
తమిళసినిమా: నటుడు శరత్‌కుమార్ రెండో కూతురు కూడా చిత్రరంగ ప్రవేశం చేసింది. శరత్‌కుమార్ పెద్ద కూతురు వరలక్ష్మీ నటిగా రాణిస్తున్న విషయం తెలిసిందే. పోడా పోడీ చిత్రంతో హీరోయిన్‌గా రంగప్రవేశం చేసిన వరలక్ష్మి బాలా దర్శకత్వం వహించిన తారైతప్పట్టై చిత్రంతో మంచి పేరు తెచ్చుకున్నారు. ఇటీవల మహిళల రక్షణ కోసం సేవ్ శక్తి అనే స్వచ్ఛంద సం స్థను ప్రారంభించన వరలక్ష్మి తాజాగా హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రం గా రూపొందుతున్న శక్తి అనే చిత్రం లో నటిస్తున్నారు.
దర్శకుడు మిష్కిన్ శిష్యురాలు ప్రియదర్శని తొలిసారిగా మోగాఫోన్ పడుతున్న ఈ చిత్రంలో వరలక్ష్మి పోలీస్ అధికారిణిగా నటిస్తున్నారట. దీని గురించి ఆమె చెబుతూ ఇది పోలీస్ అధికారిణికి విలన్‌కు మధ్య జరిగే పోరు ఇతివృత్తంగా తెరకెక్కిస్తు న్న యాక్షన్ థ్రిల్లర్ కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఈ చిత్రం ద్వారా తన చెల్లెలు పూజ కాస్ట్యూం డిజైనర్‌గా పరిచయం అవుతోందని తెలిపా రు. చిత్ర నిర్మాణం శరవేగంగా జరుగుతోందని, వచ్చే ఏడాది మార్చిలో శక్తి చిత్రాన్ని విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు వరలక్ష్మి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment