సినిమాలో.. సన్నివేశానికో డ్రెస్!
వేదికల మీద.. సందర్భానికో డ్రెస్!!
ఏ వేడుకైనా.. ‘తార’లా వెలిగిపోవాలంటే
ధరించే డ్రెస్సులు వైవిధ్యంగా ఉండాలి.
అభిమానుల మదిని కొల్లగొట్టాలి.
ఆహూతుల కితాబులు అందుకోవాలి
సమ్‌థింగ్ సమ్‌థింగ్ ‘సమంత’ అనిపించాలి.
స్టార్ కాస్ట్యూమ్ డిజైనర్ నీరజకోన
స్టార్ హీరోయిన్ సమంత కోసం
ఎంపిక చేసిన డిజైన్ల గురించి
వివరించారు. ఇలాంటి డిజైన్స్‌లో
మన ఎంపిక ఎలా ఉండాలో
సూచనలు ఇస్తున్నారు.
‘అ ఆ’ సినిమా ఆడియో లాంచ్ వేడుకకు శ్రియాసోం డిజైన్ చేసిన డ్రెస్ ఇది. ఆర్గాంజా క్లాత్ మీద పువ్వులను ఎంబ్రాయిడరీ చేశారు. బ్లౌజ్‌కి సిల్వర్ బీడ్ వర్క్ చేశారు. పెద్ద ఈవెంట్ అనుకున్నప్పుడు, స్టైలిష్‌గా కనిపించాలంటే ఇలా ఇండోవెస్ట్రన్ డిజైన్ బాగా నప్పుతుంది.
మీడియా ఇంటర్వూ కోసం పాయల్ ఖండ్‌వాలా డిజైన్ చేసిన డ్రెస్‌ని ఎంపిక చేశాం. రెడ్ బ్రొకేడ్ బ్లౌజ్ రా సిల్క్ పలాజో ప్యాంట్‌మీదకు చక్కగా అమరింది. ఈ కలర్, కాంబినేషన్‌ని చూస్తే ఇటు ట్రెడిషనల్ పార్టీలకు అటు గెట్ టుగెదర్ పార్టీలకు స్టైలిష్‌గా ఉంటుంది. ఆమ్రపాలి డిజైన్ చేసిన యాంటిక్ గోల్డ్ ఫినిష్డ్ నెక్లెస్ తప్ప మరే ఆభరణమూ ఈ అలంకరణలో ఉపయోగించలేదు. మెరుపులీనే మేకప్, కోరల్ లిప్‌కలర్, హెయిర్ స్టైల్ ఈ డ్రెస్‌కి బాగా అమరాయి.
జైపూర్‌కే ప్రత్యేకమైన హ్యాండ్లూమ్ శారీ విత్ లాంగ్ జాకెట్ ఇది. ఈ గెటప్‌కి ఎత్నిక్ టచ్ తీసుకురావాలని అనుకున్నాం. ఇందుకు జైపూర్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేయించాం. బ్రాస్ నెక్‌పీస్‌ను తీసుకున్నాం. దీంతో కళ పూర్తిగా మారిపోయింది.
తమిళ సినిమా ‘తెరి’ మీడియా ఇంటర్వ్యూ కోసం డిజైన్ చేసిన శారీ డ్రెస్ ఇది. దీని ఎంపికలోనే ఒక హైలైట్ ఉంది. ఒకే రంగు అదీ చాలా బ్రైట్‌గా ఉండే డ్రెస్‌ను ఎంపిక చేయాలనుకున్నాం. పర్పుల్ కలర్ బాగా అట్రాక్ట్ చేస్తుంది. అందుకని ప్లెయిన్ జార్జెట్ పర్పుల్ శారీ తీసుకున్నాం. దీనికి అదే రంగు కలర్ జాకెట్‌ను జత చేశాం. అయితే ఆర్మీప్రింట్స్ ఉన్న నకోడా ఫాబ్రిక్‌ను తీసుకొని డిజైన్ చేశాం. ఈ డ్రెస్సే పెద్ద హైలైట్. అందుకని ఆభరణాలేవీ ఉపయోగించలేదు. ఈ స్టైలిష్ లుక్ ఆకట్టుకుంది.
ఈ గాగ్రాచోలీ సినిమా రిలీజ్ ఫంక్షన్‌లో ప్రత్యేకంగా నిలిచింది. దీనిని సబ్యసాచి డిజైన్ చేశారు. మోచేతుల వరకు ఉండే బ్లౌజ్, పెద్ద అంచుతో లెహంగా, అంచు రంగు దుపట్టా హంగులుగా అమరాయి.
సంప్రదాయ వేడుకలకు ఈ తరహా డ్రెస్సింగ్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటుంది.
ఈషార్ట్ గౌన్ శంకరాభరణం సినిమా ఆడియోలాంచ్ వేడుకకు డిజైన్ చేసినది. ఈ ఫ్రాక్‌ని మన్‌కానంద డిజైనర్ డిజైన్ చేశారు. ఈ ఫ్రాక్‌కి షిఫాన్, జార్జెట్ ఫ్యాబ్రిక్స్‌ని వాడారు. ఫ్రాక్ అంటే చాలా స్టైలిష్‌గా ఉంటుంది. అందుకని వేరే యాక్ససరీస్ ఏవీ ఉపయోగించలేదు.
ముదురాకుపచ్చ, నీలం, నలుపురంగుల ప్రింట్ మ్యాక్సీ డ్రెస్ ఇది. ‘అత్తారింటì కి దారేది’ సినిమాలోని పాట కోసం ఎంపిక చేశాం. ఎలాంటి శరీరాకృతి గలవారికైనా సూట్ అయ్యే డ్రెస్ ఇది. ఈ డ్రెస్‌లో ఎక్కడా ఫిటింగ్ ఉండదు. రెగ్యులర్ మ్యాక్సీకి ఫ్యాన్సీ బెల్ట్ ఉపయోగించేసరికి లుక్‌లో స్టైలిష్ మార్పు వచ్చింది. బెల్ట్‌తో పాటు మెడలో వేసుకునే హారానికి ప్రాముఖ్యం ఇచ్చాం. దీనికీ ఫ్యాన్సీ నెక్‌లైన్‌ని తీసుకున్నాం. లూజ్ హెయిర్‌స్టైల్, చెవులకు చిన్న స్టడ్స్ తప్ప ఎక్కడా ఇతరత్రా యాక్ససరీస్ ఉపయోగించలేదు.
సప్త సమంత
Published Fri, Aug 11 2017 12:35 AM | Last Updated on Mon, Sep 11 2017 11:46 PM
Advertisement
Advertisement