సూపర్‌స్టార్‍తో మరోసారి | rajinikanth and deepika padukene once again act to new movie | Sakshi
Sakshi News home page

సూపర్‌స్టార్‍తో మరోసారి

Published Sat, Mar 18 2017 2:36 AM | Last Updated on Tue, Sep 5 2017 6:21 AM

సూపర్‌స్టార్‍తో  మరోసారి

సూపర్‌స్టార్‍తో మరోసారి

సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం 2.ఓ. చిత్రీకరణ చివరి దశకు చేరుకుంది. స్టార్‌ డైరెక్టర్‌ శంకర్‌ మరో అద్భుత సృష్టి ఇది. దీని నిర్మాణం రూ.350 కోట్లు దాటేస్తోందంటున్నారు చిత్ర వర్గాలు. ఆ విధంగా చూస్తే ఇండియాలోనే అత్యధిక వ్యయంతో తెరకెక్కుతున్న చిత్రం 2.ఓనే అవుతుంది. అదే విధంగా అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో 3డీ ఫార్మాట్‌లో రూపొందుతున్న ఈ చిత్రం వ్యాపారపరంగా ఇప్పటి నుంచే ప్రకంపనలు సృష్టిస్తోంది.

చానళ్ల హక్కుల విక్రయణే రూ.110 కోట్లు జరుపుకుని సినీ పండితులను ఆశ్చర్యంలో ముంచెత్తుతోంది. ఇంగ్లీష్‌ భామ ఎమీజాక్సన్‌ నాయకిగా, అక్షయ్‌కుమార్‌ ప్రతినాయకుడిగా నటిస్తున్న 2.ఓ చిత్రంపై అంచనాలు స్కై లెవల్లో ఉన్నాయి. ఇకపోతే రజనీకాంత్‌ తదుపరి చిత్రానికి సిద్ధం అవుతున్నారు. కబాలి–2లో నటించనున్నట్లు, దీన్ని పా.రంజిత్‌ దర్శకత్వంలో నటుడు ధనుష్‌ తన వండర్‌బార్‌ ఫిలింస్‌ పతాకంపై నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు ఇది వరకే అధికారికంగా ప్రకటన వెలువడిన విషయం తెలిసిందే. అయితే ఇందులో కథానాయకి ఎవరన్న చర్చ చాలా కాలంగా ఆసక్తిగా మారిన అంశం. నటి విద్యాబాలన్‌ నటించే అవకాశం ఉన్నట్లు ప్రచారం జోరుగా సాగింది కూడా. అయితే ఎస్‌ అని గానీ, నో అని గానీ చెప్పకుండా ఆలస్యం చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి.

ఇలాంటి పరిస్థితుల్లో తాజాగా నటి దీపికాపదుకొనే పేరు తెరపైకి వచ్చింది. ఇటీవల దర్శకుడు పా.రంజిత్‌ ఆ అమ్మడితో చర్చలు జరిపినట్లు, రజనీకాంత్‌తో మరోసారి రొమాన్స్‌ చేయడానికి దీపకా సై అన్నట్లు కోలీవుడ్‌ వర్గాల టాక్‌. దీంతో ఈ బ్యూటీ సూపర్‌స్టార్‌తో రెండోసారి నటించబోతున్నారన్న మాట. ఇంతకు ముందు కోచ్చడయాన్‌ చిత్రంలో తొలిసారిగా ఆయనతో నటించారన్నది గమనార్హం. కబాలి–2 చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్స్‌ కార్యక్రమాలను చిత్ర యూనిట్‌ ఇప్పటికే ప్రారంభించినట్లు, ఏప్రిల్‌ ఒకటవ తేదీన చిత్ర షూటింగ్‌ను ముంబైలో ప్రారంభించనున్నట్లు తాజా సమాచారం. ఇందులో సూపర్‌స్టార్‌ మరోసారి బాషా చిత్రం తరహాలో పవర్‌ఫుల్‌ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించనున్నట్లు టాక్‌. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement