
షాద్‌నగర్: దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్ విద్యార్థిని సత్తా చాటింది. పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం, లక్ష్మి దంపతుల కూతురు సుష్మిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించింది. గతంలో మూడుసార్లు ఇంటర్వ్యూకు చేరుకున్న ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది.
పట్టువదలకుండా నాలుగోసారి శ్రమించి మంచి ర్యాంకు సాధించింది. ఆమె పదో తరగతి వరకు షాద్‌నగర్ పట్టణంలోని హెరిటేజ్ వ్యాలీలో చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని పేజ్ కళాశాలలో ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్‌ను వరంగల్‌లోలోని నిట్‌లో పూర్తి చేసింది. పబ్లిక్ సర్వీస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె సివిల్స్‌కు సిద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకుంది.
Comments
Please login to add a commentAdd a comment