హీరోయిన్లపై నిర్మాత భార్య దారుణ వ్యాఖ్యలు | Gnanavel Raja Wife Neha Comments On Some heroines | Sakshi

హీరోయిన్లపై నిర్మాత భార్య దారుణ వ్యాఖ్యలు

Mar 21 2018 8:50 PM | Updated on Apr 3 2019 8:58 PM

Gnanavel Raja Wife Neha Comments On Some heroines - Sakshi

నిర్మాత జ్ఞానవేల్ రాజా, భార్య నేహా (ఫైల్ ఫొటో)

సాక్షి, చెన్నై: సుచీ లీక్స్‌ పేరుతో సింగర్ సుచిత్ర గతేడాది హీరో, హీరోయిన్ల శృంగార చిత్రాలు, ఆంతరంగిక విషయాలు బయటపెట్టడం అప్పట్లో కలకలం రేపింది. కొంతమంది కోలీవుడ్‌ తారల గుండెల్లో ఆ లీకైన ఫొటోలు, వీడియోలు రైళ్లు పరుగెత్తించాయి. తాజాగా నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా హీరోయిన్లపై సంచలన వ్యాఖ్యలు చేసి వార్తల్లోకెక్కారు. కొందరు హీరోయిన్లు వేశ్యల కంటే దారుణమని, వాళ్లు సంసారాలు కూల్చేస్తారంటూ సోషల్ మీడియా వేదికగా తీవ్ర ఆరోపణలు చేశారు. గతేడాది సుచీ లీక్స్ తర్వాత నేహా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి. 

మౌనంగా ఎందుకుండాలి.. తుపానులా సమస్యలపై విజృంభించాలని నేను భావిస్తున్నాను. మహిళలకు మహిళలే ఎందుకు శత్రువులుగా మారుతున్నారు. తప్పుడు దారులు ఎంచుకుంటూ.. ఎన్నో కుటుంబాల్లో కుంపట్లు పెట్టడం వారికి తగునా అని ప్రశ్నిస్తూ ఇటీవల తాను చేసిన ట్వీట్లు డిలీట్ చేశారు నేహా. భార్యను నియంత్రించడం భర్త బాధ్యతని, అదే సమయంలో భర్త తప్పుచేస్తే భార్యలు కూడా అదే స్థాయిలో స్పందించాలన్నారు. బరితెగించిన ఆడవాళ్లను పబ్లిక్‌లో కొట్టినా తప్పులేదన్నారు. 

తాజాగా చేసిన ట్వీట్లో ఆమె ఏమన్నారంటే.. నాకు, నా భర్తతో ఎలాంటి సమస్య, విభేదాలు లేవు. చుట్టూ జరుగుతున్న కొన్ని సంఘటనలపై నేను స్పందిస్తున్నాను. వివాహం చేసుకున్న మగవాళ్ల జీవితాల్లోకి కొందరు మహిళలు ప్రవేశిస్తున్నారు. దాంతో కుటుంబాలు సర్వనాశనం అవుతాయి. ప్రచారం లాంటి వాటి కోసం నేను ఈ ట్వీట్లు చేయడం లేదు. ఓ మాధ్యమంగా ఎంచుకుని ట్వీట్లు చేసి విషయాన్ని అందరి దృష్టికి తీసుకొచ్చాను. కొందరు లీక్స్.. అంటున్నారు. కానీ ఎవరి దృష్టినో ఆకర్షించేందుకు నేను ఈ పని చేయలేదు.  కొందరు విషయం తెలియకుండా నా భర్తను అపార్థం చేసుకుని కామెంట్లు చేయడం బాధించింది. ఇది నా వ్యక్తిగత సమస్య కానే కాదంటూ పోస్ట్ చేశారు నిర్మాత జ్ఞానవేల్ రాజా భార్య నేహా. నేహా కాస్ట్యూమ్‌ డిజైనర్‌గా పనిచేస్తున్న విషయం తెలిసిందే. సింగం 3, గ్యాంగ్‌, తదితర సినిమాలకు జ్ఞానవేల్ నిర్మాతగా వ్యవహరించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement