తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్‌లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు.
సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్‌పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు.
కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది.
పా.రంజిత్ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment