Gnanavel Raja producer
-
పాన్ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్' విడుదలకు ఇబ్బందులు
తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!
కోలీవుడ్‌లో కొంతకాలంగా వివాదాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవనచ్చితిరం సినిమా రిలీజ్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా సమస్య కాస్తా కోర్టుకు చేరడంతో మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా 16 ఏళ్ల క్రిత రిలీజైన సినిమా విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని మరో నిర్మాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్తి నటించిన చిత్రం ‘పరుత్తివీరన్’. ఈ చిత్రం ద్వారానే కార్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా వివాదంపై సముద్రఖని మండిపడ్డారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్నిరోజులుగా దర్శకుడు ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరుత్తివీరన్ దర్శకుడికి మద్దతుగా సముద్రఖని ఓ లేఖ విడుదల చేశారు. సముద్ర ఖని లేఖలో ప్రస్తావిస్తూ.. 'పరుత్తివీరన్‌లో నేను కూడా నటించా. ఆ సినిమా టైంలో డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. నిర్మాతగా ఒక్కరోజు కూడా జ్ఞానవేల్ సెట్‌కు రాలేదు. సినిమా బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్‌కు సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.' అని సముద్రఖని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్’. ఈ సినిమాకు జ్ఞానవేల్ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్ మాత్రం ఈవెంట్‌కు రాలేదు. దీనిపై ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కార్తి జపాన్ మూవీ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు రిలేషన్స్ అంత బాగాలేవు.. జ్ఞానవేల్ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అమిర్ అన్నారు. అయితే అమిర్ వ్యాఖ్యలపై జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. 'అమిర్‌కు ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులు దండుకున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. pic.twitter.com/JYfQNIgfcw — P.samuthirakani (@thondankani) November 25, 2023 -
ఆనంద్ దేవరకొండ సినిమాకు హీరోయిన్గా ప్రగతి.. బేబీకి నో ఛాన్స్
బేబీ సినిమా సక్సెస్‌తో ఆనంద్ దేవరకొండకు వరుస సినిమా అవకాశాలు క్యూ కట్టాయి. ఈ సినిమా మంచి విజయం సాధించడంతో ఇండస్ట్రీలో ఆనంద్ మార్కెట్ కొంతమేరకు పెరిగింది. ఇప్పటికే తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన ప్రముఖ నిర్మాత జ్ఞానవేల్ రాజాతో ఒక చిత్రానికి ఆనంద్ సంతకం చేశాడు. ఈ సినిమాను ఏఆర్ మురుగదాస్ టీమ్ నుంచి ఒక కొత్త డైరెక్టర్ ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించనున్నాడట. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. ఈ సినిమాకు హీరోయిన్గా సోషల్ మీడియాలో పాపులర్ అయిన ఢిల్లీ బ్యూటీ ప్రగతి శ్రీవాస్తవను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ శ్రీకాంత్ అడ్డాల ‘పెద్ద కాపు’తో తన జర్నీని స్టార్ట్ చేసిన విషయం తెలిసిందే. రెండు పార్టులుగా వస్తున్న ఈ సినిమా మొదటి భాగం విడుదల కోసం ఆమె ఎదురుచూస్తోంది. ఇది విడుదల కాకముందే ఈ బ్యూటీకి మరో క్రేజీ సినిమాను కైవసం చేసుకోవడం ఆహ్వానించదగ్గ పరిణామం. త్వరలో ప్రారంభం కానున్న ఈ ప్రాజెక్ట్‌లోకి ఆనంద్ దేవరకొండతో పాటు ప్రగతి శ్రీవాస్తవ కూడా అడుగుపెట్టబోతుంది. (ఇదీ చదవండి: అతను అలా ప్రవర్తించినా త్రిష భరించింది.. ఎందుకంటే: సినీ నటి) బేబీ సినిమా తర్వాత సినిమాల ఎంపిక విషయంలో ఆనంద్ దేవరకొండ మరింత జాగ్రత్త పడుతున్నాడని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు మైత్రీ మూవీ మేకర్స్‌తో కూడా ఆయన డీల్ కుదుర్చుకున్నాడు. ఆనంద్ జ్ఞానవేల్ రాజా, మైత్రీ మూవీ మేకర్స్ లాంటి రెండు పెద్ద ప్రొడక్షన్స్లలో ఆనంద్‌కు ఒకేసారి ఛాన్స్ దక్కడంతో ఆయన ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. కానీ బేబీ సినిమా తర్వాత వైష్ణవి చైతన్యతో ఆనంద్ మరో సినిమా తీస్తున్నట్లు ప్రచారం జరిగింది. దీనిని బట్టి చూస్తే అందులో నిజం లేదని తెలుస్తోంది. ఒక సినిమాకు హీరోయిన్గా ప్రగతి శ్రీవాస్తవ ఎంపిక దాదాపు జరిగిపోయింది. ఇక మిగిలి ఉండేది మైత్రీ మూవీ మేకర్స్ మాత్రమే ... అందులోనైనా ఆమెకు అవకాశం దక్కుతుందేమో వేచి చూడాలి. బేబీ సినిమా హిట్ కావడం వెనుక వైష్ణవి చైతన్య నటన ఎంతో బలం చేకూర్చింది. కానీ ఆ సినిమా తర్వాత ఆమెకు ఇప్పటి వరకు ఒక్క అవకాశం కూడా రాలేదు. -
హీరో శివకార్తికేయన్‌కు నిర్మాత షాక్.. అపరాధం విధించాలని పిటిషన్
Gnanavel Raja Petition Of Sivakarthikeyan For Mister Local Movie Loss: తమిళ హీరో శివకార్తికేయన్‌కు ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తానని రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ. 4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ కోరాడు. ఈ కేసుపై గురువారం (మార్చి 31) మద్రాస్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖళు చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. చదవండి: నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పిన వినకుండా తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్లో పేర్కొన్నాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్‌కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్ -
రామ్ సినిమా ఆపాలంటూ తమిళ నిర్మాత ఫిర్యాదు
హైదరాబాద్: ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని సినిమా చిక్కుల్లో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల రామ్ తమిళ దర్శకుడు లింగుస్వామితో సినిమా చేస్తున్నట్లు ప్రకటించారో లేదో ఈ చిత్రాన్ని ఆపాలంటూ స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత జ్ఞాన్ వేల్ రాజా అడ్డుకుంటున్నారు. కాగా ఇదే తరహాలో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో తెలుగులో సినిమా అనౌన్స్ చేయగానే లైకా ప్రొడక్షన్స్ అడ్డుకున్న సంగతి తెలిసిందే. చిక్కుల్లో రామ్ చిత్రం లింగుస్వామికి, తనకు మధ్య సినిమాల పరంగా కొన్ని ఆర్థిక లావాదేవీలు పెండింగ్‌లో ఉన్నాయని, అవి తేలేవరకు మరో సినిమాలు చేయకుండా చూడాలని తెలుగు నిర్మాతల మండలిలో జ్ఞాన్వేల్ తెలుగు నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ‘మా బ్యానర్ లో లింగుస్వామి సినిమా చేయాల్సి ఉంది. కానీ ప్రస్తుతం అది పూర్తి చేయకుండా, మా ప్రాజెక్ట్ పక్కనపెట్టి తెలుగులో రామ్‌తో సినిమా చేయడానికి సిద్ధమయ్యారు. ఇది కరెక్టు కాదు, మాట ప్రకారం ముందు మా బ్యానర్లో సినిమా చేయాలి. ఆ తర్వాతే కొత్త ప్రాజెక్టులోకి వెళ్లాలి. అందుకే నేను ఫిర్యాదు చేశాను గానీ ఆయన రామ్‌తో సినిమా చేయడంపై మాకెలాంటి అభ్యంతరమూ లేదని’ వివరించారు. మరి దీని పై లింగుస్వామి ఎలా స్పందిస్తారో చూడాలి. చదవండి: ఫ్యాన్స్ కోసం ‘గుడ్ లక్ సఖి’ స్పెషల్ షో -
కాపురాలు కూలిస్తే.. తస్మాత్ జాగ్రత్త!
‘‘కొందరు హీరోయిన్స్ కుటుంబాలను నాశనం చేస్తున్నారు. వాళ్లు సెక్స్ వర్కర్స్ కంటే దారుణంగా తయారయ్యారు’’ అంటూ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టార్ బ్రదర్స్ సూర్య, కార్తీలకు బంధువు అవుతారు జ్ఞానవేల్ రాజా. సూర్య హీరోగా జ్ఞానవేల్ నిర్మించిన ‘సింగం 3’ సినిమాకు నేహా కాస్ట్యూమ్ డిజైనర్‌గా చేశారు. కొందరి హీరోయిన్ల ధోర ణిపై ఆమె ట్విట్టర్లో స్పందిస్తూ – ‘‘అందర్నీ జన్రలైజ్ చేయటమో లేదా ఫ్రొఫెషనల్‌గా ఉండేవాళ్లను హర్ట్ చేయటానికో ఈ విషయం ప్రస్తావించట్లేదు. హీరోయిన్లను ఇండస్ట్రీలో అడ్జస్ట్ అవ్వమని అడుగుతారో లేదో తెలీదు కానీ కొందరు మాత్రం ‘బెడ్ రెడీ’ అన్నట్లు ఉంటారు. పెళ్లయిన వాళ్లను వెంబడిస్తుంటారు. ఒకవేళ అడ్జస్ట్ అవ్వమని ఇండస్ట్రీ అడిగితే ‘నో’ చెప్పి వెళ్లిపోలేరా? పెద్ద హీరోయిన్ అయిపోదామని, డబ్బులు సంపాదించే ప్రక్రియలో, లైమ్ లైట్లో ఉందామని చేసే ప్రయత్నమే ఇదంతా. మనమంతా ఫెమినిజమ్, స్త్రీ సాధికారత గురించి మాట్లాడుకుంటుంటాం. కానీ అసలైన నిజం ఏంటంటే ఆడదానికి ఆడదే శత్రువు. కొన్నిసార్లు ఓ స్త్రీ ఇంకో స్త్రీ జీవితం నాశనానికి కారణమవుతుంది. అవును.. కథకు రెండు వైపులా మాట్లాడాలి. కొందరు మగవాళ్లే వాళ్ల ఆటలు సాగనిచ్చి, వాళ్ల కుటుంబంలోకి వచ్చేదాకా చేస్తున్నారు. మనందరం ఇలా ఇళ్లను కూల్చేవాళ్లందరినీ బయటపెట్టి ఓపెన్ వార్నింగ్ ఇవ్వాలి. అమ్మాయిని మోసం చేసిన మగాడిని ఎలా శిక్షిస్తామో వీళ్లనూ అలానే దండించాలి. అవును... మగాళ్లు ఏమీ పసి పిల్లలు కాదు. కొందరు మగాళ్లు వీళ్లను లిమిట్లో ఉంచినా కూడా వీళ్లు హద్దులు దాటుతుంటారు. ఎమోషనల్ డ్రామాతో కట్టేస్తుంటారు. మొగుడిని కంట్రోల్ చేయటం, శిక్షించటమే కాదు.. భార్యల డ్యూటీ. ఇలాంటివాళ్లను హద్దుల్లో పెట్టడం కూడా. పబ్లిక్‌లో కుక్కని కొట్టినట్టు కొట్టాలి. కొందరు హీరోయిన్లను ఇలాంటి చర్యలను ఆపమని బతిమాలా. కానీ మారేలా లేరు. వాళ్లను కచ్చితంగా రోడ్డుకి ఈడుస్తాను. (అలాంటివాళ్లను హీరోయిన్స్ కాదు.. వ్యభిచారులు అనాలేమో).ఈ రేంజ్లో మాటల తూటాలు వదిలిన నేహా ఆ తర్వాత ఆ ట్వీట్ మొత్తాన్ని తీసేశారు. ‘‘నాకు,నా భర్తకు ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవు. నా చుట్టూ జరిగిన సంఘటనలు చూసి స్పందించాను. ఏదో డ్రామా క్రియేట్ చేయాలనో, ఇతరుల దృష్టి ఆకర్షించాలనో రాయలేదు. ఇక్కడ స్పందించటం వల్ల ఉపయోగం లేదని అర్థం అయింది. అందుకని తీసేశాను’’ అని నేహా పేర్కొన్నారు. -
'24' నిర్మాత సంచలన నిర్ణయం
చెన్నై: పైరసీ భూతం చలన చిత్రసీమను పట్టిపీడిస్తోంది. పైరసీ వెబ్ లో చిక్కుకున్న పరిశ్రమ ఎనలేని నష్టాలను చవిచూస్తోంది. ఈ నేపథ్యంలో సినీ దర్శకులు, నిర్మాతలు, నటీనటులు తీవ్ర ఆందోళనను వ్యక్తం చేస్తుండగా.. చాప కింద నీరులా పైరసీ భూతం విస్తరిస్తూనే ఉంది. ఈ క్రమంలోనే బెంగళూరులో '24 ' సినిమా విడుదల రోజే పెద్ద ఎత్తున పైరసీ సీడీలు పట్టుబడటం ఆందోళకు దారి తీసింది. పైరసీకి వ్యతిరేకంగా దృఢమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ చిత్రా నిర్మాత జ్ఞానవేల్ రాజా నిరవధిక నిరాహారదీక్ష చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఇప్పటికైనా చిత్రపరిశ్రమ ముందుకు వచ్చి సంబంధిత చర్యలు తీసుకోవాలని రాజా కోరారు. శుక్రవారం సాయంత్రం నుంచి నిరాహార దీక్షలో ఉన్నాననీ, పరిశ్రమ సీరియస్ గా స్పందించాల్సిన సమయం వచ్చిందని రాజా మీడియాకు తెలిపారు. సినీ పరిశ్రమ స్పందించి, సరైన చర్యలు చేపట్టేంతవరకు తన దీక్ష కొనసాగుతుందని స్పష్టం చేశారు. ప్రముఖ డిజిటల్ సినిమా ప్రొవైడర్ క్యూబ్, ద్వారా జారీ చేసిన ప్రకటన ప్రకారం, ఈ సినిమా చట్టవిరుద్ధంగా బెంగళూరు పీవీఆర్ ఓరియన్ మాల్ లో మే 6 న 9.45 గంటలకు షో ( విడుదలైన మొదటి రోజు) సమయంలో రికార్డు చేయబడిందని ఆరోపించారు. ఫోరెన్సిక్ వాటర్ మార్కింగ్ ద్వారా తాము దీన్ని గుర్తించామని రాజా ఆరోపించారు. ప్రతి థియేటర్ కు కేటాయించిన యూనిక్ కోడ్ ద్వారా ఇలా గుర్తించడం సాధ్యమని పేర్కొన్నారు. కాగా తమిళ స్టార్ హీరో సూర్య, విక్రం కుమార్ కాంబినేషన్లో రూపొందిన ఈ చిత్రంలో సూర్య త్రిపాత్రాభినయం చేయగా, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. టైం మిషన్ బ్యాక్ గ్రౌండ్‌తో వస్తున్న ఈ చిత్రాన్ని తమిళంలోనే కాకుండా తెలుగులో కూడా భారీ స్థాయిలో విడుదలైంది. ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ కు ఏఆర్ రెహ్మాన్ స్వరాలు సమకూర్చిన సంగతి తెలిసిందే.