
టాలీవుడ్ సెన్సేషన్ స్టార్ విజయ్ దేవరకొండ రాజకీయ నేపథ్య కథతో తెరకెక్కుతున్న నోటా చిత్రంతో ప్రేక్షకులముందుకు రానున్నాడు. తమిళ, తెలుగు భాషల్లో రిలీజ్‌కానున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ తాజాగా సెన్సార్‌కార్యక్రమాలను పూర్తి చేసుకుంది.
అక్టోబర్ 5న విడుదల కానున్న ఈ మూవీ తమిళ్ వర్షెన్‌కు ‘యూ’ సర్టిఫికేట్ లభించింది. అయితే తెలుగు వర్షెన్‌కు సంబంధించిన సెన్సార్ సభ్యులు ఏ సర్టిఫికేట్ ఇస్తారో అంటూ సెటైరికల్ కామెంట్ చేశాడు విజయ్ దేవరకొండ. ‘తమిళ్‌లో ‘ఏ’ సర్టిఫికేట్ అనుకుంటే ‘యూ’ వచ్చింది.. మరి నాకు ఇష్టమైన తెలుగు సెన్సార్ బోర్డ్ ఏ సర్టిఫికేట్ ఇస్తుందో చూడాలి’ అంటూ ట్వీట్ చేశాడు. గతంలో ‘అర్జున్ రెడ్డి’ సమయంలో సెన్సార్ విషయంలో వివాదం నెలకొన్న విషయం తెలిసిందే. ‘నోటా’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఏర్పాటు చేశారు మేకర్స్. ఇటీవలే గీతగోవిందంతో బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టిన విజయ్.. ‘నోటా’తో మళ్లీ సందడి చేయనున్నాడు. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా ఈ చిత్రాన్ని నిర్మించారు.
We go U 😳
— Vijay Deverakonda (@TheDeverakonda) September 28, 2018
Even I voted A.
Let's see what my favourite Telugu Censorboard will give me 🤔#MaranaWaiting https://t.co/TBDNMnfo2a