
లోకనాయకుడు కమల్ హాసన్‌పై ప్రముఖ నిర్మాత, స్టూడియో గ్రీన్ సంస్థ అధినేత కేయి జ్ఞానవేల్ రాజా నిర్మాతల మండలి కంప్లయింట్ ఇచ్చారు. 2015లో రిలీజ్ అయిన ఉత్తమ విలన్ సినిమాకు సంబంధించిన విషయంలో కమల్, తనకు 10 కోట్ల రూపాయిలు బకాయి పడ్డట్టుగా జ్ఞానవేల్ రాజా పేర్కొన్నారు.
ఉత్తమ విలన్ సినిమా రిలీజ్ సమయంలో కమల్‌కు ఆర్థిక ఇబ్బందులు ఎదురు కావటంతో జ్ఞానవేల్ రాజా నుంచి 10 కోట్ల రూపాయిలు డబ్బు తీసుకున్నారు. దీనికి బదులుగా స్టూడియో గ్రీన్ బ్యానర్‌లో ఓ సినిమా చేసేందుకు ఒప్పందం చేసుకున్నారు. అయితే నాలుగేళ్లు గడుస్తున్న కమల్ ఇంతవరకు జ్ఞానవేల్ రాజాకు కాల్‌షీట్స్ ఇవ్వకపోవటంతో ఆయన నిర్మాతల మండలిని ఆశ్రయించారు.
నిర్మాత మండలి కలుగచేసుకొని కమల్ కాల్ షీట్స్ కానీ లేదా తన డబ్బు తనకు వెనక్కి గాని ఇప్పించాలని కోరారు. ఈ వివాదంపై నిర్మాత మండలి పెద్దలు ఎలా స్పందిస్తారో చూడాలి. ప్రస్తుతం కమల్ హాసన్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఇండియన్ 2 షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాను లైకా ప్రొడక్షన్స్ సంస్థ నిర్మిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment