ఒక చిత్ర నిర్మాణ సంస్థ నుంచి తీసుకున్న అడ్వాన్స్ చెల్లించే విషయంలో కోలీవుడ్ స్టార్ నటుడు శింబు కు హైకోర్టులో గట్టి దెబ్బ తగిలింది. సదరు సంస్థ నుంచి తీసుకున్న మొత్తాన్ని వడ్డీతో సహా రూ.85 లక్షలు చెల్లించాలని, లేని పక్షంలో ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం చెన్నై హైకోర్టు హెచ్చరించింది.
వివరాల్లోకి వెళ్లితే.. సంచలన నటుడు శింబు ఫ్యాషన్ అనే నూతన నిర్మాణ సంస్థలో అరసన్ చిత్రంలో నటించడానికి 2013లో రూ.50 లక్షలు అడ్వాన్స్ పుచ్చుకున్నారు. అయితే అప్పటి నుంచి ఆ సంస్థలో చిత్రం చేయకపోవడంతో ఫ్యాషన్ సంస్థ అధినేతలు చెన్నై హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసును విచారించిన న్యాయస్థానం నటుడు శింబు అడ్వాన్స్‌గా తీసుకున్న రూ.50 లక్షలకు వడ్డీతో కలిపి మొత్తం రూ.85లక్షలను నాలుగు వారాల్లోగా ఫ్యాషన్ చిత్ర నిర్మాణ సంస్థకు తిరిగి చెల్లించాలని, లేని పక్షంలో శింబు కారు, సెల్‌ఫోన్, ఇతర వస్తువులతో సహా ఇంటిని జప్తు చేయాల్సి ఉంటుందని శనివారం విచారణానంతరం హెచ్చరించింది. కోర్టులో శింబు తరఫున ఫ్యాషన్ సంస్థ అనుకున్న సమయంలో చిత్రం చేయలేదని వివరణ ఇచ్చినా, నాలుగు సంవత్సరాలుగా చిత్రం చేయకపోవడానికి కోర్టు తప్పు పట్టింది.
Comments
Please login to add a commentAdd a comment