gnanavel raja
-
రిలీజ్‌కు ముందు చిక్కుల్లో తంగలాన్ మూవీ!
చియాన్ విక్రమ్ తాజాగా నటించిన భారీ యాక్షన్ చిత్రం తంగలాన్. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, పార్వతి తిరువోతు హీరోయిన్లుగా నటించారు. ఈ మూవీలో విక్రమ్ విభిన్నమైన గెటప్‌లో ప్రేక్షకులను పలకరించనున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది. దీంతో చిత్రయూనిట్ అంతా మూవీ ప్రమోషన్లతో బిజీగా ఉన్నారు. ఈ సినిమాను స్టూడియో గ్రీన్ బ్యానర్లో కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు.అయితే రిలీజ్‌కు తంగలాన్ నిర్మాతకు ఇబ్బందులు ఎదురయ్యాయి. తంగలాన్ మూవీ రిలీజ్‌కు ముందే రూ.1 కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు మద్రాసు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుందర్‌దాస్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టిన ధర్మాసనం తీర్పు వెల్లడించింది. అంతేకాకుండా సూర్య హీరోగా నటిస్తోన్న కంగువా చిత్రం విడుదలకు ముందు కూడా కోటి రూపాయలు డిపాజిట్ చేయాలని నిర్మాతకు సూచించింది.అసలేం జరిగిందంటే..గతంలో అర్జున్‌లాల్ సుందరదాస్ అనే వ్యక్తితో కలిసి నిర్మాత జ్ఞానవేల్ రాజా రూ.40 కోట్లతో ఓ సినిమా నిర్మించాలని అనుకున్నారు. అయితే ప్రీ-ప్రొడక్షన్‌కి ఖర్చులకు గానూ స్టూడియో గ్రీన్ నిర్మాణ సంస్థకు సుందర్‌దాస్ రూ.12.85 కోట్లు చెల్లించారు. తర్వాత ఆర్థికపరమైన ఇబ్బందులు రావడంతో ఈ ప్రాజెక్ట్ నుంచి సుందర్‌దాస్ తప్పుకున్నాడు. అయితే అందులో కేవలం రూ.2.5 కోట్లు మాత్రమే తిరిగి వచ్చాయి. ఆ తర్వాత ఆయన మరణించడంతో మిగిలిన రూ.10.35 కోట్ల కోసం సుందర్‌దాస్ కుటుంబసభ్యులు కోర్టును ఆశ్రయించారు.అయితే ఈ కేసు గురించి నిర్మాత కేఈ జ్ఞానవేలు మాట్లాడుతూ... మూడు తమిళ సినిమాల హిందీ డబ్బింగ్ హక్కులకు ఇవ్వాల్సిన డబ్బుకు బదులుగా.. ఆ రూ.12.85 కోట్లు ఇచ్చాడని తెలిపారు. అంతే కానీ తమకు ఎలాంటి డబ్బు ఇవ్వలేదని చెప్పారు. కానీ గ్రీన్ స్టూడియోస్ తమకు రూ.10.25 కోట్లను 18 శాతం వార్షిక వడ్డీతో తిరిగి చెల్లించాలని డిమాండ్ చేస్తూ అర్జున్ లాల్ సుందర్ దాస్ కుటుంబం కోర్టులో దావా వేసింది. ఈ కేసుపై విచారణ చేపట్టినా ధర్మాసనం నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా సినిమాల రిలీజ్‌కు ముందు కోటి రూపాయలు సెక్యూరిటీ డిపాజిట్ చేయాలని ఆదేశించింది. -
వేట్టయాన్ పాట కోసం భారీ ఖర్చు.. 500 మందితో రచ్చ
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. అయితే, ఈ సినిమాలో ఒక పాట కోసం భారీగా ఖర్చు చేసి నట్లు తెలుస్తోంది.జైలర్ సినిమా తర్వాత వేట్టైయాన్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మాజీ పోలీస్ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం తిరువనంతపురం, కన్యాకుమారి, ముంబయి, కేరళ ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల రజనీకాంత్‌తో పాటు 500 మంది నృత్య కళాకారులతో ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిసింది. ఈ ఒక్క సాంగ్ కోసం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఇంతమంది డాన్సర్స్‌తో పాటను చిత్రీకరించిన దాఖలాలు లేవు. దీంతో వేట్టైయాన్ చిత్రంపై ఆసక్తితో పాటు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగినా, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడలేదు. -
మా నాన్న నాతో సినిమా తీయలేదని ఎందుకు అన్నానంటే..
-
పుష్ప 2 ముందు ఏదైనా జుజుబీ.. తమిళ్ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్
-
కార్తి హీరోగా మొదటి సినిమా.. వివాదంపై సముద్రఖని ఆగ్రహం!
కోలీవుడ్‌లో కొంతకాలంగా వివాదాల పర్వం నడుస్తోంది. ఇప్పటికే గౌతమ్ మీనన్ తెరకెక్కించిన ధృవనచ్చితిరం సినిమా రిలీజ్ విషయంలోనూ అదే జరిగింది. ఎనిమిదేళ్ల క్రితం మొదలైన ఈ సినిమా రిలీజ్‌కు ముందు రోజే అభిమానులకు షాక్ తగిలింది. ఈ సినిమా సమస్య కాస్తా కోర్టుకు చేరడంతో మరోసారి వాయిదా పడింది. ఇదిలా ఉండగా తాజాగా మరో వివాదం తెరపైకి వచ్చింది. ఈసారి ఏకంగా 16 ఏళ్ల క్రిత రిలీజైన సినిమా విషయంలో ఇప్పుడు వివాదం మొదలైంది. అదేంటో తెలుసుకుందాం. కోలీవుడ్ నటుడు, నిర్మాత సముద్రఖని మరో నిర్మాత తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో కార్తి నటించిన చిత్రం ‘పరుత్తివీరన్’. ఈ చిత్రం ద్వారానే కార్తి ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. ఈ సినిమా వివాదంపై సముద్రఖని మండిపడ్డారు. అయితే ఈ సినిమా విషయంలో కొన్నిరోజులుగా దర్శకుడు ఆమిర్, నిర్మాత జ్ఞానవేల్ రాజా మధ్య వివాదం కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే పరుత్తివీరన్ దర్శకుడికి మద్దతుగా సముద్రఖని ఓ లేఖ విడుదల చేశారు. సముద్ర ఖని లేఖలో ప్రస్తావిస్తూ.. 'పరుత్తివీరన్‌లో నేను కూడా నటించా. ఆ సినిమా టైంలో డైరెక్టర్ ఎన్ని ఇబ్బందులు పడ్డాడో నాకు తెలుసు. నిర్మాతగా ఒక్కరోజు కూడా జ్ఞానవేల్ సెట్‌కు రాలేదు. సినిమా బడ్జెట్ విషయంలోనూ డైరెక్టర్‌కు సహకరించలేదు. నా వద్ద డబ్బుల్లేవంటూ షూటింగ్ మధ్యలోనే చేతులెత్తేశావు. బంధువుల దగ్గర నుంచి అప్పులు చేసి మరీ ఆమిర్ షూటింగ్ పూర్తి చేశాడు. దీనికి నేనే ప్రత్యక్ష సాక్ష్యం. ఎంతో కష్టపడి సినిమా తీస్తే పేరు మాత్రం నువ్వు పొందావు. ఈ రోజు నువ్వు అమిర్‌పై తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్నావు. ఈ పద్ధతితేం బాగాలేదు. నీకింత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది. నువ్వు చాలా పెద్ద తప్పు చేస్తున్నావు.' అని సముద్రఖని మండిపడ్డారు. ప్రస్తుతం ఈ లేఖ కోలీవుడ్‌లో సంచలనంగా మారింది. అసలేం జరిగిందంటే.. ఇటీవలే కార్తి హీరోగా నటించిన చిత్రం ‘జపాన్’. ఈ సినిమాకు జ్ఞానవేల్ రాజా దీనికి నిర్మాతగా వ్యవహరించారు. చెన్నైలో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు కార్తితో ఇప్పటివరకూ సినిమాలు చేసిన దర్శకులందరూ హాజరయ్యారు. అయితే ఫస్ట్ మూవీ డైరెక్టర్ ఆమిర్ మాత్రం ఈవెంట్‌కు రాలేదు. దీనిపై ఆయన ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. కార్తి జపాన్ మూవీ ఈవెంట్‌కు నాకు ఆహ్వానం అందలేదు. సూర్య - కార్తితో నాకు రిలేషన్స్ అంత బాగాలేవు.. జ్ఞానవేల్ వల్లే ఇలాంటి పరిస్థితులు వచ్చాయని అమిర్ అన్నారు. అయితే అమిర్ వ్యాఖ్యలపై జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ.. 'అమిర్‌కు ఆహ్వానం పంపించాం. పరుత్తివీరన్ సినిమాకు అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు నాతో ఖర్చుపెట్టించాడు. సరైన లెక్కలు చెప్పకుండా డబ్బులు దండుకున్నాడు అంటూ తీవ్రమైన ఆరోపణలు చేశాడు. దీంతో వీరిద్దరి వివాదం ప్రస్తుతం కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. pic.twitter.com/JYfQNIgfcw — P.samuthirakani (@thondankani) November 25, 2023 -
సూర్య 'కంగువా' చిత్రంపై భారీ అంచనాలు పెంచేలా నిర్మాత వ్యాఖ్యలు
కోలీవుడ్ అగ్ర నటుడు సూర్య హీరోగా దర్శకుడు శివ తెరకెక్కిస్తున్న చిత్రం ‘కంగువా’. స్టూడియో గ్రీన్, యూవీ క్రియేషన్స్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. సూర్యకు జోడీగా దిశా పటానీ నటిస్తోంది. భారీ పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ముస్తాబవుతున్న ఈ సినిమాలో సూర్య అత్యంత పరాక్రమవంతుడిగా కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుంది. తాజాగా ‘కంగువా’ను ఉద్దేశించి చిత్ర నిర్మాత జ్ఞానవేల్ రాజా చేసిన వ్యాఖ్యలు సినిమాపై భారీ అంచనాలు పెంచేస్తున్నాయి. 'కంగువా సినిమా ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. ముందుగా కేవలం 10 భాషల్లో మాత్రమే విడుదల చేయాలని అనుకున్నాం. కానీ కంగువా చిత్రాన్ని ఏకంగా 38 భాషల్లో రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. అంతేకాకుండా ఐమ్యాక్స్, 3డీ వెర్షన్లోనూ ఇది అందుబాటులోకి తెస్తున్నాం. కోలీవుడ్ చిత్ర పరిశ్రమ స్థాయిని మరింత పెంచేలా ఈ సినిమా ఉండబోతుంది.' అని జ్ఞానవేల్ రాజా అన్నారు. కంగువ కలెక్షన్స్ విషయంలో సినిమా లక్ష్యం రూ.1000 కోట్లని చిత్ర నిర్మాతల్లో మరోకరు చెప్పారు. ఈ వ్యాఖ్యలతో ఈ సినిమాపై పెట్టుకున్న అంచనాలు భారీగా పెరిగాయి. ఇందులో సూర్య ఆరు భిన్నమైన అవతారాల్లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో దిశా పఠానీతో పాటు బాబీ దేవోల్, జగపతి బాబు, యోగిబాబు తదితరులు నటిస్తున్నారు. 2024 వేసవి సమయంలో ఈ చిత్రం విడుదల కానుంది. పార్ట్-1 హిట్ అయితే పార్ట్-2 కూడా ఉన్నట్లు సమాచారం. Exclv: Producer KEG. @StudioGreen2 🤫😱#KANGUVA - 38 Languages | 3D | IMAX A Huge Sambavam loading it seems..🔥 Next Level of @Suriya_offl ..⭐pic.twitter.com/GvwBIU7GQZ — Suriya Yash Fan page ™ (@Suriya_Yash_Fc) November 20, 2023 -
రజనీకాంత్ 170వ చిత్రంలో ఆ నలుగురు స్టార్స్.. ఇంట్రెస్టింగ్ టైటిల్!
తమిళసినిమా: రజనీకాంత్ ఈ పేరే క్రేజ్‌కు బ్రాండ్ అంబాసిడర్. వయసు పెరుగుతున్నా ఏ మాత్రం తగ్గని క్రేజ్, స్టైల్ ఈయన సొంతం. ప్రస్తుతం 169 నాటౌట్ గా నిలిచిన రజనీకాంత్ 170వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. రజనీకాంత్ నటించిన తాజా చిత్రం జైలర్ నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకుని భారీ అంచనాల మధ్య ఈనెల 10న ప్రపంచవ్యాప్తంగా తెరపైకి రావడానికి ముస్తాబవుతోంది. అదేవిధంగా తన కూతురు ఐశ్వర్య దర్శకత్వంలో అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్ర షూటింగు పూర్తయింది. దీంతో తన 170వ చిత్రానికి రజనీకాంత్ సిద్ధమవుతున్నారు. ఈ చిత్రానికి జైభీమ్ చిత్రం ఫేమ్ జ్ఞానవేల్ దర్శకత్వం వహించనున్నట్లు, దీన్ని లైకా ప్రొడక్షన్ సంస్థ నిర్మించనున్నట్లు ఇంతకుముందే అధికారికంగా ప్రకటన విడుదలైన విషయం తెలిసిందే. కాగా తాజాగా క్రేజీ చిత్రానికి సంబంధించిన పలు ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. ముఖ్యంగా ఇందులో రజనీకాంత్‌తో పాటు బాలీవుడ్ అమితాబచ్చన్ ముఖ్యపాత్ర పోషించనున్నట్లు సమాచారం. అదేవిధంగా మలయాళ నటుడు ఫాహత్ ఫాజిల్, తెలుగు నటుడు నాని ముఖ్యపాత్రలు పోషించనున్నట్లు ఇక మలయాళ బ్యూటీ మంజువారియర్ ఇందులో రజనీకాంత్ సరసన నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరో విషయం ఏంటంటే రజనీకాంత్‌ను పోలీసు పాత్రలు వెంటాడుతున్నాయని చెప్పాలి. ఇంతకుముందు దర్బార్ చిత్రంలో పోలీస్ అధికారిగా నటించిన రజనీకాంత్ తాజాగా చిత్రంలోని ఆ తరహా పవర్ఫుల్ పాత్రను పోషించారు. లేకపోతే ఆయన 170 చిత్రంలోను పోలీస్ అధికారిగా నటించనున్నట్లు సమాచారం. ఇది యథార్థ సంఘటన ఆధారంగా రూపొందుతున్న కథాచిత్రం. అనిరుధ్ సంగీతాన్ని అందించనున్న దీనికి వేట్టైయాన్( Vettaiyan) అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు తాజా సమాచారం. అయితే ఈ టైటిల్ డైరెక్టర్ విన్సెంట్ సెల్వ వద్ద ఉందని, రజనీకాంత్ కోసం ఆయన ఇది వదులుకుంటారా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. -
సినిమా – బయోపిక్: దోసె కింగ్ పై ఆమె యుద్ధం
ఇరవై ఏళ్లు ఆమె న్యాయం కోసం యుద్ధం చేసింది. ఎక్కడా తగ్గలేదు.. దేనికీ భయపడలేదు. అవతల ఉన్నది వందల కోట్లకు అధిపతి, రెస్టరెంట్ రంగానికి సమ్రాట్, వేలాది ఉద్యోగుల దేవుడు ‘శరవణ భవన్’ రాజగోపాల్. కాని ఆయన వల్ల తనకు అన్యాయం జరిగిందని ఆమె న్యాయపోరాటం చేసింది. ఆమె కథ ఇప్పుడు ‘జైభీమ్’ దర్శకుడు జ్ఞానవేల్ దర్శకత్వంలో బాలీవుడ్లో ‘దోసె కింగ్’గా చిత్ర రూపం దాలుస్తోంది. ఆమె పేరు జీవజ్యోతి శాంతకుమార్. ఇది ఆమె పోరాటగాథ. ‘శరవణ భవన్’ పి.రాజగోపాల్‌ను చెన్నై వచ్చిన కొత్తల్లో ఒక జ్యోతిష్యుడు ఏదైనా ‘అగ్ని’తో ముడిపడిన వ్యాపారం పెట్టు అన్నాడు. రాజగోపాల్ ‘శరవణ భవన్’ రెస్టరెంట్ పెట్టి, సక్సెస్ అయ్యి, 22 దేశాల్లో తన హోటల్ సామ్రాజ్యాన్ని విస్తరించి 30 వేల కోట్ల సంపదకు ఎగబాకాడు. జ్యోతిష్యుడు చెప్పింది నిజమైంది. అయితే అగ్నితో పోల్చే ‘కామాగ్ని’తో అదే రాజగోపాల్ అంత పేరూ దహించుకుపోవడమూ ఈ జోస్యంలో ఉంది. ఆమె పేరు జీవజ్యోతి జీవజ్యోతి ఎంతో చలాకీ అమ్మాయి. చదువుకుంటున్న అమ్మాయి. శరవణ భవన్లో పని చేసే అసిస్టెంట్ మేనేజర్ కూతురిగా పి.రాజగోపాల్‌కు 1996లో పరిచయం అయ్యింది. అప్పటికే రాజగోపాల్ ‘దోసె కింగ్’ గా చెన్నైలో పేరు గడించాడు. శరవణ భవన్లో వేలాది ఉద్యోగులకు రకరకాల అలవెన్సులు ఇస్తూ కన్నబిడ్డల్లా చూసుకుంటూ దేవుడయ్యాడు. అతని మాటకు ఎదురు లేదు. 1972లో ఒక వివాహం (ఇద్దరు కొడుకులు), 1994లో మరో వివాహం చేసుకున్న రాజగోపాల్ జీవజ్యోతిని మూడో వివాహం చేసుకోవాలనుకున్నాడు. దానికి కారణం కూడా జోతిష్యమే.‘మీ ఇద్దరి జాతకాలు కలిశాయి. ఆమెను చేసుకుంటే నువ్వు మరిన్ని ఘనవిజయాలు సాధిస్తావు’ అని ఒక జ్యోతిష్యుడు చెప్పిన మాటలతో ఆమెను వివాహం చేసుకోవాలనుకున్నాడు. అయితే జాతకం ఒకటి తలిస్తే జీవజ్యోతి మరొకటి తలిచింది. ట్యూషన్ మాస్టర్‌తో ప్రేమ జీవజ్యోతి పి.రాజగోపాల్‌ను తన గార్డియన్ గా భావించింది. పెద్దాయన అభిమానం ప్రదర్శిస్తున్నాడనుకుంది తప్ప అతని మనసులో ఏముందో ఊహించలేకపోయింది. ఈలోపు ఆమె శాంతకుమార్ అనే లెక్కల ట్యూషన్ మాస్టర్ ప్రేమలో పడి 1999లో పెళ్లి చేసుకోవడానికి పారిపోయింది. ఆమె మీద అప్పటికే కన్ను వేసి ఉన్న రాజగోపాల్ ఆ జంటను చెన్నై రప్పించి కాపురం పెట్టించాడు. కాని 2000 సంవత్సరంలో శాంతకుమార్‌ను బెదిరించి జీవజ్యోతితో తెగదెంపులు చేసుకోమన్నాడు. దీనికి జీవజ్యోతి ఒప్పుకోలేదు. శాంతకుమార్ కూడా. 2001లో హత్య జీవజ్యోతిని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న రాజగోపాల్ తన దగ్గర పని చేసే డేనియల్‌తో 5 లక్షలకు డీల్ మాట్లాడుకుని శాంతకుమార్‌ను చంపించే పథకం పన్నాడు. అయితే డేనియల్ శాంతకుమార్‌ను కనికరించి ఐదువేలు ఇచ్చి ముంబై పారిపోమని చెప్పాడు. రాజగోపాల్‌తో శాంతకుమార్‌ను హత్య చేశానని చెప్పేశాడు. అయితే శాంతకుమార్ జీవజ్యోతికి ఫోన్ చేసి జరిగింది చెప్పడంతో ‘నువ్వు వచ్చేసెయ్. రాజగోపాల్ కాళ్లమీద పడి వదిలేయ్‌మని అడుగుదాం’ అనేసరికి అతను వచ్చాడు. ఇద్దరూ రాజగోపాల్ దగ్గరకు వెళ్లారు. దీంతో కోపం పట్టలేకపోయిన రాజగోపాల్ అక్టోబర్ 28న వాళ్లను తన మనుషులతో తీసుకెళ్లాడు. అక్టోబర్ 31న శాంతకుమార్ శవం అడవిలో దొరికింది. జీవజ్యోతి ఈ దెబ్బతో పూర్తిగా దారికొస్తుందని భావించిన రాజగోపాల్ ఆమెను ఇంటికి వెళ్లనిచ్చాడు. అయితే ఆమె నేరుగా చెన్నై పోలీస్ కమిషనర్ దగ్గరకు వచ్చి ఫిర్యాదు చేయడంతో దోసె కింగ్ సామ్రాజ్యం ఉలిక్కిపడింది. సుదీర్ఘ పోరాటం రాజగోపాల్‌కు ఉన్న పలుకుబడి ముందు జీవజ్యోతి ఎటువంటి ప్రలోభాలకు, వొత్తిళ్లకూ లొంగలేదు. తనకు అన్యాయం జరిగిందని గట్టిగా నిలబడి న్యాయం కోసం పోరాడింది. అయితే రాజగోపాల్ కేవలం 9 నెలలు మాత్రం జైలులో ఉండి తర్వాత బెయిలుపై విడుదలయ్యాడు. అతను జైలులో ఉన్న కాలంలో మంచి భోజనం కోసం లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 2004లో సెషన్స్ కోర్టు రాజగోపాల్‌కు 10 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. దాని మీద రాజగోపాల్ హైకోర్టుకు అప్పీలు చేయగా 2010లో చెన్నై హైకోర్టు మరింత శిక్ష పెంచుతూ యావజ్జీవం చేసింది. దీనిపై సుప్రీం కోర్టులో పోరాడాడు రాజగోపాల్. ఇంత జరుగుతున్నా జీవజ్యోతి ప్రతి చోటా తన న్యాయపోరాటం కొనసాగించింది. 2019 మార్చిలో సుప్రీం కోర్టు హైకోర్టు శిక్షనే బలపరిచి జూలై 7, 2019న లొంగిపోవాలని రాజగోపాల్‌ను ఆదేశించగా అప్పటికే జబ్బుపడ్డ రాజగోపాల్ జూలై 9న అంబులెన్స్‌లో వచ్చి కోర్టులో లొంగిపోయాడు. కాని ఆ వెంటనే విజయ హాస్పిటల్ ప్రిజనర్స్ వార్డ్‌కు తరలించాల్సి వచ్చింది. గుండెపోటుతో అతడు జూలై 18న మరణించాడు. సినిమా పేరు ‘దోసె కింగ్’ జంగిల్ పిక్చర్స్ వారు జీవ జ్యోతి నుంచి బయోపిక్ రైట్స్ కొనుక్కుని ‘జై భీమ్’ దర్శకుడు టి.జి.జ్ఞానవేల్ దర్శకత్వంలో ఈ పోరాటమంతా హిందీలో సినిమాగా తీయనున్నారు. తారాగణం ఇంకా ఖరారు కావాల్సి ఉంది.‘నా పోరాటం సినిమాగా రానుండటం నాకు సంతోషంగా ఉంది’ అంది జీవ జ్యోతి. అయితే సుప్రీం కోర్టు తీర్పు తర్వాత ఒక రోజైనా జైలులో ఉండకుండా రాజగోపాల్ మరణించడం పట్ల ఆమెకు ఇంకా అసంతృప్తే ఉంది. -
హీరో శివకార్తికేయన్‌కు నిర్మాత షాక్.. అపరాధం విధించాలని పిటిషన్
Gnanavel Raja Petition Of Sivakarthikeyan For Mister Local Movie Loss: తమిళ హీరో శివకార్తికేయన్‌కు ప్రముఖ నిర్మాత, గ్రీన్ స్టూడియో అధినేత కెఇ. జ్ఞానవేల్ రాజా షాక్ ఇచ్చారు. 2019 మే 27న విడుదలైన 'మిస్టర్ లోకల్' సినిమా కోసం రూ. 15 కోట్లు పారితోషికం ఇస్తానని రూ. 11 కోట్లు మాత్రమే చెల్లించారని మద్రాస్ హైకోర్టులో శివకార్తికేయన్ పిటిషన్ వేసిన సంగతి తెలిసిందే. మిగిలిన రూ. 4 కోట్లు చెల్లించేలా నిర్మాతను ఆదేశించాలని శివకార్తికేయన్ కోరాడు. ఈ కేసుపై గురువారం (మార్చి 31) మద్రాస్ కోర్టు విచారణ చేపట్టింది. ఈ విచారణలో శివ కార్తికేయన్ వల్ల తాను రూ. 20 కోట్లు నష్టపోయినట్లు తెలుపుతూ పిటిషన్ దాఖళు చేశాడు నిర్మాత జ్ఞానవేల్ రాజా. చదవండి: నిర్మాతతో స్టార్ హీరో గొడవ.. హైకోర్టుకు ఫిర్యాదు తనకు మిస్టర్ లోకల్ కథ అసలు నచ్చలేదని, చెప్పిన వినకుండా తనతో బలవంతగా ఈ సినిమా చేసేలా ఒత్తిడి తీసుకొచ్చాడని జ్ఞానవేల్ రాజా తెలిపాడు. అందుకే ఈ సినిమాను నిర్మించినానని పటిషన్లో పేర్కొన్నాడు. సినిమా విడుదలై ఇన్ని రోజులు అవుతుండగా, ఇప్పుడే తనపై కేసు ఎందుకు పెట్టాడని ప్రశ్నించాడు. తాను నష్టపోయినందుకు శివకార్తికేయన్‌కు అపరాధం విధించి, తనపై ఉన్న కేసును కొట్టివేయాల్సిందిగా జ్ఞానవేల్ రాజా కోరాడు. ప్రస్తుతం ఈ టాపిక్ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. చదవండి: సినిమాకు ఎల్లలు లేవు – శివ కార్తికేయన్ -
నటుడి బంధువు ఆత్మహత్య.. ప్రముఖ నిర్మాతకు ఊరట
సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే 2017లో నటుడు శశికుమార్ బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. ఆ వ్యవహారంపై సినీ ఫైనాన్షియర్ బోద్రాను నిర్మాత జ్ఞానవేల్ రాజా విమర్శిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది. దీంతో ఫైనాన్షియర్ బోద్రా చెన్నై హైకోర్టులో జ్ఞానవేల్ రాజా తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పిటీషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ అనంతరం కేసుకు సంబంధించి న్యాయమూర్తి దండపాణి బుధవారం ఫైనాన్షియర్ బోధ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై వేసిన పిటీషన్లో తగిన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు. చదవండి: Deepika Padukone: అటు ద్రౌపదిగా, ఇటు సీతగా! -
కమల్ హాసన్‌పై నిర్మాత కంప్లయింట్
లోకనాయకుడు కమల్ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్ ఇచ్చారు. 2015లో రిలీజ్ అయిన ఉత్తమ విలన్ సినిమాకు సంబంధించిన విషయంలో కమల్, తనకు 10 కోట్ల రూపాయిలు బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు. ఉత్తమ విలన్ సినిమా రిలీజ్ సమయంలో కమల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావటంతో జ్ఞానవేల్ రాజా నుంచి 10 కోట్ల రూపాయిలు డబ్బు తీసుకున్నారు. దీనికి బదులుగా స్టూడియో గ్రీన్ బ్యానర్లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న కమల్ ఇంతవరకు జ్ఞానవేల్ రాజాకు కాల్షీట్స్ ఇవ్వకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు. నిర్మాత మండలి కలుగచేసుకొని కమల్ కాల్ షీట్స్ కానీ లేదా తన డబ్బు తనకు వెనక్కి గాని ఇప్పించాలని కోరారు. ఈ వివాదంపై నిర్మాత మండలి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది. -
అభిమానులకు పండగే
అభిమాన హీరో సినిమా రిలీజ్ అవ్వడమే అభిమానులకు పండగ. ఆ పండక్కే పండగ లాంటి సినిమా ఇవ్వాలనుకుంటారు దర్శక, నిర్మాతలు. సూర్య అభిమానులకు ఇలాంటి పండగనే అందించడానికి సిద్ధమయ్యాం అంటున్నారు స్టూడియోగ్రీన్ బ్యానర్ అధినేత జ్ఞానవేల్‌రాజా. సూర్య హీరోగా దర్శకుడు శివ ఓ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. ఈ సినిమాను స్టూడియోగ్రీన్ నిర్మిస్తోంది. సూర్య 39వ చిత్రంగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ‘‘ఈ కాంబినేషన్ మీద ఆకాశాన్ని అంటే అంచనాలున్నాయి. సూర్య అభిమానులకు ఈ సినిమా కచ్చితంగా పండగే’’ అని నిర్మాణ సంస్థ స్టూడియో గ్రీన్ పేర్కొంది. ప్రస్తుతం సుధా కొంగర దర్శకత్వంలో సూర్య ‘శూరరై పోట్రు’ చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమా పూర్తయిన తర్వాత శివ–సూర్యల సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది. -
క్రేజీ కాంబినేషన్ కుదిరింది
తమిళసినిమా: సంచలన నటుడు శింబు, యువ నటుడు గౌతమ్ కార్తీక్‌ల రేర్ కాంబినేషన్లో చిత్రం సెట్ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు శింబు త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నారు. దీన్ని వీ హౌస్ క్రియేషన్స్ పతాకంపై సురేశ్‌కామాక్ష్మి నిర్మిస్తున్నారు. దీని తరువాత మరో క్రేజీ చిత్రానికి శింబు పచ్చజెండా ఊపారు. దీన్ని స్టూడియోగ్రీన్ పతాకంపై నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించబోతున్నారు. ఇందులో శిం బుతో కలిసి యువ నటుడు గౌతమ్‌కార్తీక్ మరో హీరోగా నటించనున్నారు. దీన్ని నార్దన్ అనే దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఆయన ఇంతకు ముందు కన్నడంలో మఫ్టీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది శింబుకు 45వ చిత్రం అవుతుంది. అదే విధంగా స్టూడియోగ్రీన్ సంస్థ నిర్మిస్తున్న 20వ చిత్రం ఇది. నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా ఈ వివరాలను ట్విట్టర్లో పేర్కొన్నారు. సంచలన నటుడు శింబు హీరోగా చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందన్నారు. ఇది భారీ బడ్జెట్లో తెరకెక్కనున్న యాక్షన్, థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందని అని చెప్పారు. ఈ చిత్రానికి మదన్ కార్గీ పాటలు, మాటలను అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్ హీరోగా కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన దేవరాట్టం చిత్రం మే ఒకటవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. -
‘నోటా’ సెన్సార్‌పై విజయ్ కామెంట్!
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతున్న నోటా చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తాజాగా సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ తమిళ్ వర్షెన్కు ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. అయితే తెలుగు వర్షెన్కు సంబంధించిన సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇస్తారో అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘తమిళ్లో ‘ఏ’ సర్టిఫికేట్ అనుకుంటే ‘యూ’ వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇస్తుందో చూడాలి’ అంటూ ట్వీట్ చేశాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సమయంలో సెన్సార్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ‘నోటా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఇటీవలే గీతగోవిందంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విజయ్.. ‘నోటా’తో మళ్లీ సందడి చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు. We go U 😳 Even I voted A. Let's see what my favourite Telugu Censorboard will give me 🤔#MaranaWaiting https://t.co/TBDNMnfo2a — Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2018 -
హీరోలపై తమిళ నిర్మాత సంచలన వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్ : ప్రముఖ తమిళ నిర్మాత జ్ఞానవేల్ రాజ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమిళ సినిమాలో హీరోల దోపిడీ ఎక్కువగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళంలో ఒక సినిమా వందకోట్ల రూపాయలు వసూలు చేస్తే అందులో రూ. 50 కోట్లు హీరోలే తీసుకుంటున్నారని వాపోయారు. కానీ తెలుగు హీరోలు ఇందుకు పూర్తిగా విరుద్ధంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా చాలా తక్కువ రెమ్యునరేషన్ తీసుకుంటారని, రూ.15 కోట్లు ఇచ్చినా సినిమా చేస్తారని అన్నారు. కానీ తమిళ పరిశ్రమలో మాత్రం అంతుకు పూర్తి విరుద్ధంగా ఉందని, ఈ పద్దతి తమిళంలో ఎందుకు లేదంటూ ప్రశ్నించారు. అల్లు అర్జున్ హీరోగా తెరకెక్కుతున్న నాపేరు సూర్య చిత్రం తమిళ వెర్షన్ ప్రమోషన్లలో భాగంగా చెన్నైలో ప్రెస్‌మీట్ జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న జ్ఞానవేల్ రాజ తన ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగు, తమిళ హీరోల మద్య తేడాలను చెప్పే ప్రయత్నం చేశారు. తెలుగుహీరోల్లాగే తమిళ హీరోలు కూడా దారికి రాకపోతే తమిళ సినిమాలు మానేస్తానంటూ హెచ్చరించారు. తమిళ పరిశ్రమలో హీరోలకు, నిర్మాతలకు ఎప్పుడు కెమిస్ట్రీ కలవదని అన్నారు. తనకు హైదరాబాద్‌లో ఆఫీస్ ఉందని.. పూర్తిగా టాలీవుడ్ వెళ్లిపోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే చాలా నష్టపోయానని, ఇంకా తమిళ సినిమాలు చేసి చేతులు కాల్చుకోలేనని తేల్చి చెప్పారు. తెలుగు సినమాలు చాలా రిచ్‌గా ఉంటాయని అందుకే ఉత్తరాదిన వాటికి మంచి డిమాండ్ ఉందని జ్ఞానవేల్ రాజ వ్యాఖ్యానించారు. -
హీరోయిన్లపై నిర్మాత భార్య దారుణ వ్యాఖ్యలు
సాక్షి, చెన్నై: సుచీ లీక్స్ పేరుతో సింగర్ సుచిత్ర గతేడాది హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. కొంతమంది కోలీవుడ్ తారల గుండెల్లో ఆ లీకైన ఫొటోలు, వీడియోలు రైళ్లు పరుగెత్తించాయి. తాజాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. కొందరు హీరోయిన్లు వేశ్యల కంటే దారుణమని, వాళ్లు సంసారాలు కూల్చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గతేడాది సుచీ లీక్స్ తర్వాత నేహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. మౌనంగా ఎందుకుండాలి.. తుపానులా సమస్యలపై విజృంభించాలని నేను భావిస్తున్నాను. మహిళలకు మహిళలే ఎందుకు శత్రువులుగా మారుతున్నారు. తప్పుడు దారులు ఎంచుకుంటూ.. ఎన్నో కుటుంబాల్లో కుంపట్లు పెట్టడం వారికి తగునా అని ప్రశ్నిస్తూ ఇటీవల తాను చేసిన ట్వీట్లు డిలీట్ చేశారు నేహా. భార్యను నియంత్రించడం భర్త బాధ్యతని, అదే సమయంలో భర్త తప్పుచేస్తే భార్యలు కూడా అదే స్థాయిలో స్పందించాలన్నారు. బరితెగించిన ఆడవాళ్లను పబ్లిక్‌లో కొట్టినా తప్పులేదన్నారు. తాజాగా చేసిన ట్వీట్లో ఆమె ఏమన్నారంటే.. నాకు, నా భర్తతో ఎలాంటి సమస్య, విభేదాలు లేవు. చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలపై నేను స్పందిస్తున్నాను. వివాహం చేసుకున్న మగవాళ్ల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. దాంతో కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. ప్రచారం లాంటి వాటి కోసం నేను ఈ ట్వీట్లు చేయడం లేదు. ఓ మాధ్యమంగా ఎంచుకుని ట్వీట్లు చేసి విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చాను. కొందరు లీక్స్.. అంటున్నారు. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించేందుకు నేను ఈ పని చేయలేదు. కొందరు విషయం తెలియకుండా నా భర్తను అపార్థం చేసుకుని కామెంట్లు చేయడం బాధించింది. ఇది నా వ్యక్తిగత సమస్య కానే కాదంటూ పోస్ట్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా. నేహా కాస్ట్యూమ్ డిజైనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగం 3, గ్యాంగ్, తదితర సినిమాలకు జ్ఞానవేల్ నిర్మాతగా వ్యవహరించారు. Let ppl do their job with ease🙏 it’s ain’t any cheap leaks!! pic.twitter.com/MryNoaKMZ6 — neha nehu:) (@NehaGnanavel) 20 March 2018 -
వివాదంలో సూర్య సినిమా
కోలీవుడ్‌లో ఆ మధ్య విజయ్ మెర్సల్ చిత్రం ఎంత వివాదాస్పదం అయ్యిందో తెలిసిందే. జీఎస్టీ డైలాగులు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నాయని.. వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తూ బీజేపీ చిత్ర విడుదలకు అడ్డుతగిలింది. కానీ, అది నెరవేరలేదు. ఇక ఇప్పుడు సూర్య కొత్త చిత్రం వంతు వచ్చేసింది. విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో సూర్య నటించిన తానా సెరెందా కూటమ్(తెలుగులో గ్యాంగ్) చిత్రంలో సొడక్కు... సాంగ్ పిచ్చ పిచ్చగా పాపులర్ అయ్యింది. లిరిక్స్‌కి తగ్గట్లే అనిరుధ్ రవిచందర్ అందించిన స్వరం కుదరటంతో మాస్ పాటగా పెద్ద హిట్టయ్యింది. అయితే ఈ పాటలో సాహిత్యం పట్ల అన్నాడీఎంకే నేత ఒకరు పోలీస్ ఫిర్యాదు చేశారు. అధిగార తిమిర, పనకర పవరా, వెరట్టి వెరట్టి వెలుక తొంతు అనే పదాలు అధికార పార్టీని కించపరిచేలా ఉన్నాయంటూ సతీష్ కుమార్ అనే చెన్నై కమిషనరేట్‌లో ఫిర్యాదు చేశారు. తక్షణమే ఆ పాటను బ్యాన్ చేయాలని ఆయన డిమాండ్ చేస్తున్నారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు చిత్ర నిర్మాతలకు నోటీసులు పంపినట్లు తెలుస్తోంది. అయితే ఈ ఆరోపణలను నిర్మాత జ్ఞానవేల్ రాజా ఖండించారు. అవినీతికి పాల్పడేవారికే అవి వర్తిస్తాయి. ఆయన అంతగా స్పందించారంటే బహుశా ఆయనకు ఆ పాట బాగా తగిలిందేమో. అసలు ఆయన పార్టీలో ఏ పదవిలో ఉన్నారో? నాకైతే తెలీదు. ఇప్పటిదాకా అయితే మాకు ఎలాంటి నోటీసులు అందలేదు. మీడియాలో ద్వారానే ఈ వార్తను తెలుసుకున్నాం. మెర్సల్ సినిమాకు వచ్చినట్లే ఈ వివాదంతో మాకు మంచి పాపులారిటీ రావాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీ కంటే అన్నాడీఎంకే ప్రభావం తమిళనాడులో ఎక్కువ కదా అంటూ జ్ఞానవేల్ నవ్వుకున్నారు. -
అరుళ్‌పతికే పట్టం
తమిళ సినిమా: డిస్ట్రిబ్యూటర్లు మళ్లీ అరుళ్‌పతికే పట్టం కట్టారు. తమిళనిర్మాతల మండలి ఎన్నికలు, ఆర్కే.నగర్ ఉప ఎన్నికల తరువాత అంత సంచలనాన్ని కలిగించిన ఎన్నికలు డిస్ట్రిబ్యూటర్ల సంఘానివే. ఆదివారం స్థానిక చింతాద్రిపేటలోని మీరాసాహెబ్ వీధిలోని ఆ సంఘం కార్యలయంలో జరిగిన ఓటింగ్ ఉత్కంఠభరితంగా సాగింది. ప్రస్తుతం అధ్యక్ష పదవిలో ఉన్న టీఏ.అరుళ్‌పతి జట్టు మళ్లీ పోటీ చేయగా వారికి వ్యతిరేకంగా నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా జట్టు, నిర్మాత దేవరాజ్‌లు అధ్యక్షపదవికి పోటీ చేశారు. కాగా ఈ ఎన్నికల్లో ఉపకార్యదర్శి పదవి మినహా అన్ని పదవులను అరుళ్‌పతి జట్టే కైవసం చేసుకుంది. ఫలితాలివే.. మొత్తం సంఘంలో 527 సభ్యులుండగా 469 ఓట్లు పోలయ్యాయి. కాగా అధ్యక్షపదవికి పోటీ చేసిన అరుళ్‌పతి 248 ఓట్లతో గెలుపొందారు. ఆయనకు వ్యతిరేకంగా పోటీ చేసిన కేఈ.జ్ఞానవేల్‌రాజాకు 194 ఓట్లు, దేవరాజ్ 17 ఓట్లతో ఓటమి పాలయ్యారు. కాగా జ్ఞానవేల్‌రాజా జట్టులో ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీరామ్ 202 ఓట్లతో గెలుపుపొందారు. ఆయనపై పోటీ చేసిన రాజ్‌గోపాలన్ 173, ఎన్.చంద్రన్56 ఓట్లకే పరిమితం అయ్యారు. కార్యదర్శి పదవికి పోటీ చేసిన మెట్రో జయ 169 ఓట్లతో గెలుపోందారు. ఆయనతో పోటీ పడిన నేశమణి 142 ఓట్లు, కలైపులి జీ.శేఖర్ 140 ఓట్లతో పరాజయం పాలయ్యారు. ఉపాధ్యక్ష పదవికి పోటీ చేసిన శ్రీనివాసన్ 216 ఓట్లతో ఆయనతో పోటీ పడ్డ కే.రాజన్ 199 ఓట్లు, ఆర్.సంపత్ 30 ఓట్లతో ఓటమిని చవిచూశారు. కోశాధికారి పదవికి పోటీ చేసిన బాబురావ్ 201ఓట్లతో గెలుపోందగా, ఆయన్ను ఢీకొన్న సిద్ధిక్ 142 ఓట్లతో, జీ.మోహన్రావ్ 54 ఓట్లతోనే సరిపట్టుకుని ఓటమిపాలయ్యారు. మరోసారి సంఘం అధ్యక్ష పదవిని చేపట్టిన అరుళ్మణిని నిర్మాత కలైపులి ఎస్.థాను, ఎస్వీ.శేఖర్ తదితర సినీ ప్రముఖులు అభినందనలు తెలిపారు. -
నెక్ట్స్ మూడు సినిమాలు ఒకే బ్యానర్లో..!
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో ఆది సాయికుమార్, విజయాలు సాదించటంలో మాత్రం తడబడుతున్నాడు. కెరీర్ స్టార్టింగ్ లో ప్రేమ కావాలి, లవ్లీ లాంటి సినిమాలతో విజయాలు అందుకున్నా తరువాత ఆ ట్రాక్ రికార్డ్ ను కంటిన్యూ చేయలేకపోయాడు. వరుస పరాజయాలతో కష్టాల్లో పడ్డాడు. శమంతకమణితో మల్టీ స్టారర్ సినిమా చేసినా అది కూడా ఆది కెరీర్‌కు పెద్దగా ప్లస్ అవ్వలేదు. అయితే ఈ శుక్రవారం రిలీజ్ అవుతున్న నెక్ట్స్‌నువ్వే మీదే ఆశలు పెట్టుకున్నాడు ఈ యంగ్ హీరో. ప్రభాకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా రిజల్ట్ విషయంలో చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు ఆది. అంతేకాదు నెక్ట్స్‌నువ్వే సినిమా నిర్మాతల్లో ఒకరైన తమిళ ప్రొడ్యూసర్ జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలో వరుస సినిమాలకు ఓకె చెప్పాడు. ఆది తన తదుపరి మూడు చిత్రాలను జ్ఞానవేల్‌రాజా నిర్మాణంలోనే చేయనున్నాడట. వీటిలో రెండు ద్విభాషా చిత్రాలు కాగా మరోటి తెలుగు సినిమా. రిలీజ్ కు రెడీగా ఉన్న నెక్ట్స్ నువ్వే చిత్రాన్ని వి4 క్రియేషన్స్ బ్యానర్ పై అల్లు అరవింద్, జ్ఞానవేల్‌రాజా, యువి క్రియేషన్స్ లు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కబాలి దర్శకుడితో సూర్య
కబాలి చిత్ర దర్శకుడి దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు సూర్య. ఆ మధ్య కథలను ఎంచుకోవడంలో కాస్త తడబడ్డ సూర్య అపజయాలతో పెద్ద మూల్యాన్నే చెల్లించాల్సి వచ్చింది. అంజాన్, మాస్ లాంటి చిత్రాలు ఆయన్ని నిరాశపరిచిన మాట వాస్తవం. అయితే అపజయాలు పెద్ద పాఠం అంటారు. అంతే కాదు విజయానికి నాంది అని కూడా అంటారు. సూర్య విషయంలో ఈ రెండూ జరిగాయి. ఫలితం 24 వంటి ఘన విజయాన్ని అందుకున్నారు. ప్రస్తుతం ఆ చిత్ర విజయాన్ని ఎంజాయ్ చేస్తూ విదేశాల్లో విహరిస్తున్న సూర్య తాజా చిత్రానికి దర్శకుడిని ఎంచుకున్నారు. అట్టకత్తి, మెడ్రాస్ చిత్రాల దర్శకుడు రంజిత్ దర్శకత్వంలో నటించడానికి రెడీ అవుతున్నారు. ప్రస్తుతం ఈ దర్శకుడు సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో కబాలి చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. కబాలి చిత్రం నిర్మాణ కార్యక్రమాలు చివరి దశకు చేరుకున్నాయి. ఈ చిత్ర ఆడియో జూన్ తొలి వారంలోనూ, చిత్రం జూలై ఒకటవ తేదీన విడుదలకు సన్నాహాలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. తదుపరి రంజిత్ సూర్య హీరోగా చిత్రం చేయనున్నట్లు తెలిసింది. ఈ భారీ చిత్రాన్ని స్టూడియో గ్రీన్ జ్ఞానవేల్‌రాజా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారని సమాచారం. విదేశాల నుంచి తిరిగి రాగానే ప్రస్తుతం నటిస్తున్న సింగం-3 చిత్రాన్ని పూర్తి చేయనున్నారు. ఆ తరువాత రంజిత్ దర్శకత్వంలో నటించనున్నట్లు తెలిసింది. టాలీవుడ్ సక్సెస్‌పుల్ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలోనూ సూర్య ఒక ద్విభాషా చిత్రంలో నటించడానికి పచ్చజెండా ఊపినట్లు ప్రచారం జరుగుతుండడం గమనార్హం. అయితే ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన వెలువడలేదు.అయితే తెలుగులో ఒక డెరైక్ట్ చిత్రం చేయాలన్న కోరిక సూర్యకు చాలా కాలంగా ఉంది. అదిప్పుడు నెరవేరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.