బాలీవుడ్‌ ఎంట్రీ! | Pa. Ranjith to make directorial debut in Bollywood with period drama | Sakshi
Sakshi News home page

బాలీవుడ్‌ ఎంట్రీ!

Published Fri, Aug 3 2018 5:07 AM | Last Updated on Wed, Apr 3 2019 6:34 PM

Pa. Ranjith to make directorial debut in Bollywood with period drama - Sakshi

పా. రంజిత్‌

సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌తో బ్యాక్‌ టు బ్యాక్‌ రెండు సినిమాలు ‘కబాలి’, ‘కాలా’ చేసిన దర్శకుడు పా. రంజిత్‌. ఆయన తదుపరి చిత్రం ఏంటా? అని కోలీవుడ్‌ ఎదురు చూస్తోంది. అయితే పా. రంజిత్‌ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నారట. నమహా పిక్చర్స్‌ నిర్మించబోయే పీరియాడికల్‌ డ్రామా ద్వారా గ్రాండ్‌ ఎంట్రీ ఇస్తున్నారాయన. రంజిత్‌ తీసిన గత చిత్రాలు చూసి నిర్మాతలు షరీన్, కిశోర్‌ అరోరా ఆయన్నే డైరెక్టర్‌గా ఫిక్స్‌ అయ్యారట. ఈ పీరియాడికల్‌ డ్రామా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుందని సమాచారం. ప్రతి సినిమాను చాలా రియలిస్టిక్‌గా తెరకెక్కించే రంజిత్‌ ఈ చిత్రాన్ని కూడా అదే స్టైల్‌లో తెరకెక్కిస్తారని ఊహించవచ్చు. ఈ చిత్రం వచ్చే ఏడాదిలో సెట్స్‌ మీదకు వెళ్లనుంది. మరోవైపు ఓ తమిళ చిత్రం చేయడానికి కూడా రంజిత్‌ కమిట్‌ అయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement