కొందరు అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే ‘నోటా’కు అధికం
ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో 7,719 నోటా ఓట్లు లోక్‌సభకు 9,193
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులు ఇష్టం లేకుంటే నోటాపై నొక్కి ఓటర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేయవచ్చు. ఈ ఎన్నికల్లో పలువురు ఓటర్లు నన్ ఆఫ్ ది అ»ౌ(నోటా)కు ఓటు వేశారు. ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులను కాకుండా కొంతమంది తెలిసో, తెలియకో ఈవీఎంలపై నోటా బటన్ నొక్కారు. దీంతో విజయవాడ పార్లమెంటరీ పరిధిలో భారీగానే నోటా ఓట్లు పోలయ్యాయి. పోటీలో ఉన్న వైఎస్సార్ సీపీ, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎం, కాంగ్రెస్ పారీ్టల మినహా ఇతర రాజకీయ పారీ్టలు, స్వతంత్ర అభ్యర్థులకు పోలైన ఓట్ల కంటే నోటాకు పడిన ఓట్లే అధికం కావడం విశేషం.
దేశంలో 2013 నుంచి..
కేంద్ర ఎన్నికల సంఘం 2013 నుంచి నోటాను ప్రవేశపెట్టింది. అభ్యర్థులు నచ్చక చాలా మంది ఓటు వేయడానికి ముందుకు రావడం లేదు. దీంతో పోలింగ్ శాతం తగ్గుతోంది. ప్రజాస్వామ్యంలో కీలకమైన ఎన్నికల్లో ప్రతి ఓటరూ భాగస్వామి కావాలనే లక్ష్యం నెరవేరడం లేదు. ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం నోటాను అమలులోకి తెచ్చింది. అభ్యర్థులు ఇష్టం లేకున్నా ఓటర్లు పోలింగ్ బూత్‌కు వచ్చి నోటాకు ఓటు వేయడం ద్వారా పోలింగ్ శాతం పెరుగుతోంది.
జిల్లాలో నోటాకు పడిన ఓట్లు ఇలా
👉ఎన్టీఆర్ జిల్లాలో నోటాకు ఈసారి ఎన్నికల్లో గణనీయంగా ఓట్లు పడ్డాయి. ఈవీఎంలు, సర్వీసు ఓట్లు, పోస్టల్ బ్యాలెట్‌లను పరిగణనలోకి తీసుకుంటే విజయవాడ పార్లమెంటరీ నియోజకవర్గ పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాల్లో 7,719 ఓట్లు నోటాకు పడ్డాయి. వీటికంటే పార్లమెంటరీ స్థానానికి నోటా ఓట్లు అధికంగా పోలవడం విశేషం. పార్లమెంటరీ స్థానానికి 9,193 మంది నోటాకు ఓటు వేశారు.
👉విజయవాడ లోక్‌సభ నియోజకవర్గ పరిధిలో 17 మంది పోటీ చేశారు. వీరిలో నోటా కన్నా తక్కువ ఓట్లు వచ్చిన వారు 14 తొమ్మిది మంది ఉండటం గమనార్హం. టీడీపీ, వైఎస్సార్ సీపీ, కాంగ్రెస్ పార్టీలు మినహా మిగిలిన వారందరికీ నోటా కంటే తక్కువగానే ఓట్లు నమోదయ్యాయి.
👉 విజయవాడ ‘పశి్చమ’ నుంచి 15 మంది పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్ సీపీ, బీజేపీ, సీపీఐ అభ్యర్థులు మినహా మిగిలిన 12 మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,236 కంటే తక్కువే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో సమాజ్‌వాదీ పార్టీ అభ్యరి్థకి కేవలం 39 ఓట్లు మాత్రమే వచ్చాయి.
👉 విజయవాడ ‘సెంట్రల్’ నుంచి 20 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, సీపీఎం, ఆంధ్రరాష్ట్ర ప్రజాశాంతి, బహుజన సమాజ్ పార్టీ మినహా మిగిలిన వారికి నోటా ఓట్లు 951 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. 15 మంది అభ్యర్థులకు నోటా కంటే తక్కువగానే నమోదయ్యాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి అత్యంత తక్కువగా 37 ఓట్లు పోలయ్యాయి.
👉 విజయవాడ ‘తూర్పు’ నుంచి 15 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వీరిలో వైఎస్సార్, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్, ఆల్ ఇండియా జైహింద్ పార్టీ మినహా మిగిలిన 10 మంది అభ్యర్థుల కంటే నోటాకే అధికంగా ఓట్లు పోలయ్యాయి. ఇక్కడ నోటాకు 1,049 మంది ఓటు వేశారు.
👉 నందిగామ నియోజకవర్గం నుంచి తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరిలో వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్, బహుజన సమాజ్ పార్టీ∙అభ్యర్థులు మినహా మిగిలిన ఐదుగురు అభ్యర్థులకు నోటా ఓట్లు 928 కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యరి్థకి బహుజన సమాజ్‌వాదీ పార్టీ కంటే తక్కువ ఓట్లు పోలవ్వడం విశేషం.
👉జగ్గయ్యపేట నియోజకవర్గంలో 13 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పారీ్టల మినహా మిగిలిన పది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 773 కంటే అతి తక్కువ ఓట్లు పడ్డాయి. ఈ నియోజకవర్గంలో ఒక స్వతంత్ర అభ్యరి్థకి 11 ఓట్లు మాత్రమే నమోదయ్యాయి.
👉మైలవరం నుంచి 12 మంది బరిలో నిలిచారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ, ఒక స్వతంత్ర అభ్యర్థి మినహా మిగిలిన ఎనిమిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,598 కంటే తక్కువగా పడటం గమనార్హం.
👉 తిరువూరు నియోజకవర్గంలో 12 మంది అభ్యర్థులు పోటీ చేశారు. వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ పార్టీ మినహా మిగిలిన తొమ్మిది మంది అభ్యర్థులకు నోటా ఓట్లు 1,184 కంటే తక్కువగా వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment