Gnanavel Raja Petition Of Sivakarthikeyan For Mister Local Movie Loss: తమిళ హీరో శివకార్తికేయన్‌కు ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తానని రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ. 4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ కోరాడు. ఈ కేసుపై గురువారం (మార్చి 31) మద్రాస్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖళు చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా.
చదవండి: నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు
తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పిన వినకుండా తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్‌లో పేర్కొన్నాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్‌కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
చదవండి: సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్
Comments
Please login to add a commentAdd a comment