
సినీ నిర్మాత జ్ఞానవేల్ రాజాకు చెన్నై హైకోర్టులో ఊరట లభించింది. వివరాల్లోకి వెళ్తే 2017లో నటుడు శశికుమార్ బంధువు ఆత్మహత్య చేసుకున్నారు. ఈ సంఘటన అప్పట్లో కోలీవుడ్‌లో కలకలానికి దారి తీసింది. ఆ వ్యవహారంపై సినీ ఫైనాన్షియర్ బోద్రాను నిర్మాత జ్ఞానవేల్ రాజా విమర్శిస్తూ ఆరోపణలు చేసినట్లు ప్రచారం జరిగింది.
దీంతో ఫైనాన్షియర్ బోద్రా చెన్నై హైకోర్టులో జ్ఞానవేల్ రాజా తనపై నిరాధార ఆరోపణలు చేసినట్లు పిటీషన్ దాఖలు చేశారు. పలుమార్లు విచారణ అనంతరం కేసుకు సంబంధించి న్యాయమూర్తి దండపాణి బుధవారం ఫైనాన్షియర్ బోధ నిర్మాత జ్ఞానవేల్ రాజాపై వేసిన పిటీషన్‌లో తగిన ఆధారాలు లేనందున ఈ కేసును కొట్టి వేస్తున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment