Khaidi No. 150
-
ఖైదీ నంబర్ 150 టికెట్‌పై 92% డిస్కౌంట్!!
కలెక్షన్లలో ఖైదీ నంబర్ 150 గత రికార్డులన్నింటినీ నిజంగానే బద్దలు కొట్టిందా? తొలిరోజు కలెక్షన్స్‌లో బాహుబలి వసూళ్లను అధిగమించిందా? తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లో కూడా భారీ వసూళ్లను సాధించిందని, ఈ సినిమా ఒక్క రోజులో 47 కోట్లకు పైగా వసూళ్లు సాధించిపెట్టినట్టు తెలిపారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన బాహుబలి తొలి రోజు 35 కోట్లతో సరిపెట్టుకోగా ఖైదీ నంబర్ 150, ఆ రికార్డ్‌ను దాటి కొత్త చరిత్ర సృష్టించినట్టు కూడా బహిరంగంగా ప్రకటించారు. తొమ్మిదేళ్ల విరామం తర్వాత కూడా బాక్సాఫీస్‌ను షేక్ చేస్తున్నట్టు అంతటా వార్తలొచ్చాయి. తెలుగు రాష్ట్రాలతో పాటు ఒడిశా, మహారాష్ట్రల్లోనే కాకుండా అమెరికాలో కలెక్షన్లు రికార్డులు సృష్టిస్తోందని ఆ సినిమా విడుదలైన తర్వాత దర్శకుడు వీవీ వినాయక్ చెప్పారు. భోగి ముందు రోజు, భోగి రోజు సినిమా థియేటర్లలో కలెక్షన్లు తగ్గుతాయని, అయితే అందుకు భిన్నంగా తమ సినిమా భోగి ముందు రోజు తెలంగాణలో 2.50 కోట్ల షేర్ వసూలు చేసిందన్నారు. అలాగే రూ.4.50 కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించి రికార్డు సృష్టించిందన్నారు. ఈ సినిమా కలెక్షన్ల విషయంలో గీతా ఆర్ట్స్ అధినేత, చిరంజీవి బావమరిది అల్లు అరవింద్ ఒక అడుగు ముందుకేసి ఖైదీ నెంబర్ 150 తొలిరోజు కలెక్షన్లు చూసిన తర్వాత చిరంజీవితో 151వ సినిమా తీయాలంటే భయమేస్తోందని కూడా చెప్పారు. తొలిరోజు ఖైదీ నెం. 150 సినిమాకు 47 కోట్ల రూపాయల గ్రాస్ వచ్చిందని ఆయన తెలిపారు. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలలో 30 కోట్లు వచ్చిందని, ఓవర్సీస్ కలెక్షన్లు కూడా బాగున్నాయని అన్నారు. (చదవండి- చిరంజీవితో సినిమా అంటే భయమేస్తోంది) ఈ డిస్కౌంట్ల మాటేంటి సారూ.. ఓవర్సీస్లో భారీ కలెక్షన్స్ సాధించినట్టు సినిమావర్గాలు చెబుతుంటే మరోవైపు అమెరికాలో డిస్కౌంట్ వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ సినిమాను అమెరికాలోనూ విడుదల చేయగా, దాదాపు అన్ని థియేటర్లలోనూ డిస్కౌంట్ ఆఫర్‌తో టికెట్లను విక్రయించారు. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లోని తెలుగువారు ఫండాంగో వెబ్ సైట్ ద్వారా సినిమా టికెట్లను కొనుగోలు చేస్తుంటారు. అసలు ధర 25 డాలర్లు.. అందులో 23 డాలర్ల డిస్కౌంట్ టెక్సాస్ ఆస్టిన్‌లో ఉంటున్న తెలుగువారు చాలామంది 25 డాలర్లు పెట్టి టికెట్ కొనుగోలు చేయగా, వారికి 23 డాలర్ల డిస్కౌంట్ లభించింది. అంటే సినిమా ఒక టికెట్ కేవలం 2 డాలర్లకే కొనుగోలు చేశారన్నమాట. మరో వ్యక్తి కాలిఫోర్నియాలోని సెంచురీ గ్రేట్ మాల్ అండ్ ఎక్స్ డి థియేటర్లో సినిమా కోసం టికెట్ బుక్ చేయగా డిస్కౌంట్ పోను 2 డాలర్లకే టికెట్ లభించింది. సినిమా అమెరికాలో విడుదలకు ముందు కొనుగోలు చేసిన టికెట్లపై ఎలాంటి డిస్కౌంట్ ఇవ్వలేదని, విడుదల అయిన తర్వాతే ఈ భారీ డిస్కౌంట్ ఆఫర్ చేశారని అక్కడి వారు చెబుతున్నారు. పలువురు ప్రవాసులు తమ డిస్కౌంట్ టికెట్లను సోషల్ మీడియాల్లో పోస్టు చేశారు. ఈ డిస్కౌంట్ల మహిమేమో... ఓవర్సీస్ కలెక్షన్ల గురించి సరైన లెక్కలు చెప్పడం లేదన్న మాట వినిపిస్తోంది. కొసమెరుపు అమెరికాలో ప్రతి మంగళవారం ఇలాంటి ఆఫర్లు సర్వసాధారణమేనని అవి ఏ సినిమాకైనా ఆఫర్లు ప్రకటిస్తారని సాక్షి రీడర్స్ తెలియజేశారు. ఇది ఒక్క ఖైదీ నంబర్.150కే పరిమితం కాదని అలాగే తెలుగు సినిమాలు అమెరికాలో విడుదలైనప్పుడు దాదాపు అన్ని సినిమాలకు ఇదే తరహాలో ఆఫర్లు అందుబాటులో ఉంటాయని 'సాక్షి'ని అభిమానించే అశేషమైన పాఠకులు తెలిపారు. -
రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చాడు..!
-
మరో బాంబు పేల్చిన రాంగోపాల్ వర్మ!
-
బాలయ్య సినిమాపై చిరంజీవి కామెంట్
గుంటూరు: 'ఖైదీనంబర్ 150' సినిమా సంక్రాంతికి తన అభిమానులకు మంచి కానుక అవుతుందని మెగాస్టార్ చిరంజీవి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన 150వ సినిమాతోపాటు వస్తున్న బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ఆయన స్పందించారు. బాలయ్య సినిమా కూడా ఆడాలని, తమ రెండు సినిమాలూ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. హ్యాయ్ల్యాండ్లో ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాయ్లాండ్లో వైభవంగా జరిగింది. ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. తనపై అభిమానుల చూపించే ప్రేమ కోసమే తిరిగి సినిమాల్లోకి వచ్చానని అన్నారు. ఈ సినిమా రీమేక్ కోసం తమిళ సినిమా కత్తి కథ హక్కులు ఇచ్చినందుకు చిత్ర దర్శకుడు మురగదాస్, హీరో విజయ్, లైకా ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్, డ్రామా, ఒక సోషల్మేసేజ్ వంటి అన్ని అంశాలున్నాయన్నారు. ఇటువంటి పాత్ర తన 150వ చిత్రానికి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు. ఈ చిత్రానికి వివి వినాయక్ వంటి దర్శకుడు దర్శకత్వం వహించడంతోనే సినిమా సూపర్ హిట్ అయిందని అన్నారు. తమ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న బాలకృష్ణ గౌతమీపత్ర శాతకర్ణీ, శతమానంభవతి చిత్రాలు కూడా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు. -
మరో బాంబు పేల్చిన రాంగోపాల్ వర్మ!
హైదరాబాద్: మెగా బ్రదర్ నాగాబాబు విమర్శల నేపథ్యంలో కాసేపటి కిందే.. మెగాస్టార్ చిరంజీవికి క్షమాపణలు చెప్పిన దర్శకుడు రాంగోపాల్ వర్మ మరో బాంబు పేల్చారు. తన ట్విట్టర్ అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేశారని ఆయన తాజాగా ట్విస్ట్ ఇచ్చారు. అసలు తాను తెలుగులో ట్వీట్ చేయనే లేదని, చిరంజీవికి క్షమాపణలు చెప్పలేదని వర్మ తేల్చేశారు. ఈ సందర్భంగా ఘాటు విమర్శలు చేసిన నాగాబాబు అంతే ఘాటుగా వర్మ విరుచుకుపడ్డారు. ప్రజారాజ్యం పార్టీ విషయంలో మీ అన్నయ చిరంజీవికి నువ్వు ఎలాంటి తప్పుడు సలహా ఇచ్చావో అందరికీ తెలుసు అంటూ పేర్కొన్నారు. నాగబాబు సార్‌కి ఇంగ్లిష్ అర్థం కాదని, కాబట్టి ఎడ్యుకేట్ అయిన స్నేహితుడి ద్వారా తన ఇంగ్లిష్ ట్వీట్ల గురించి తెలుసుకోవాలని వ్యాఖ్యానించారు. గ్రేట్ మెగాబ్రదర్ ముందు నాగబాబు 0.01శాతం మాత్రమేనని, అందుకే నాగాబాబులా చిరంజీవి అరవలేదని ఘాటుగా చురకలంటించారు. 'నాకు సలహాలు ఇచ్చేముందు నాగాబాబు తన జబర్దస్త్ కెరీర్ ఏమిటో ప్రశ్నించుకోవాలి' అని అన్నారు. నాగబాబు సార్.. ఖైదీ 150 ట్రైలర్ ఇప్పుడే చూశాను. అద్భు..........తంగా ఉంది. అవతార్ కంటే కూడా బాగుంది' అంటూ వ్యాఖ్యానించారు. అంతకుముందు నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందిస్తూ.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. అయితే, ఈ ట్వీట్లను హ్యాక్ చేసి పెట్టినవేనని వర్మ ట్విస్టు ఇచ్చారు. అంతకుముందు ఆయన చేసిన ట్వీట్ల సారాంశమిది. 'నాగబాబు గారూ, మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అని వర్మ ముగించారు. -
చిరంజీవి గారికి సారీ: వర్మ
ఖైదీ నెం. 150 చిత్రం ప్రీ లాంచ్ వేడుకలో మెగా బ్రదర్ నాగేంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై దర్శకుడు రాంగోపాల్ వర్మ ట్విట్టర్లో స్పందించారు. ఈ అంశంపై శనివారం రాత్రి వరుసపెట్టి ట్వీట్లు చేశారు. చివరగా.. తన తరఫున చిరంజీవిగారికి సారీ చెప్పమంటూ నాగేంద్రబాబును కోరారు. ఆయన ట్వీట్లలో పేర్కొన్న అంశాలు ఇలా ఉన్నాయి... ''నాగబాబు గారూ, మీరు ట్విట్టర్లో లేరు కాబట్టి ఎవరైనా నా ఈ ట్వీట్లు మీకు చూపిస్తారని ఆశిస్తున్నాను. మీరంటే నాకు చాలా ఇష్టం. నేనేదో నా స్టైల్లో అందరి మీద అన్నింటి మీద ఏదో ఒక అభిప్రాయం చెబుతూ ఉంటాను. ఒట్టి మీ ఫ్యామిలీ మీదే కాదు.. అది వినే ఉంటారు. నా ట్వీట్లు మోదీ గారి దగ్గర నుంచి బచ్చన్‌గారి వరకు చివరకి నా మీద నేనే చాలా కామెంట్లు చేస్తూ ఉంటాను. కానీ మీరు చాలా అఫెండ్ అయ్యి, హర్ట్ అయ్యారని నాకు తెలిసింది కనుక నేను చాలా నిజాయితీగా మీకు, మీ కుటుంబానికి సారీ చెబుతున్నాను. నా ఉద్దేశం వేరే అయినా మీరు హర్ట్ అయ్యారు కనుక చిరంజీవి గారికి కూడా నా తరఫున దయచేసి సారీ చెప్పండి.. థాంక్స్'' అని వర్మ ముగించారు. Naga babu gaaru meeru twitter lo leru kaabatti yevarainaa naa ee tweetlu meeku choopistarani aashisthunnanu ..meerante naaku chaala ishtam — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Nenedho naa style lo andari meedha anniti meedha yedho oka opinion cheputhoo vuntanu ..votti mee family meedhe kaadhu ..adhi vine vuntaru — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Naa tweetlu Modi gari daggaranunchi Bachcgangaari Varakoo chivariki naa meedha nene chaala commentlu chesthoo vuntanu — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Kaani meeru chaala offend ayyi hurt ayyarani naaku thelisindhi kanuka nenu chaala genuine gaa meeku mee family ki sorry chepthunnanu — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 Naa vuddeshyam vere ayina meeru hurt ayyaru kanuka chiranjeevigariki kooda naa tharapuna dayachesi sorry cheppandi..Thanks — Ram Gopal Varma (@RGVzoomin) 7 January 2017 -
ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ
హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ఖైదీ నం.150 సినిమాలో తన పాత్రపై కమెడీయన్ పృధ్వీ క్లారిటీ ఇచ్చారు. తన పాత్రను తగ్గించారన్నది అవాస్తమని ఆయన అన్నారు. ఖైదీ నం.150లో తాను నటించింది ఒక్కరోజు మాత్రమేనని పృధ్వీ తెలిపారు. కొన్ని వెబ్ సైట్లు తాను చెప్పిన మాటలను వక్రీకరించాయని, చిరంజీవితో కలిసి నటించడమే తన అదృష్టంగా భావిస్తున్నానని ఆయన అన్నారు. కాగా పృధ్వీ నటించిన కొన్ని సీన్లు ఎడిటింగ్‌లో కత్తెర పడినట్లు వార్తలు వెలువడిన విషయం తెలిసిందే. దీనిపై పృధ్వీ తాను నటించిన సీన్లు తొలగించడం దురదృష్టకరమని, సంక్రాంతి రోజు తన తల్లి చనిపోయినంత బాధగా ఉందంటూ ఆయన వ్యాఖ్యలు చేసినట్లు పలు వెబ్సైట్లలో వార్తలు చక్కెర్లు కొడుతున్నాయి. అయితే తాను అలా అనలేదని, తన మాటలను వక్రీకరించారని ఆయన చెప్పుకొచ్చారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ నెల 11న ఖైదీ నం.150 చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఖైదీ నం.150: నేను అలా అనలేదు: పృధ్వీ
-
ఖైదీ నంబర్ 150 సెట్లో విదేశీ మేయర్
మెగాస్టార్ చిరంజీవి, కాజల్ హీరో హీరోయిన్లుగా వి.వి.వినాయక్ దర్శకత్వంలో `ఖైదీ నంబర్ 150` తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం పాటల చిత్రణకు యూరప్ ట్రిప్ వెళ్లింది యూనిట్. అక్కడ క్రొయేషియా, స్లోవేనియా వంటి పలు లొకేషన్లలో చిత్రీకరణ సాగుతోంది. అయితే ఆ లొకేషన్‌కి ఓ అనుకోని అతిథి వచ్చి చిరంజీవి, కాజల్ సహా యూనిట్‌ని పలకరించారు. అంతేనా తమ దేశంలో షూటింగ్ చేస్తున్నందుకు సంతోషిస్తున్నట్లు కూడా చెప్పారు. ఖైదీ నంబర్ 150 చిత్రానికి ఉన్న పాపులారిటీని, క్రేజును అడిగి మరీ తెలుసుకున్నారు. అసలింతకీ ఎవరా అతిథి.. అంటే డుబ్రోవ్నిక్ నగర మేయర్ ఆండ్రూ వ్లాహుసిక్. డుబ్రోవ్నిక్ నగరానికి వచ్చి షూటింగ్ చేస్తున్నందుకు మెగాస్టార్‌కి, కాజల్ సహా యూనిట్‌కి ఆయన థాంక్స్ చెప్పారు. మేయర్ స్వయంగా చిరంజీవిని కలిసి ఓ గిఫ్ట్ కూడా ఇచ్చారు. భారతీయ సినిమా అంటే తనకు ఎంతో అభిమానమని ఆయన చెప్పారు. డుబ్రొవోనిక్ టూరిజం అభివృద్ధికి ఈ సినిమా షూటింగ్ సాయపడుతుందన్నారు. చిరంజీవి గతంలో యూపీఏ హయాంలో పర్యాటక శాఖ మంత్రిగా పనిచేసిన సంగతి గుర్తుంది కదూ! -
డాటర్ డిజైనర్... డాడ్ లుక్ సూపర్!
మమ్మీ డాడీ స్టైల్‌గా కనిపించాలని పిల్లలు కోరుకుంటారు. కొన్ని టిప్స్ కూడా ఇస్తుంటారు. వీలైతే వాళ్ల కోసం షాపింగ్ చేస్తారు. అదే డాడీ హీరో అనుకోండి... సినిమాలో ఆయన వేసుకునే కాస్ట్యూమ్స్ బాగుండాలని అనుకుంటారు. ఒకవేళ డిజైనింగ్ మీద అవగాహన ఉంటే, స్వయంగా కాస్ట్యూమ్స్ డిజైన్ చేస్తారు. చిరంజీవి పెద్ద కుమార్తె సుస్మిత అదే చేస్తున్నారు. తండ్రి 150వ చిత్రం ‘ఖైదీ నం. 150’కి కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారామె. డాడీ స్టైలిష్‌గా కనిపించడం కోసం చాలా శ్రద్ధగా డ్రెస్సులు తయారు చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించిన ఫొటోలు చూసి, చిరంజీవి లుక్ సూపర్ అని అభిమానులు మురిసిపోతున్నారు. అన్నట్లు.. తండ్రికి మాత్రమే కాదు.. సినిమా మొత్తానికి సుస్మిత కాస్ట్యూమ్ డిజైనర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే... ప్రస్తుతం ఈ చిత్రబృందం యూరప్ వెళ్లడానికి రెడీ అవుతోంది. అక్కడ పాటలను చిత్రీకరించనున్నారు. స్లోవేనియా, క్రొయేషియా తదితర అందమైన లొకేషన్లలో ఈ చిత్రీకరణ జరగనుందని చిత్ర నిర్మాత రామ్‌చరణ్ తెలిపారు. జానీ మాస్టర్, శేఖర్ మాస్టర్ నృత్యరీతులు సమకూరుస్తారని చెప్పారు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఓ ప్రత్యేక పాటకు చిరంజీవి సరసన లక్ష్మీరాయ్ కాలు కదిపారు. హిందీ నటుడు తరుణ్ అరోరా విలన్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కెమేరా: రత్నవేలు, కళ: తోట తరణి. -
చిరంజీవి సినిమాలో విజయ్ మాల్యా పాత్ర!
చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో.. విజయ్ మాల్యా తరహా పాత్ర ఒకటి ఉండబోతోందట. తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేయబోతున్నాడు. దాంతో చిరు పక్కన తొలిసారి నటించే అవకాశం ఈ ముంబై నటుడికి దక్కింది. తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నానని, దర్శకుడు ఆ పాత్రను ఏమాత్రం మార్చకపోయినా.. తెలుగులో టేకింగ్ మాత్రం కొంత విభిన్నంగా ఉంటుందని అరోరా చెప్పాడు. ఇది చాలా విభిన్నమైన విలన్ పాత్ర అని తెలిపాడు. సినిమా మొత్తం తాను సూట్లలోనే కనిపిస్తానని, విజయ్ మాల్యా మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తాను అచ్చం అలాగే కనిపిస్తానని అన్నాడు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూలు పూర్తయింది. మళ్లీ బుధవారం నుంచి సెట్ల మీదకు వెళ్తుంది. చిరంజీవితో కలిసి నటించడం అంటే తాను చాలా ఉత్సుకతతో ఉన్నానని తరుణ్ అన్నాడు. తొలి షెడ్యూలులో తామిద్దరం కలిసి చేసిన సన్నివేశాలు చాలా తక్కువని, దాంతో ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయానని చెప్పాడు. దానికితోడు వర్షం భారీగా పడటంతో మొత్తం షెడ్యూలు రద్దయిందన్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తోంది. తెలుగులో తన తొలి సినిమాలోనే చిరంజీవి లాంటి అగ్రనటుడితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తరుణ్ అరోరా అన్నాడు. దర్శకుడు వినాయక్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారని.. దానికి తోడు టీమ్ అంతా చాలా కుర్రాళ్లు కావడంతో తన పని సులభం అవుతోందని చెప్పాడు.