బాలయ్య సినిమాపై చిరంజీవి కామెంట్‌ | chiranjeevi speech at khaidi 150 event | Sakshi
Sakshi News home page

బాలయ్య సినిమాపై చిరంజీవి కామెంట్‌

Published Sat, Jan 7 2017 10:12 PM | Last Updated on Tue, Sep 5 2017 12:41 AM

బాలయ్య సినిమాపై చిరంజీవి కామెంట్‌

బాలయ్య సినిమాపై చిరంజీవి కామెంట్‌

గుంటూరు: 'ఖైదీనంబర్‌ 150' సినిమా సంక్రాంతికి తన అభిమానులకు మంచి కానుక అవుతుందని మెగాస్టార్‌ చిరంజీవి అన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా తన 150వ సినిమాతోపాటు వస్తున్న బాలకృష్ణ 100వ సినిమా 'గౌతమీపుత్ర శాతకర్ణి'పై ఆయన స్పందించారు. బాలయ్య సినిమా కూడా ఆడాలని, తమ రెండు సినిమాలూ విజయవంతం కావాలని కోరుకుంటున్నానని తెలిపారు. హ్యాయ్‌ల్యాండ్‌లో ‘ఖైదీ నంబర్ 150’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ హాయ్‌లాండ్‌లో వైభవంగా జరిగింది.

ఈ సందర్భంగా చిరు మాట్లాడుతూ.. తనపై అభిమానుల చూపించే ప్రేమ కోసమే తిరిగి సినిమాల్లోకి వచ్చానని అన్నారు. ఈ సినిమా రీమేక్ కోసం తమిళ సినిమా కత్తి కథ హక్కులు ఇచ్చినందుకు చిత్ర దర్శకుడు మురగదాస్, హీరో విజయ్, లైకా ప్రొడక్షన్స్‌కి ధన్యవాదాలు తెలిపారు. ఈ చిత్రంలో కామెడీ, ఎమోషన్, డ్రామా, ఒక సోషల్‌మేసేజ్ వంటి అన్ని అంశాలున్నాయన్నారు. ఇటువంటి పాత్ర తన 150వ చిత్రానికి లభించడం అదృష్టంగా భావిస్తున్నానని పేర్కొన్నారు.

ఈ చిత్రానికి వివి వినాయక్ వంటి దర్శకుడు దర్శకత్వం వహించడంతోనే సినిమా సూపర్ హిట్ అయిందని అన్నారు. తమ సినిమాతో పాటు సంక్రాంతికి విడుదలవుతున్న బాలకృష్ణ గౌతమీపత్ర శాతకర్ణీ, శతమానంభవతి చిత్రాలు కూడా ఘన విజయం సాధించాలని ఆయన ఆకాంక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement