ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రా జెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో హిందీ చిత్రం ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.
నేరం ఎక్కడ జరిగినా నేరస్తుడి కోణంలో పరిశోధన జరిపితే నేరస్తుడు సులభంగా దొరుకుతాడు అని చెప్పే సినిమా ‘ది బకింగ్‌హామ్ మర్డర్స్’. ఇదో ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్. కొన్ని వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకొని అల్లుకున్న కథ ఇది. 2023 అక్టోబర్ 14న జరిగిన 67వ లండన్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైన ఈ సినిమా విమర్శకుల ప్రశంసలందుకుంది. ఈ సినిమాని దర్శకులు హన్సల్ మెహతా రూ΄÷ందించారు. ఇందులో ముఖ్య పాత్రధారి అయిన జస్మీత్ భమ్రా పాత్రలో ప్రముఖ బాలీవుడ్ నటి కరీనా కపూర్ నటించారు.
ఇక ఈ సినిమా కథాంశానికొస్తే... జస్మీత్ ఓ బ్రిటీష్ ఇండియన్ డిటెక్టివ్. తన కొడుకు ఓ డ్రగ్ అడిక్ట్ చేతిలో చనిపోతాడు. ఆ విషయాన్ని తట్టుకోలేక జస్మీత్ బకింగ్‌హామ్ నగరానికి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంటుంది. బకింగ్‌హామ్‌కు రావడంతోనే ఓ కేసు తనకు తానే కావాలని తీసుకుంటుంది. బకింగ్‌హామ్‌లో నివాసం ఉంటున్న దల్జీత్, ప్రీతి కొల్లి దత్తపుత్రుడు ఇష్ ప్రీత్ కనబడడం లేదన్నది ఆ కేసు సారాంశం. ఈ కేసు జస్మీత్ తీసుకోవడానికి కారణం తప్పిపోయిన ఇష్ ప్రీత్ సరిగ్గా తన కొడుకు వయసు వాడవడం ఒకటయితే ఈ కేసులో డ్రగ్స్ పాత్ర ఉండడం రెండో కారణం.
ఓ పక్క కొడుకును పోగొట్టుకున్న బాధతో మరో పక్క కనబడని బిడ్డ కోసం తల్లిదండ్రులకు తోడుగా ఈ కేసును జస్మీత్ ఎలా పరిష్కరించింది అన్నదే మిగతా సినిమా. సాధారణంగా క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ సినిమాలంటే అందరూ ఇష్టపడరు. కానీ ఈ సినిమా చూసే కొద్దీ చూస్తున్నవాళ్లు బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక సినిమా స్క్రీన్‌ప్లే ఊహకందని ట్విస్టులతో ఉత్కంఠ రేపుతుంది. మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో వచ్చే ట్విస్ట్ ఓ హైలైట్ అనే చెప్పాలి. జస్మీత్ భమ్రా పాత్రలో కరీనా కపూర్ జీవించారనే చెప్పాలి. నెట్‌ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ఈ సినిమా దాదాపు మూడు వారాల నుండి టాప్ 10లో నిలిచింది. వర్తఫుల్ మూవీ ఫర్ దిస్ వీకెండ్ వాచిట్. – హరికృష్ణ ఇంటూరు
Comments
Please login to add a commentAdd a comment