
అంతారం అర్బన్‌పార్కులో తనిఖీలు
అటవీశాఖ పనులపై ఆరా
తాండూరు రూరల్: తాండూరు మండలం అంతారంగుట్ట సమీపంలోని అంతారం అర్బన్‌పార్కును అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు తనిఖీలు చేపట్టారు. శుక్రవారం అటవీశాఖ ఫ్లయింగ్ స్క్వాడ్, డీఎఫ్‌ఓ శ్రీనివాస్ రావు, రేంజ్ ఆఫీసర్ విష్ణు, బీట్ ఆఫీసర్లు శ్రీకాంత్, నగేష్ బృందంతో అర్బన్ పార్కును చేరుకుని అటవీశాఖ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి పనులపై ఆరా తీశారు. అర్బన్ పార్కులో వాకింగ్ పాత్, కమాన్ పనులతో పాటు పార్కు చుట్టు ఫెన్షింగ్‌పనులు కూడా పరిశీలించారు. అభివృద్ధి పనుల విషయమై గతంలో ఆరోపణలు రావడంతో అప్పట్లో అటవీశాఖ అధికారులను బదిలీ చేసిన విషయం తెలిసిందే. దీంతో ఫ్లయింగ్ స్క్వాడ్ తనిఖీలు చేయడంతో అటవీశాఖ అధికారుల్లో ఆందోళన మొదలైంది. ఈ కార్యక్రమంలో తాండూరు రేంజ్ ఆఫీసర్ శ్రీదేవి సరస్వతి, సెక్షన్ ఆఫీసర్ ఫిర్యానాయక్, సెక్షన్ ఆఫీసర్ మల్లయ్యలతో పాటు అటవీశాఖ సిబ్బంది పాల్గొన్నారు.
పశువుల ఆరోగ్యంపై
అప్రమత్తత అవసరం
షాబాద్: పశువుల ఆరోగ్యం పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని రేగడి దోస్వాడ పశువైద్యాధికారి చంద్రశేఖర్‌రెడ్డి సూచించారు. శుక్రవారం మండల పరిధిలోని పోతుగల్ గ్రామంలో పశువుల వైద్య శిబిరం నిర్వహించారు. ఇందులో 12 పాడి ఆవులకు గర్భకోశ వ్యాధి చికిత్సలు చేశారు. 26 పశువులకు చూడి పరీక్షలు నిర్వహించి, 30 దూడలు, గేదెలకు నట్టల నివారణ మందులు తాగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... సకాలంలో పశువులకు వైద్యం అందిస్తే అధిక పాల దిగుబడి వస్తుందని తెలిపారు. మేలు రకం పశువుల ఎంపిక ద్వారా ఆదాయం పొందవచ్చని చెప్పారు. కార్యక్రమంలో గోపాలమిత్ర విద్యాసాగర్, వైద్య సిబ్బంది శ్రీనివాస్, సుధాకర్, రైతులు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment