క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది | Simbu And Gautham Karthik Movie Will Start Soon | Sakshi
Sakshi News home page

క్రేజీ కాంబినేషన్‌ కుదిరింది

Published Mon, Apr 22 2019 10:20 AM | Last Updated on Mon, Apr 22 2019 10:20 AM

Simbu And Gautham Karthik Movie Will Start Soon - Sakshi

తమిళసినిమా: సంచలన నటుడు శింబు, యువ నటుడు గౌతమ్‌ కార్తీక్‌ల రేర్‌ కాంబినేషన్‌లో చిత్రం సెట్‌ అయ్యిందన్నది తాజా సమాచారం. నటుడు శింబు త్వరలో వెంకట్‌ప్రభు దర్శకత్వంలో మానాడు చిత్రంలో నటించనున్నారు. దీన్ని వీ హౌస్‌ క్రియేషన్స్‌ పతాకంపై సురేశ్‌కామాక్ష్మి నిర్మిస్తున్నారు. దీని తరువాత మరో క్రేజీ చిత్రానికి శింబు పచ్చజెండా ఊపారు. దీన్ని స్టూడియోగ్రీన్‌ పతాకంపై నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించబోతున్నారు. ఇందులో శిం బుతో కలిసి యువ నటుడు గౌతమ్‌కార్తీక్‌ మరో హీరోగా నటించనున్నారు.

దీన్ని నార్దన్‌ అనే దర్శకుడు తెరకెక్కించనున్నారు. ఆయన ఇంతకు ముందు కన్నడంలో మఫ్టీ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇది శింబుకు 45వ చిత్రం అవుతుంది. అదే విధంగా స్టూడియోగ్రీన్‌ సంస్థ నిర్మిస్తున్న 20వ చిత్రం ఇది. నిర్మాత కేఈ.జ్ఞానవేల్‌రాజా ఈ వివరాలను ట్విట్టర్‌లో పేర్కొన్నారు. సంచలన నటుడు శింబు హీరోగా చిత్రం చేయనుండడం సంతోషంగా ఉందన్నారు. ఇది భారీ బడ్జెట్‌లో తెరకెక్కనున్న యాక్షన్, థ్రిల్లర్‌ కథా చిత్రంగా ఉంటుందని అని చెప్పారు. ఈ చిత్రానికి  మదన్‌ కార్గీ పాటలు, మాటలను అందిస్తున్నారు. ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతం గౌతమ్‌కార్తీక్‌ హీరోగా  కేఈ.జ్ఞానవేల్‌రాజా నిర్మించిన దేవరాట్టం చిత్రం మే ఒకటవ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement