ధృవ సినిమాలో రకుల్ ‘ప్యార్‌లో పడిపోతే పరేషాన్ రా!’ పాట అందరికీ గుర్తున్నదే! అందమైన రకుల్ వేసుకున్న ఇన్ని అందమైన డ్రెస్సుల్లో ఏది సెలెక్ట్ చేసుకోవాలన్నా పరేషానే కదా! అది సెలెక్షన్ పరేషాన్!!
►జయ జానకి నాయక ప్రమోషన్ సందర్భంగా డిజైన్ చేసిన జేడ్ బ్లూ కలర్ లాంగ్ అనార్కలీ ఫ్రాక్ ఇది. ఎంతమందిలో ఉన్నా చాలా బ్రైట్‌గా స్పెషల్‌గా కనిపించేలా చేస్తుంది. సంప్రదాయ వేడుకలకు ఈ స్టైల్ డ్రెస్ బాగా నప్పుతుంది.
►నారింజ, పసుపు రంగుల కాంబినేషన్‌తో రాజస్థానీ వర్క్‌తో ఆకట్టుకుంటున్న ఈ లంగావోణీ రితుకుమార్ డిజైన్ చేసింది. హాఫ్ శారీని ‘రారండోయ్’ ప్రమెషన్ కోసం వాడాం. అన్నిరకాల ప్రమోషన్స్‌కి హాఫ్ శారీస్‌నే వాడాం.
►సింగిల్ షోల్డర్ కేప్‌ని జయంతీరెడ్డి డిజైన్ చేశారు. దీనికి ధోతీ ప్యాంట్ బాటమ్‌గా వాడాం. విన్నర్ మూవీ ప్రమోషన్ సమయంలో ఎంపిక చేసిన డ్రెస్ ఇది. ఎథ్నిక్ టచ్ ఉండాలి, అదే సమయంలో వెరైటీగా అనిపించాలనుకున్నాం. హెయిర్‌స్టైల్ కూడా మార్చాం. దీంతో ఇండోవెస్ట్రన్ లుక్‌తో అట్రాక్ట్ చేసింది. చెవులకు హ్యాంగింగ్స్ తప్ప ఇతరత్రా ఆభరణాలేవీ ఉపయోగించలేదు.
►విన్నర్ సినిమాలో ఒక పాట కోసం 22 మీటర్ల ఫ్యాబ్రిక్‌తో డిజైన్ చేసిన వెస్ట్రన్ గౌన్ ఇది. పువ్వుల ప్రింట్లు, సింగిల్ షోల్డర్ డిజైన్, దీనికి పొడవాటి పల్లూ ఉపయోగించడంతో హైలైట్ అయ్యింది.
►కాటన్ క్లాత్ మీద బ్లాక్ ప్రింట్స్ అనుశ్రీ లేబుల్ లాంగ్ ఫ్రాక్ ఇది. జయ జానకి నాయక సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఈ డ్రెస్‌ను ఎంచుకున్నాం.
►విన్నర్ సినిమాలో ఒక పాట కోసం ఈ లెహంగా బ్లౌజ్‌ని ఎంచుకున్నాం. బ్లౌజ్‌కి, లెహంగాకి మిర్రర్ వర్క్ ప్లాన్ చేశాం. ఇది సినిమాలో బాగా హైలైట్ అయ్యింది. టీనేజ్ అమ్మాయిలు సంప్రదాయ వేడుకులలో ధరించడానికి బాగుంటుంది.
►ఎస్‌విఎ డిజైనర్ చేసిన లంగావోణీ కాంబినేషన్ ఇది. ‘రారండోయ్ వేడుకచూద్దాం’ ఆడియోలాంచ్‌కి ఈ కాన్సెప్ట్ అనుకున్నాం. ఆడియోలాంచ్ సాధారణంగా నైట్‌టైమ్ ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ డ్రెస్ ఎక్కువగా లంగాఓణీలే! అదే కాన్సెప్ట్‌లో లంగాఓణీలో బ్రైట్‌గా కనిపించాలనుకున్నాం. అందుకు లైట్ క్రీమ్‌కలర్ లంగా ఓణీని ఎంపిక చేశాం. ఈ డ్రెస్‌కు పూర్తిగా బీడ్ వర్క్ చేయడంతో మరింత ప్లెజెంట్‌లుక్ వచ్చింది. అలంకరణలో ఆభరణాలు ఉపయోగించలేదు. ఈ డ్రెస్‌లో చుక్కల్లో చందమామలా వెలిగిపోయింది రకుల్!
► విశాల్ సినిమా ఆడియోలాంచ్ సందర్భంగా రుచి డిజైన్ చేసిన శారీ ఇది. లెదర్‌బ్లౌజ్, మింట్ బ్లష్ ప్రీ డ్రేప్డ్ శారీ ఇది. దీనికి కొంగును జత చేసి స్టైలిష్‌లుక్ వచ్చేలా చేశాం. దీంతో వేడుకలో హైలైట్ అయ్యింది. బ్లాక్ కలర్ ఎప్పుడూ స్పెషల్‌గా ఉంటుంది. అయితే టాప్ టు బాటమ్ బ్లాక్ కలర్ ధరించినప్పుడు సింపుల్‌గానూ, స్టైలిష్‌గానూ కనిపించేలా జాగ్రత్తలు తీసుకోవాలి.
► ఇది సియాన్ గ్రీన్ కలర్ జంప్ సూట్. చీకటి రాజ్యం సినిమాకు వెళ్లడానికి ఈ క్యాజువల్ ఔట్‌ఫిట్‌ని ఎంపిక చేశాం. ఈ జంప్‌సూట్‌ని రితుకుమార్ డిజైన్ చేశారు. స్నేహితులతో కలిసి బయటకు వెళ్లినప్పుడు, సినిమాలకు, గెట్ టుగెదర్ వంటి పార్టీలకూ ఈ తరహా డ్రెస్ బాగా నప్పుతుంది.
►‘విన్నర్’ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ కోసం స్పెషల్‌గా ఎంచుకున్న స్టైల్ ఇది. తరుణ్ తహ్లియాన్ డిజైన్ శారీకి స్పెషల్ అట్రాక్షన్ ఫ్యాషన్‌బెల్ట్, నెక్‌పీస్.
నటి రకుల్‌తో నీరజ కోన సినీ తారల డ్రెస్ స్టైలిస్ట్, కాస్ట్యూమ్ డిజైనర్
సెలెక్షన్ పరేషాన్
Published Fri, Aug 18 2017 12:03 AM | Last Updated on Tue, Jul 23 2019 11:50 AM
Advertisement