
విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి
దోమ: ఉపాధ్యాయులు విద్యార్థుల సామర్థ్యాల పెంపునకు కృషి చేయాలని ఎంఈఓ వెంకట్ పేర్కొన్నారు. శుక్రవారం దోమ మండల పరిధిలోని రాకొండ పాఠశాలను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ముందుగా పరిసరాలను చూసి, ఆ తర్వాత రికార్డులను పరిశీలించారు. తదనంతరం తరగతి గదులకు వెళ్లి విద్యార్థులతో ముచ్చటించారు. వారిలో ఉన్న ప్రతిభను పరీక్షించేందుకు ప్రశ్నలు అడుగుతూ బోర్డుపై జవాబులను రాయించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రతీ పాఠశాలలో తరగతుల వారీగా విద్యార్థుల సామర్థ్యాలను పెంచేందుకు ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఎఫ్‌ఏ1, ఎఫ్‌ఏ2, ఎస్‌ఏ1, ఎస్‌ఏ3 ఆన్‌లైన్‌లో ఎంట్రీ చేయాలన్నారు. బడీడు పిల్లల సమాచారం సేకరించి నెల నుంచి రాని విద్యార్థులను బడికి రప్పించేలా చర్యలు తీసుకోవాలన్నారు. పాఠశాలలో టాయిలెట్స్, కంపౌండ్ వాల్, కిచన్‌షెడ్ లేని వాటిని గుర్తించి వాటి నివేదికలు ఇవ్వాలన్నారు. మెనూ ప్రకారం విద్యార్థులకు మధ్యాహ్న భోజనం వడ్డించాలన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, కాంప్లెక్స్ సీఆర్‌పీ తదితరులు పాల్గొన్నారు.
ఎంఈఓ వెంకట్
Comments
Please login to add a commentAdd a comment