పన్ను వసూళ్లలో శ్రద్ధ తీసుకోవాలి
తాండూరు టౌన్: పన్ను వసూళ్లలో శ్రద్ధ తీసుకోవాలని మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డి పేర్కొన్నారు. మార్చి నెలాఖరు వరకు వందశాతం పన్ను వసూళ్లను లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఆయన తెలిపారు. శుక్రవారం మున్సిపల్ సమావేశ మందిరంలో మున్సిపల్ ఉద్యోగులు, వార్డు ఆఫీసర్లు, ఆర్పీలతో ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ట్రేడ్ లైసెన్స్, నల్లా, ఆస్తి పన్నుల వసూళ్లలో మున్సిపాలిటీ వెనుకబడి ఉందన్నారు. పట్టణంలోని వార్డులన్నింటికీ వార్డు ఆఫీసర్లను నియమించామని, వారికి ఆర్పీలు సైతం సహకరిస్తారన్నారు. వార్డుల్లో కలియ తిరుగుతూ మార్చి నెలాఖరు వరకు వందశాతం పన్ను వసూళ్లను చేయాలని ఆదేశించారు. అలాగే వార్డుల్లోని పారిశుద్ధ్యం, ఇంటింటికి చెత్త సేకరణ తదితర విషయాలపై కూడా వార్డు ఆఫీసర్లు దృష్టి సారించాలన్నారు. విధులపై నిర్లక్ష్యం వహిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ మేనేజర్ నరేందర్ రెడ్డి, ఆర్వో అశోక్, మెప్మా అధికారులు తదితరులు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ విక్రమ్‌సింహా రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment