మెగా అభిమానులని ఈ మధ్య కాలంలో బాగా బాధపెడుతున్న విషయం ఒక్కటే. అది రీమేక్స్. మెగా బ్రదర్స్ ఇద్దరూ వరసగా రీమేక్ చిత్రాలు చేస్తున్నారు. వాళ్ల వైపు నుంచి రీజన్ ఏంటనేది పక్కనబెడితే.. సాధారణ ప్రేక్షకులు మాత్రం అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఈ విషయమై వచ్చే ట్రోల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ విమర్శలు ఏకంగా మెగాస్టార్ చెవిన పడ్డట్లు ఉన్నాయి. దీంతో అసలు రీమేక్స్ ఎందుకు చేయాల్సి వచ్చిందనేది ఫుల్‌గా క్లారిటీ ఇచ్చేశారు.
నచ్చి చేశాను
'అమ్మ ప్రేమ.. అభిమానుల ప్రేమ ఎప్పుడూ బోర్ కొట్టదు. అది చల్లగా మదిని హత్తుకుంటుంది. అందుకే మీరందరూ గర్వపడేలా ఉండాలని ఎప్పటికప్పుడు నన్ను నేను మార్చుకుంటాను. ప్రతి అడుగు ఆచితూచి వేస్తూ ముందుకెళ్తున్నాను. నా మనసుకు నచ్చి చేసిన సినిమా ఇది. రీమేక్స్ చేస్తుంటారేంటని కొందరు తరుచూ అడుగుతున్నారు.'
(ఇదీ చదవండి: 'ఆ గొంతు ఎప్పటికీ వినిపిస్తూనే ఉంటుంది'.. మెగాస్టార్ ఎమోషనల్ ట్వీట్)
రీమేక్.. తప్పేంటి?
'ఓ మంచి కథ దొరికినప్పుడు.. దాన్ని మన ప్రేక్షకులకు చూపించేందుకు రీమేక్ చేస్తే తప్పేంటనేది నాకు అర్థం కాదు. ఈ 'భోళా శంకర్' ఒరిజినల్ 'వేదాళం' ఏ ఓటీటీలోనూ అందుబాటులో లేదు. ఎవరూ చూడలేదు. అందుకే ధైర్యంగా ఈ మూవీ చేసేందుకు ముందుకొచ్చాను. ఇది కచ్చితంగా అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంది. షూటింగ్ జరుగుతున్న టైంలోనే ఇది సూపర్‌హిట్ అవుతుందనే భరోసా అందరిలో కనిపించింది' అని చిరంజీవి చెప్పుకొచ‍్చారు.
ఇది మూడో రీమేక్
మెగాస్టార్ చిరంజీవి.. 2007 తర్వాత దాదాపు పదేళ్ల పాటు సినిమాలకు దూరమయ్యారు. ఇక రీఎంట్రీ చిత్రం 'ఖైదీ నం.150'.. తమిళ సినిమా 'కత్తి'కి రీమేక్. ఇది బాక్సాఫీస్ దగ్గర హిట్ అయింది. దీని తర్వాత 'సైరా', 'ఆచార్య' చిత్రాలు చేసిన చిరుకు నిరాశే మిగిలింది. దీంతో మళ్లీ రూట్ మార్చారు. మలయాళ 'లూసిఫర్' రీమేక్‌తో 'గాడ్ ఫాదర్'గా వచ్చారు. ఇది ఓ మాదిరి హిట్ అయింది. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన 'వాల్తేరు వీరయ్య' స్ట్రెయిట్ మూవీ కానీ సూపర్ హిట్ అయింది. ఇప్పుడు చేస్తున్న 'భోళా శంకర్'.. అప్పుడెప్పుడో 2015లో తమిళంలో వచ్చిన 'వేదాళం'కి రీమేక్. మరి దీని టాక్ ఏంటో తెలియాలంటే ఆగస్టు 11 వరకు వెయిట్ చేయాల్సిందే.
(ఇదీ చదవండి: వాళ్ల నాన్నకు సర్జరీ జరిగింది.. కానీ: హీరోయిన్‌పై మెగాస్టార్ కామెంట్స్)
Comments
Please login to add a commentAdd a comment