
రజనీకాంత్, నిహారిక భాసిన్
‘పాతికేళ్ల క్రితం నాటి రజనీకాంత్‌ని చూస్తున్నట్లుంది’...‘పేట’ సినిమాలో రజనీ లుక్స్, గెటప్‌ను చూసి ఆయన అభిమానులు ఇలానే మాట్లాడుకున్నారు. ముఖ్యంగా ఈ సినిమాలో రజనీకాంత్ కాస్ట్యూమ్స్ భలేగా కుదిరాయి. రజనీని యంగ్ అండ్ స్టైలిష్‌గా చూపించడానికి ‘పేట’ చిత్రదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ స్పెషల్ కేర్ తీసుకున్నట్లు తెలుస్తుంది. ఇప్పుడు అదే మేజిక్ రిపీట్ కాబోతుంది. ఏఆర్. మురుగదాస్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు కాస్ట్యూమ్ డిజైనర్‌గా ‘పేట’ సినిమాకు వర్క్ చేసిన నిహారిక భాసిన్‌నే తీసుకున్నారు టీమ్.
‘‘సూపర్‌స్టార్ రజనీకాంత్ సినిమాకు మళ్లీ వర్క్ చేయబోతుండటం చాలా సంతోషంగా ఉంది. హాలిడే ట్రిప్‌కి గోవాకి వెళుతున్నాను. ట్రిప్ ఎంజాయ్ చేయక ముందే సంతోషపడటానికి కారణం దొరికింది. అదే రజనీకాంత్ సినిమా’’ అని పేర్కొన్నారు నిహారిక. గోవా నుంచి వచ్చాక రజనీ కాస్ట్యూమ్స్‌ని రెడీ చేశారట. అలాగే ‘పేట’ సినిమాకు సంగీతం అందించిన అనిరు«ద్‌నే ఈ సినిమాకు వర్క్ చేయనున్నారు. ఇందులో కథానాయికగా నయనతార నటించబోతున్నారు. త్వరలో ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది. ఇందులో రజనీకాంత్ డ్యూయల్ రోల్ చేయబోతున్నారనే ప్రచారం జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment