
రజనీకాంత్ హీరోగా ‘జై భీమ్’ ఫేమ్ టీజే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘వేట్టయాన్’ (వేటగాడు). అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా ఇతర లీడ్ రోల్స్‌లో దుషారా విజయన్, మంజు వారియర్, రితికా సింగ్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ఇది. ఈ సినిమా చిత్రీకరణ వేగంగా జరుగుతుంది. అయితే, ఈ సినిమాలో ఒక పాట కోసం భారీగా ఖర్చు చేసి నట్లు తెలుస్తోంది.
జైలర్ సినిమా తర్వాత వేట్టైయాన్ వస్తుండటంతో ఫ్యాన్స్‌లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ సంస్థ ఎక్కువ బడ్జెట్‌తో నిర్మిస్తుంది. ఈ చిత్రంలో రజనీకాంత్ మాజీ పోలీస్ ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్‌గా కనిపించనున్నారు. ఈ చిత్రం తిరువనంతపురం, కన్యాకుమారి, ముంబయి, కేరళ ప్రాంతాల్లో చిత్రీకరణను జరుపుకుంటోంది. అనిరుధ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం కోసం ఇటీవల రజనీకాంత్‌తో పాటు 500 మంది నృత్య కళాకారులతో ఒక పాటను చిత్రీకరించినట్లు తెలిసింది.

ఈ ఒక్క సాంగ్ కోసం సుమారు రూ. 5 కోట్లు ఖర్చు చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో ఏ సినిమాలోనూ ఇంతమంది డాన్సర్స్‌తో పాటను చిత్రీకరించిన దాఖలాలు లేవు. దీంతో వేట్టైయాన్ చిత్రంపై ఆసక్తితో పాటు అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రాన్ని దీపావళి సందర్భంగా అక్టోబర్ నెలలో విడుదల చేయనున్నట్లు ప్రచారం జరిగినా, ప్రస్తుతం దానికి సంబంధించిన ప్రకటన ఇంకా వెలువడలేదు.
Comments
Please login to add a commentAdd a comment