దిల్‌ రాజు చేతికి ఆ యాక్షన్‌ సినిమా.. రిలీజ్ ఎప్పుడంటే? | Producer Dil Raju Takes Distribution Rights Of Tollywood Movie | Sakshi
Sakshi News home page

Dheera Movie: 'ధీర' హక్కులు దిల్‌ రాజు సొంతం.. రిలీజ్ ఆరోజే?

Published Mon, Jan 29 2024 7:52 PM | Last Updated on Mon, Jan 29 2024 8:02 PM

Producer Dil Raju Takes Distribution Rights Of Tollywood Movie - Sakshi

లక్ష్ చదలవాడ, నేహా పఠాన్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'ధీర'. వలయం, గ్యాంగ్‌స్టర్ గంగరాజు వంటి హిట్ సినిమాల తరువాత లక్ష్ మరోసారి మాస్ ప్రేక్షకుల్ని మెప్పించేందుకు సిద్దమయ్యారు. ఈ మూవీని చదలవాడ బ్రదర్స్ సమర్పణలో శ్రీ తిరుమల తిరుపతి వెంకటేశ్వర బ్యానర్‌ మీద పద్మావతి చదలవాడ నిర్మించారు.  విక్రాంత్ శ్రీనివాస్ దర్శకత్వం వహించిన ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే రిలీజైన గ్లింప్స్, టీజర్‌కు విశేషమైన స్పందన వచ్చింది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఫిబ్రవరి 2న గ్రాండ్‌గా విడుదల కానుంది. 

అయితే ఈ మూవీ హక్కులను ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్‌ రాజు దక్కించుకున్నారు. నైజాం, వైజాగ్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను ఆయన సొంతం చేసుకున్నారు. దీంతో ఈ చిత్రంపై అభిమానుల్లో మరింత ఆసక్తి పెరిగింది. ఈ చిత్రంలో సోనియా బన్సాల్, మిర్చి కిరణ్, హిమజ, నవీన్ నేని, భరణి శంకర్, సామ్రాట్, బాబీ బేడి, వైవా రాఘవ్, భూషణ్, మేక రామకృష్ణ, సంధ్యారాణి కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమాకు సాయి కార్తీక్ సంగీతమందించారు. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement