కాపురాలు కూలిస్తే.. తస్మాత్‌ జాగ్రత్త! | Producer Gnanavel Raja Wife Neha's Shocking Comments on Actresses | Sakshi
Sakshi News home page

కాపురాలు కూలిస్తే.. తస్మాత్‌ జాగ్రత్త!

Published Thu, Mar 22 2018 12:28 AM | Last Updated on Tue, Aug 28 2018 4:32 PM

Producer Gnanavel Raja Wife Neha's Shocking Comments on Actresses - Sakshi

భర్తతో నేహా

‘‘కొందరు హీరోయిన్స్‌ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. వాళ్లు సెక్స్‌ వర్కర్స్‌ కంటే దారుణంగా తయారయ్యారు’’ అంటూ తమిళ నిర్మాత జ్ఞానవేల్‌ రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్‌ బ్రదర్స్‌ సూర్య, కార్తీలకు బంధువు అవుతారు జ్ఞానవేల్‌ రాజా. సూర్య హీరోగా జ్ఞానవేల్‌ నిర్మించిన ‘సింగం 3’ సినిమాకు నేహా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా చేశారు. కొందరి హీరోయిన్ల ధోర ణిపై ఆమె ట్విట్టర్‌లో స్పందిస్తూ – ‘‘అందర్నీ జన్రలైజ్‌ చేయటమో లేదా ఫ్రొఫెషనల్‌గా ఉండేవాళ్లను హర్ట్‌ చేయటానికో ఈ విషయం ప్రస్తావించట్లేదు.

హీరోయిన్లను ఇండస్ట్రీలో అడ్జస్ట్‌ అవ్వమని అడుగుతారో లేదో తెలీదు కానీ కొందరు మాత్రం ‘బెడ్‌ రెడీ’ అన్నట్లు ఉంటారు. పెళ్లయిన వాళ్లను వెంబడిస్తుంటారు. ఒకవేళ అడ్జస్ట్‌ అవ్వమని ఇండస్ట్రీ అడిగితే ‘నో’ చెప్పి వెళ్లిపోలేరా? పెద్ద హీరోయిన్‌ అయిపోదామని, డబ్బులు సంపాదించే ప్రక్రియలో, లైమ్‌ లైట్‌లో ఉందామని చేసే ప్రయత్నమే ఇదంతా. మనమంతా ఫెమినిజమ్, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ అసలైన నిజం ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు. కొన్నిసార్లు ఓ స్త్రీ ఇంకో స్త్రీ జీవితం నాశనానికి కారణమవుతుంది.

అవును.. కథకు రెండు వైపులా మాట్లాడాలి. కొందరు మగవాళ్లే వాళ్ల ఆటలు సాగనిచ్చి, వాళ్ల కుటుంబంలోకి వచ్చేదాకా చేస్తున్నారు. మనందరం ఇలా ఇళ్లను కూల్చేవాళ్లందరినీ బయటపెట్టి ఓపెన్‌ వార్నింగ్‌ ఇవ్వాలి. అమ్మాయిని మోసం చేసిన మగాడిని ఎలా శిక్షిస్తామో వీళ్లనూ అలానే దండించాలి. అవును... మగాళ్లు ఏమీ పసి పిల్లలు కాదు. కొందరు మగాళ్లు వీళ్లను లిమిట్‌లో ఉంచినా కూడా వీళ్లు హద్దులు దాటుతుంటారు. ఎమోషనల్‌ డ్రామాతో కట్టేస్తుంటారు. మొగుడిని కంట్రోల్‌ చేయటం, శిక్షించటమే కాదు.. భార్యల డ్యూటీ. ఇలాంటివాళ్లను హద్దుల్లో పెట్టడం కూడా.

పబ్లిక్‌లో కుక్కని కొట్టినట్టు కొట్టాలి. కొందరు హీరోయిన్లను ఇలాంటి చర్యలను ఆపమని బతిమాలా. కానీ మారేలా లేరు. వాళ్లను కచ్చితంగా రోడ్డుకి ఈడుస్తాను. (అలాంటివాళ్లను హీరోయిన్స్‌ కాదు.. వ్యభిచారులు అనాలేమో).ఈ రేంజ్‌లో మాటల తూటాలు వదిలిన నేహా ఆ తర్వాత ఆ ట్వీట్‌ మొత్తాన్ని తీసేశారు. ‘‘నాకు,నా భర్తకు ఎటువంటి ప్రాబ్లమ్స్‌ లేవు. నా చుట్టూ జరిగిన సంఘటనలు చూసి స్పందించాను. ఏదో డ్రామా క్రియేట్‌ చేయాలనో, ఇతరుల దృష్టి ఆకర్షించాలనో రాయలేదు. ఇక్కడ స్పందించటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయింది. అందుకని తీసేశాను’’ అని నేహా పేర్కొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement