నాడు. అయినా, వదిలిపెట్టని ఆ అక్కా చెల్లెళ్లు అతడిని కాలర్ పట్టుకొని తీసుకెళ్లి పోలీసులకు పట్టించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement