
కొన్నిసార్లు ఒక్క సినిమాతో హీరోయిన్లు ఓవర్ నైట్ స్టార్స్ అయిపోతుంటారు. అలా కొన్నిరోజుల క్రితం రిలీజైన 'డ్రాగన్'తో కాయదు లోహర్ స్టార్ అయిపోయిందని చెప్పొచ్చు. ఇప్పటికే తెలుగులో ఓ ఆఫర్ దక్కించుకున్న ఈమె ఇప్పుడు మరో బంపర్ ఆఫర్ కొట్టేసింది.
(ఇదీ చదవండి: మొన్నే పహల్గామ్ దాడి.. ధైర్యంగా అక్కడికెళ్లిన నటుడు)
అసోంకు చెందిన కాయదు లోహర్.. 'అల్లూరి' అనే తెలుగు సినిమాతో హీరోయిన్ అయింది. కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. దీంతో తమిళంలో ప్రయత్నించగా.. ప్రదీప్ రంగనాథన్ 'డ్రాగన్'లో అవకాశమొచ్చింది. ఇదే మూవీతో కాయదుకు మంచి క్రేజ్ కూడా వచ్చింది.
ఈ క్రమంలోనే తెలుగులో విశ్వక్ సేన్-అనుదీప్ కాంబోలో తీస్తున్న 'ఫంకీ'లో కాయదు హీరోయిన్ గా సెలెక్ట్ కాగా.. ఇప్పుడు తమిళ హీరో శింబు సరసన నటించే అవకాశం కూడా దక్కింది. ఈ మేరకు అధికారికంగా పోస్టర్ రిలీజ్ చేశారు. ఈ మూవీస్ కూడా హిట్ అయితే ఇండస్ట్రీలో కాయదు లైఫ్ సెట్ అయిపోయినట్లే!
(ఇదీ చదవండి: 'బాహుబలి' టైంకి నాకు 27 ఏళ్లే.. కానీ అలా చూపించేసరికి)
