
హీరోయిన్ కయాదు లోహార్ ఇటీవలే డ్రాగన్ మూవీతో ప్రేక్షకులను అలరించారు. 21 ఏళ్ల వయసులోనే కన్నడ సినిమా ముగిల్‌పేటతో ఇండస్ట్రీలో అడుగుపెట్టారు. ఆ తరువాత మలయాళంలో పథోన్‌పత్తం నూత్తాండు అనే చిత్రంలో అక్కడ కూడా ఎంట్రీ ఇచ్చారు. తెలుగులో 2022లోనే శ్రీ విష్ణు హీరోగా నటించిన అల్లూరి చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అంతే కాకుండా మరాఠీ భాషలోనూ ప్రేమ్ యు అనే చిత్రంలో కనిపించింది. దక్షిణాది అన్ని భాషల్లో అడుగుపెట్టిన డ్రాగన్ మూవీతో సూపర్ హిట్‌ను తన ఖాతాలో వేసుకుందిం. ఈ సందర్భంగా ఈ సినిమాను గురించి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేసింది.
డ్రాగన్ సినిమా తన జీవితాన్నే మార్చేసిందని చెబుతోంది ఈ అస్సాం బ్యూటీ. ఈ సందర్భంగా డైరెక్టర్, హీరోతో పని చేసిన అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ప్రదీప్ రంగనాథన్ లాంటి కో స్టార్‌తో పని చేయడం చాలా సంతోషంగా ఉందని తెలిపింది. ఈ మూవీతో నాకు నిజమైన స్నేహితుడు దొరికాడని సంతోషం వ్యక్తం చేసింది. అయితే మొదట ఈ సినిమాలో ఛాన్స్ రాదేమోనని బాధపడ్డానని కయాదు లోహర్ వెల్లడించింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఇన్‌స్టాలో సుదీర్ఘ పోస్ట్ చేసింది.
కయాదు లోహర్ ఇన్‌స్టాలో రాస్తూ..'మొదట జూమ్ కాల్‌లో డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు కీర్తి క్యారెక్టర్‌కు సంబంధించిన కథ చెప్పారు. అది విని చాలా ఉత్సాహంగా ఉన్నా. కానీ ఆ తర్వాత అతని నుంచి నాకు రిప్లై రాలేదు. దీంతో నేను ఆ ప్రాజెక్ట్‌ను కోల్పోయానేమో అని కొంచెం బాధపడ్డా. కానీ ఒక నెల తరువాత అశ్వత్ మళ్లీ నాతో టచ్‌లోకి వచ్చారు. రెండోసారి పల్లవి పాత్ర కోసం నాకు నేరేషన్ ఇచ్చారు. నేరేట్ చేయడం పూర్తి చేసిన తర్వాత మీటింగ్ ముగించి ఆయన వెళ్లిపోవడంతో కాస్త కంగారు పడ్డా. కానీ 5 నిమిషాల్లోనే తిరిగి వచ్చి పల్లవిగా నిన్ను ఎంపిక చేసినట్లు ఆయన చెప్పిన మాటలు నాకు ఇప్పటికీ గుర్తున్నాయని' తెలిపింది.
ఆ తర్వాత తాను పల్లవి పాత్రలో అద్భుతంగా చేసి చూపిస్తానని ఆయనకు ప్రామిస్ చేశా.అశ్వత్ మరిముత్తు సినిమాలో స్త్రీ పాత్రలకు ఎప్పుడూ ప్రాధాన్యత ఉంటుంది. ఈ కథను రెండుసార్లు విని.. పల్లవి పాత్రను అర్థం చేసుకున్న తర్వాత ఈ చిత్రంలో భాగమయ్యే అవకాశాన్ని కోల్పోకూడదని నిర్ణయించుకున్నా. పల్లవి పాత్ర నాకు ఇచ్చినందుకు అశ్వత్‌కు ధన్యవాదాలు. నాకు అద్భుతమైన పాత్రతో అరంగేట్రం ఇచ్చినందుకు. మీకు నటుల పట్ల మీకు ఉన్న ప్రేమ, వారికి ఉత్తమమైన పాత్రలు అందించడం, వేరే దేని గురించి ఆలోచించకుండా పూర్తిగా సినిమాపై ప్రేమ పని చేస్తారు. ఈ విషయంలో మీకు ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటానని' పోస్ట్ చేసింది.
ప్రదీప్ రంగనాథన్ గురించి రాస్తూ..' ప్రదీప్ లాంటి కో స్టార్ దొరకడం చాలా అరుదు. ఈ సినిమాతో నాకు నిజమైన స్నేహితుడు లభించాడు. అతని అనుభవం నుంచి నేర్చుకున్న పాఠాలు నా మనసులో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. మేమిద్దరం సెట్‌లో మాట్లాడుకోవడం.. కథ గురించి చర్చించుకోవడం.. మా ఇద్దరి మనస్సులో ఎప్పటికీ నిలిచే ఉంటుంది. ప్రదీప్ సార్ మీరు సూపర్ టాలెంటెడ్.. అద్భుతమైన నటుడు మీరు' అంటూ హీరోపై ప్రశంసలు కురిపించింది.
Comments
Please login to add a commentAdd a comment