Pa. Ranjith
-
శోభిత ధూళిపాళ టైమ్ వచ్చింది.. స్టార్ డైరెక్టర్ సినిమాలో ఛాన్స్
కోలీవుడ్ దర్శకుడు పా.రంజిత్( Pa. Ranjith) కథలే కాదు ఆయన దర్శకత్వం శైలి కూడా ఇతర చిత్రాలకు భిన్నంగా ఉంటుంది. అట్టకత్తి, మద్రాస్ చిత్రాల నుంచి సార్పట్ట పరంపర, తంగలాన్ వంటి చిత్రాలే పా.రంజిత్ వైవిధ్య దర్శక శైలికి నిదర్శనం. తంగలాన్‌లో నటుడు విక్రమ్ , నటి పార్వతీ, మాళవికా మోహన్ల వేషధారణ, హావభావాలకు మంచి పేరు వచ్చింది. కాగా పా.రంజిత్ తదుపరి సార్పట్ట పరంపర– 2 చిత్రం చేయబోతున్నట్లు, అదే విధంగా హిందీలో పర్సీ చిత్రం చేయబోతున్నట్లు ప్రచారం జరిగింది. అయితే అవేవీ కాకుండా ప్రస్తుతం ఆయన వెట్టువన్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో నటుడు దినేశ్ హీరోగా,ఆర్య విలన్‌గా నటిస్తున్నారు. అట్టకత్తి చిత్రం తరువాత వీరి కాంబినేషన్లో తెరకెక్కుతున్న చిత్రం ఇది. అదే విధంగా నటుడు అశోక్ సెల్వన్, ఫహాద్ ఫాజిల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాగా ఇందులో నటి శోభిత ధూళిపాళ( Sobhita Dhulipala) నాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. అయితే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలవడలేదన్నది గమనార్హం. కాగా ఈమె ఇంతకు ముందు మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్ చిత్రంలో కీలక పాత్ర పోషించారన్నది గమనార్హం. మేడ్ ఇన్ హెవన్, మేజర్ వంటి చిత్రాల్లో శోభిత తన నటనతో మెప్పించింది. అయితే, పా.రంజిత్ లాంటి డైరెక్టర్ సినిమాలో ఒకరు నటిస్తున్నారంటే వారి పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. అందుకు వారు సెట్ అవుతారని ఆయన భావిస్తేనే ఛాన్స్ ఇస్తారు. శోభితకు సరైన పాత్ర పడితే దుమ్మురేపుతుందని పేరు ఉంది. ఇప్పుడు ఈ కాంబినేషన్ సెట్ అయితే శోభిత టాలెంట్ చూపే టైమ్ వచ్చిందని చెప్పవచ్చు. నాగచైతన్యతో( Naga Chaitanya) పెళ్లి తర్వాత ఆమె ఈ బిగ్ ప్రాజెక్ట్‌లో భాగం కానుందని సమాచారం. కాగా ఈ చిత్రాన్ని గోల్డన్ రెయోమ్స్ సంస్థతో కలిసి దర్శకుడు .పా.రంజిత్‌కు చెందిన నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. కాగా ఈ చిత్ర పస్ట్‌లుక్ పోస్టర్‌ను 2022లో జరిగిన కాన్ చిత్రోత్సవాల వేదికపై ఆవిష్కరించారన్నది గమనార్హం. ఇప్పుడు ఈ చిత్ర షూటింగ్‌ను ప్రారంభించారు. కాగా ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని విషయాలు త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. -
పాన్ ఇండియా సినిమాలు.. 'కంగువా, తంగలాన్' విడుదలకు ఇబ్బందులు
తంగలాన్, గంగువా చిత్రాలను స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. కోలీవుడ్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలు పాన్ ఇండియా రేంజ్లో విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతున్న ఈ రెండు సినిమాల్లో 'తంగలాన్' షూటింగ్ ఇప్పటికే పూర్తి చేసుకుంది. ఈ చిత్రాన్ని రిపబ్లిక్ డే సందర్భంగా జనవరి 26న విడుదల చేయాలనుకున్నారు. కానీ వాయిదా వేసి ఏప్రిల్‌లో విడుదల చేస్తామని దర్శక, నిర్మాతలు ప్రకటించారు. వాయిదాకు సంబంధించిన కారణాలు మాత్రం ఆ సమయంలో తెలుపలేదు. సూర్య ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘కంగువా’. శివ దర్శకుడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలపై నిర్మాతల్లో ఒకరైన ధనంజయన్ గతంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'సినిమా పూర్తి కాకముందే రిలీజ్ డేట్ ప్రకటించి ఒత్తిడికి గురి కావడం మాకు ఇష్టం లేదు. ఇది ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్. 3డీ, సీజీ వర్క్‌కు చాలా సమయం పట్టొచ్చు. అందుకే మేమింకా రిలీజ్ డేట్ నిర్ణయించలేదు. సూర్య పార్ట్ షూట్ పూర్తైంది. బాబీ దేవోల్‌పై కొంత చిత్రీకరణ ఉంది. 10 భాషల్లో రిలీజ్ చేస్తాం. ప్రస్తుతం మా దృష్టి పోస్ట్ ప్రొడెక్షన్పై ఉంది.' అని కొద్దిరోజుల క్రితం ఆయన చెప్పారు. కంగువా చిత్రం పోస్ట్ ప్రొడెక్షన్ పనులు వల్ల ఆలస్యమైతే.. తంగలాన్ మాత్రం గ్రాఫిక్స్ వర్క్ వల్ల ఆలస్యమవుతుందని మేకర్స్ ప్రకటించారు. కానీ ఫైనాన్స్ సమస్యల కారణంగా ఈ రెండు సినిమాల విడుదలకు ఇబ్బంది ఏర్పడిందని కోలీవుడ్‌లో వార్తలు వస్తున్నాయి. అసలు విషయం చెప్పకుండా గ్రాఫిక్స్ వర్క్ ఉందని వారు చెబుతున్నారని ప్రచారం జరుగుతుంది. పా.రంజిత్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న 'తంగలాన్' చిత్రాన్ని ఆస్కార్‌కి తీసుకెళ్తామని నిర్మాతలు చెప్పడంతో ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగాయి. ఇలాంటి సినిమాలకు గ్రాఫిక్స్ వర్క్ నిజంగానే ఎక్కువగా ఉంటుందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. వాస్తవంగా 'తంగలాన్' చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది. కానీ విడుదలపై ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.. అదే విధంగా 'కంగువా' కూడా షూటింగ్ ప్రారంభమై రెండేళ్లు కావస్తుంది. ఈ చిత్రం విడుదలపై కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన లేదు. దీంతో ఈ రెండు ప్రాజెక్ట్‌లకు ఫైనాన్స్ ఇబ్బందులు వచ్చినట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. -
త్వరలో విడుదల కానున్న పా.రంజిత్ 'నక్షత్రం నగర్దిరదు'
దర్శకుడు పా.రంజిత్ చిత్రాల నేపథ్యం ఇతరులకు పూర్తి భిన్నంగా ఉంటుందనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉండదు. రజనీకాంత్ హీరోగా కబాలీ, కాలా, వంటి చిత్రాలను తెరకెక్కించిన ఈయన ఇటీవలే సార్పట్టా పరంపరై సినిమాతో మంచి విజయాన్ని సాధించాడు. తాజాగా నక్షత్రం నగర్గిరదు పేరుతో వైవిధ్యభరిత ప్రేమ కథా చిత్రాన్ని తెరకెక్కించారు. యాళీ ఫిలింస్ సంస్థతో కలిసి పా.రంజిత్ నీలం ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ చిత్రంలో కాళిదాస్ జయరామ్, తుషారా విజయన్, కలైయరసన్, షబీర్, హరి, దాము, వినోద్, సుభద్ర తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. నిర్మాణ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఆ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. ప్రేమ ప్రధానాంశంగా తెరకెక్కించిన చిత్రం అని యూనిట్ వర్గాలు గురువారం మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ప్రేమకు రాజకీయాలు పులిమి, కులాల రంగు పూసి కాలం గడిపేస్తున్న మనుషుల మధ్య స్వచ్ఛమైన ప్రేమను ఆవిష్కరించే చిత్రంగా ఇది ఉంటుందన్నారు. దీనికి కిశోర్ ఛాయాగ్రహణం, డెన్మా సంగీతాన్ని అందించారు. చదవండి: ఆరేళ్ల రిలేషన్.. కానీ అప్పుడే మా ప్రేమ బలపడింది నటుడు ప్రభు ఇంట ఆస్తి వివాదం.. కోర్టును ఆశ్రయించిన తోబుట్టువులు -
బాలీవుడ్ ఎంట్రీ!
సూపర్ స్టార్ రజనీకాంత్‌తో బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు ‘కబాలి’, ‘కాలా’ చేసిన దర్శకుడు పా. రంజిత్. ఆయన తదుపరి చిత్రం ఏంటా? అని కోలీవుడ్ ఎదురు చూస్తోంది. అయితే పా. రంజిత్ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. నమహా పిక్చర్స్ నిర్మించబోయే పీరియాడికల్ డ్రామా ద్వారా గ్రాండ్ ఎంట్రీ ఇస్తున్నారాయన. రంజిత్ తీసిన గత చిత్రాలు చూసి నిర్మాతలు షరీన్, కిశోర్ అరోరా ఆయన్నే డైరెక్టర్‌గా ఫిక్స్ అయ్యారట. ఈ పీరియాడికల్ డ్రామా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుందని సమాచారం. ప్రతి సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించే రంజిత్ ఈ చిత్రాన్ని కూడా అదే స్టైల్లో తెరకెక్కిస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఓ తమిళ చిత్రం చేయడానికి కూడా రంజిత్ కమిట్ అయ్యారు. -
సరికొత్త మ్యూజిక్ బ్యాండ్
సాక్షి, చెన్నై: తమిళనాడు చలనచిత్ర దర్శకుడు పా. రంజిత్ గత కొన్ని నెలలుగా ఓ సమున్నత లక్ష్యంతో ఓ సంగీతం బ్యాండ్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. రాష్ట్రంలోని రాజకీయ, సామాజిక అంశాలపై ఈ బ్యాండ్ పోరాటం సాగించేలా ఉండాలని భావించారు. ముఖ్యంగా రాష్ట్రంలో వేళ్లూనుకుపోయిన కుల వ్యవస్థను నిర్మూలించే దిశగా కషి చేయాలనుకున్నారు. చివరకు విజయం సాధించారు. 19 మంది సభ్యులతో ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’ పేరుతో సంగీత బందాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంగీత బందంలో నలుగురు ర్యాపర్లు, ఏడుగురు వాయిద్యకారులు, ఎనిమిది మంది గాత్ర విద్వాంసులు, ప్రముఖ తమిళ జానపద కళాకరుడు ఉన్నారు. 19 మందిలో ఓ మహిళ ఉన్నారు. లేబుల్ మద్రాస్ రికార్డ్స్‌తో కొలాబరేషన్ ఉన్న నీలమ్ కల్చరల్ సెంటర్‌ను రంజిత్ ఎప్పటి నుంచో నిర్వహిస్తున్నారు. ఆ అనుభవం ఇప్పుడు ఈ మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేయడానికి ఆయనకు దోహదపడింది. తమిళనాడులో కులాలకు వ్యతిరేకంగా పోరాడిన కార్యకర్త, రచయిత సీ. అయోతీ థాస్ రూపొందించిన పద బంధం ‘జాతి ఇలాతు తమిళరగల్’ స్ఫూర్తితో ఇంగ్లీషులో ‘ది క్యాస్ట్‌లెస్ కలెక్టివ్’ మ్యూజిక్ బ్యాండ్‌ను ఏర్పాటు చేసినట్లు రంజిత్ తెలిపారు. ఈ బ్యాండ్ తన మొదటి కచేరీని చెన్నైలోని కిల్పాక్లో జనవరి ఆరో తేదీన ఏర్పాటు చేయగా, ప్రేక్షకుల నుంచి మంది స్పందన వచ్చింది. ఆ నాటి కచేరీకి దాదాపు నాలుగువేల మంది ప్రేక్షకులు హాజరయ్యారు. కుల రహిత సమాజమే ప్రాతిపదికగా సొంతంగా బ్యాండ్ సభ్యుడు రాసిన పాటనే కచేరీలో పాడగా హర్షధ్వానాలు మిన్నంటాయి. ఈ బ్యాండ్ పాడిన పాటలు ఇప్పుడు ఇంటర్నెట్లో హల్చల్ చేస్తున్నాయి. -
సూపర్‌స్టార్‌తో మరోసారి
సూపర్‌స్టార్ రజనీకాంత్ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. స్టార్ డైరెక్టర్ శంకర్ మరో అద్భుత సృష్టి ఇది. దీని నిర్మాణం రూ.350 కోట్లు దాటేస్తోందంటున్నారు చిత్ర వర్గాలు. ఆ విధంగా చూస్తే ఇండియాలోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రం 2.ఓనే అవుతుంది. అదే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ ఫార్మాట్లో రూపొందుతున్న ఈ చిత్రం వ్యాపారపరంగా ఇప్పటి నుంచే ప్రకంపనలు సృష్టిస్తోంది. చానళ్ల హక్కుల విక్రయణే రూ.110 కోట్లు జరుపుకుని సినీ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంగ్లీష్ భామ ఎమీజాక్సన్ నాయకిగా, అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడిగా నటిస్తున్న 2.ఓ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి. ఇకపోతే రజనీకాంత్ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కబాలి–2లో నటించనున్నట్లు, దీన్ని పా.రంజిత్ దర్శకత్వంలో నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కథానాయకి ఎవరన్న చర్చ చాలా కాలంగా ఆసక్తిగా మారిన అంశం. నటి విద్యాబాలన్ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది కూడా. అయితే ఎస్ అని గానీ, నో అని గానీ చెప్పకుండా ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నటి దీపికాపదుకొనే పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు పా.రంజిత్ ఆ అమ్మడితో చర్చలు జరిపినట్లు, రజనీకాంత్‌తో మరోసారి రొమాన్స్ చేయడానికి దీపకా సై అన్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. దీంతో ఈ బ్యూటీ సూపర్‌స్టార్‌తో రెండోసారి నటించబోతున్నారన్న మాట. ఇంతకు ముందు కోచ్చడయాన్ చిత్రంలో తొలిసారిగా ఆయనతో నటించారన్నది గమనార్హం. కబాలి–2 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్ కార్యక్రమాలను చిత్ర యూనిట్ ఇప్పటికే ప్రారంభించినట్లు, ఏప్రిల్ ఒకటవ తేదీన చిత్ర షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. ఇందులో సూపర్‌స్టార్ మరోసారి బాషా చిత్రం తరహాలో పవర్ఫుల్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు టాక్.