
మార్కెట్‌ను ఆదర్శంగా తీర్చిదిద్దుతా
బంట్వారం: మర్పల్లి వ్యవసాయ మార్కెట్‌ను జిల్లాలోనే ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ఏఎంసీ చైర్మెన్ మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ఆయన బంట్వారం మండల కేంద్రంలో కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేఽశంతో కలిసి మేకల సంతను ప్రారంభించి మాట్లాడారు. ఎకరానికి పైగా ప్రభుత్వ స్థలంలో సంతను ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. త్వరలోనే ఫెన్సింగ్ వేయిస్తానన్నారు. జీవాలకు తాగు నీటి తొట్టీలు కట్టించి సంతలో సీసీ రోడ్డు నిర్మిస్తానన్నారు. పూర్తి స్థాయిలో అవసరమైన వసతులు కల్పిస్తానన్నారు. వ్యాపారులు కొనుగోలుదారులు, అమ్మకందార్లు మేకల సంతను సద్వినియోగం చేసుకోవాలని మహేందర్‌రెడ్డి సూచించారు. అలాగే తొర్మామిడిలో రూ.1.50 కోట్లతో రైతు గోడౌన్ నిర్మించనున్నట్లు ఆయన స్పష్టం చేశారు. రైతు సంక్షేమమే ధ్యేయంగా ప్రభుత్వం పని చేస్తుందని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ కార్యదర్శి వెంకటేశ్వర్ రెడ్డి, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు వెంకటేశం, ఏఎంసీ వైస్ చైర్మెన్ మల్లేష్‌యాదవ్, మర్పల్లి సొసెటీ వైస్ చైర్మెన్ ఫసియోద్దీన్, పార్టీ సీనియర్ లీడర్ మొగులయ్య, డైరెక్టర్లు యాదగిరి, శాకం నర్సింలు, ఇసాక్, గాండ్ల నర్సింలు, హరీశ్వర్‌రెడ్డి, రాములు, శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.నర్సింలు, మున్నాబాయ్, అజీమ్, గౌస్, అరుణ్, పి.వెంకటయ్య, సుదర్శన్, పాండునాయక్, శంకర్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.
ఏఎంసీ చైర్మెన్ మహేందర్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment