చిరంజీవి సినిమాలో విజయ్ మాల్యా పాత్ర! | My role on the lines of Vijay Mallya in 'Khaidi No.150', says Tarun arora | Sakshi
Sakshi News home page

చిరంజీవి సినిమాలో విజయ్ మాల్యా పాత్ర!

Published Mon, Sep 19 2016 12:44 PM | Last Updated on Sat, Apr 6 2019 9:07 PM

చిరంజీవి సినిమాలో విజయ్ మాల్యా పాత్ర! - Sakshi

చిరంజీవి సినిమాలో విజయ్ మాల్యా పాత్ర!

చిరంజీవి 150వ సినిమా 'ఖైదీ నెంబర్ 150'లో.. విజయ్ మాల్యా తరహా పాత్ర ఒకటి ఉండబోతోందట. తమిళంలో నీల్ నితిన్ ముఖేష్ చేసిన ఆ పాత్రను.. తెలుగులో తరుణ్ అరోరా చేయబోతున్నాడు. దాంతో చిరు పక్కన తొలిసారి నటించే అవకాశం ఈ ముంబై నటుడికి దక్కింది. తన వయసు కంటే చాలా పెద్దవయసు పాత్రను ఈ సినిమాలో పోషిస్తున్నానని, దర్శకుడు ఆ పాత్రను ఏమాత్రం మార్చకపోయినా.. తెలుగులో టేకింగ్ మాత్రం కొంత విభిన్నంగా ఉంటుందని అరోరా చెప్పాడు. ఇది చాలా విభిన్నమైన విలన్ పాత్ర అని తెలిపాడు. సినిమా మొత్తం తాను సూట్లలోనే కనిపిస్తానని, విజయ్ మాల్యా మంచి పరిస్థితిలో ఉన్నప్పుడు ఎలా ఉంటాడో తాను అచ్చం అలాగే కనిపిస్తానని అన్నాడు.

ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ఒక షెడ్యూలు పూర్తయింది. మళ్లీ బుధవారం నుంచి సెట్ల మీదకు వెళ్తుంది. చిరంజీవితో కలిసి నటించడం అంటే తాను చాలా ఉత్సుకతతో ఉన్నానని తరుణ్ అన్నాడు. తొలి షెడ్యూలులో తామిద్దరం కలిసి చేసిన సన్నివేశాలు చాలా తక్కువని, దాంతో ఆయనతో ఎక్కువ సేపు మాట్లాడలేకపోయానని చెప్పాడు. దానికితోడు వర్షం భారీగా పడటంతో మొత్తం షెడ్యూలు రద్దయిందన్నాడు. వీవీ వినాయక్ దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాతగా వస్తున్న ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా చేస్తోంది. తెలుగులో తన తొలి సినిమాలోనే చిరంజీవి లాంటి అగ్రనటుడితో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానని తరుణ్ అరోరా అన్నాడు. దర్శకుడు వినాయక్ కూడా చాలా ప్రోత్సహిస్తున్నారని.. దానికి తోడు టీమ్ అంతా చాలా కుర్రాళ్లు కావడంతో తన పని సులభం అవుతోందని చెప్పాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement