public service
-
Deepika Deshwal: ముచ్చటగా మూడోసారి...
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడుసార్లు ప్రసంగించిన తొలి భారతీయ యువతిగా లా ఆఫీసర్ దీపికా దేశ్వాల్ చరిత్ర సృష్టించింది. కాలేజీ రోజుల నుంచి సేవాపథంలో నడుస్తున్న దిల్లీకి చెందిన దీపిక ఎంతోమంది బాధితులకు అండగా నిలిచి, ఎన్నోరకాల సేవాకార్యక్రమాల్లో పాల్గొంది. నలుగురిని ఒకటి చేసి తన దారిలో నడిచేలా చేసింది... పీహెచ్డీ స్కాలర్ అయిన దీపికా దేశ్వాల్కు చదువు మాత్రమే ప్రపంచం కాదు. కాలేజీ రోజుల నుంచి సామాజిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం అంటే ఇష్టం. కోవిడ్ కల్లోల కాలంలో సామాజిక సేవా కార్యక్రమాలలో విస్తృతంగా పాల్గొంది. పంజాబ్‌లోని మోగా జిల్లాలో ప్రభుత్వ అధికారులను సమన్వయం చేసుకుంటూ పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వందలాదిమందికి సహాయం అందించింది. స్నేహితులు, బంధువులను కూడా తన సేవాకార్యక్రమాలలో భాగం చేసింది. అన్నదానం నుంచి అనుకోకుండా ఆపదలో చిక్కుకున్న వారికి సహాయం చేయడం వరకు ఎన్నో చేసింది. తన జీతం మొత్తం కరోనా బాధితుల చికిత్స కోసం విరాళంగా ఇచ్చేది. ఆమె తండ్రి కూడా తన జీతంలోని కొంతమొత్తాన్ని విరాళంగా ఇచ్చేవాడు. ఏ అవసరం ఎప్పుడు వచ్చినా ఫోన్ చేయమంటూ ఎంతోమందికి తన ఫోన్ నంబర్ ఇచ్చింది. అర్ధరాత్రి, అపరాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడు ఫోన్ వచ్చినా పరుగులు తీసేది. బాధితులకు అన్ని రకాలుగా అండగా నిలిచేది. సోషల్ మీడియాలో వేధింపులకు గురవుతున్న 80 మంది అమ్మాయిలకు అండగా నిలిచి, నేరస్థులు అరెస్ట్ అయేలా ఉద్యమించింది. వ్యభిచార కూపంలో చిక్కుకున్న అమ్మాయిలను రక్షించి వారికి పునరావాసం ఏర్పాటయ్యేందుకు కృషి చేసింది. ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల విభాగానికి మనదేశం తరఫున ప్రాతినిధ్యం వహించింది. మహిళా సాధికారత నుంచి మానవ హక్కుల వరకు ఎన్నో కార్యక్రమాలలో క్రియాశీల పాత్ర పోషించిన దీపికకు న్యూయార్క్‌లోని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో మూడోసారి ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. గత రెండు సమావేశాల్లో ‘మానవ హక్కులు–మహిళా హక్కులు’ అంశంపై మాట్లాడి 150 దేశాలకు చెందిన ప్రతినిధుల ద్వారా ప్రశంసలు అందుకుంది. మనసున్న దీపిక ఆటల్లోనూ బంగారం అనిపించుకుంది.‘యూనివర్శిటీ ఆఫ్ దిల్లీ’ లో రెజ్లింగ్, జూడోలలో ఆరుసార్లు బంగారు పతకం గెలుచుకుంది. ఆత్మరక్షణకు సంబంధించి అమ్మాయిల కోసం రకరకాల వర్క్‌షాప్‌లు నిర్వహించింది. -
సివిల్స్‌లో మెరిసిన షాద్‌నగర్ ఆణిముత్యం
షాద్‌నగర్: దేశంలోనే అత్యున్నత సర్వీస్‌గా భావించే సివిల్ సర్వీసెస్ పరీక్షా ఫలితాల్లో జాతీయ స్థాయిలో షాద్‌నగర్ విద్యార్థిని సత్తా చాటింది. పట్టణానికి చెందిన ఇప్పలపల్లి శ్రీశైలం, లక్ష్మి దంపతుల కూతురు సుష్మిత అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 384 ర్యాంకు సాధించింది. గతంలో మూడుసార్లు ఇంటర్వ్యూకు చేరుకున్న ఆమె లక్ష్యాన్ని చేరుకోలేకపోయింది. పట్టువదలకుండా నాలుగోసారి శ్రమించి మంచి ర్యాంకు సాధించింది. ఆమె పదో తరగతి వరకు షాద్‌నగర్ పట్టణంలోని హెరిటేజ్ వ్యాలీలో చదివింది. అనంతరం హైదరాబాద్‌లోని పేజ్ కళాశాలలో ఇంటర్, అండర్ గ్రాడ్యుయేషన్‌ను వరంగల్‌లోలోని నిట్‌లో పూర్తి చేసింది. పబ్లిక్ సర్వీస్‌పై ఆసక్తి పెంచుకున్న ఆమె సివిల్స్‌కు సిద్ధమైంది. నాలుగో ప్రయత్నంలో లక్ష్యాన్ని చేరుకుంది. -
మీ అన్నను మాట్లాడుతున్నాను...
‘‘ఈ గూడుపుఠాణికి గురువు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్రబిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేరదీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వలన ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను’’ అని బాధపడ్డారు మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్. పదవీచ్యుతుడయిన తరువాత ఆయన చేసిన క్యాసెట్లోని భావాలు యథాతథంగా... తమ్ముల్లారా, చెల్లెళ్లారా! ఇదిగో మీ అన్నను మాట్లాడుతున్నాను. శ్రద్ధగా ఆలకించండి. మీ బుద్ధితో ఆలోచించండి. మీ నిర్ణయంతో నన్ను ఆదేశించండి. మీకు తెలుసు ప్రజలే నా దేవుళ్లని, ప్రజాక్షేమమే నా ఊపిరని, ప్రజా సేవే పరమార్థమని. బడుగు ప్రజల అభ్యు న్నతి కోసమే ఈ జీవితం అంకితమని మీకు తెలుసు. అందుకే మీ అండే నాకు కొండంత బలం. మీ చైతన్యమే నా జీవన నాడి. మీరు చెప్పేదే న్యాయం. చేసేదే ధర్మం. కాబట్టి నాటి నుండి నేటి వరకు జరిగిన చరిత్రను మీ ముందు, ప్రజాన్యాయస్థానం ముందు ఉంచుతున్నాను... మంచేదో చెడేదో, నిజమేదో అబద్ధమేదో మీకు తెలియాలని! ఆశయానికీ ఆశకూ, త్యాగానికీ స్వార్థానికీ, నీతికీ అవినీతికీ మధ్య జరుగుతున్న ఈ సమరంలో న్యాయ నిర్ణేతలు మీరు. 1982వ సంవత్సరంలో తెలుగుదేశం పార్టీని స్థాపించాను. ఎందుకు? కళామతల్లి ముద్దుబిడ్డగా, మీ అందరి ఆప్యాయతలను చూరగొన్న అదృష్టవంతుడిగా, భగవంతుని వేషధారణలో పునీతమైన నా జీవితాన్ని రాజకీయాల్లో ఎందుకు ప్రవేశపెట్టాను? ఎందుకు? తెలుగు వెలుగులు దిగంతాలు ప్రసరించాలని. తెలుగువారి ఆత్మ గౌరవం ఆకాశం అంత ఎత్తు ఎదగాలని. తరతరాల దోపిడీలో నలిగి బ్రతుకు భారంగా కృంగి కృశించిపోయిన బడుగు జీవుల కన్నీళ్ళు తుడవాలని ఎముకలు ముక్కలు చేసుకున్నా. ఒక్కపూట గంజికైనా నోచుకోని ఆ కష్టజీవులకు పట్టెడన్నం పెట్టడం కోసం, జాతి జీవనాడులైన అసామాన్య జీవులకు ఓ గూడు కట్టించడం కోసం ప్రజాసేవే పరమార్థంగా ఎంచిన నా ఆదర్శాన్ని మీరు ఆదరించారు. నా మీద విశ్వాసంతో, నా ఆశయాల పట్ల నమ్మకంతో పార్టీ స్థాపించిన తొమ్మిది నెలల్లోనే అపురూపమైన విజయాన్ని అందించారు. 35 ఏళ్ళ కాంగ్రెస్ దుష్ట పరిపాలనకు స్వస్తి చెప్పి, మీ అన్నకు ప్రభుత్వాన్ని అప్పగించారు. అందుకే జనసేవా పథకాలు అమలు చేశాను. బడుగు వర్గాల కోసం లక్షల కొద్దీ ఇళ్ళు నిర్మించాను. రెండు రూపాయలకు కిలో బియ్యం పథకంలో నిరుపేదలకింత అన్నం పెట్టగలిగాను. ఆడపడుచులకు ఆస్తి హక్కును అందించాను. కార్మికులకు, కర్షకులకు ఒకరేమిటి? అన్ని వర్గాల వారిని ఆత్మీయులుగా భావించాను, గౌర వించాను, సత్కరించాను. ఆ తరువాత 1989వ సంవత్సరం ఎన్నికలలో కూడా ప్రజాభిమానం తెలుగుదేశం పట్లే ఉన్నప్పటికీ పార్టీలోని కొందరు స్వార్థపరులు, బడావ్యాపారులు రాజకీయ దళారీలతో కుమ్మక్కై, తమ స్వప్రయోజనాల కోసం పార్టీ శ్రేయస్సును, రాష్ట్ర శ్రేయస్సును విస్మరించి సంకుచిత రాజకీయాలు నడపబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రాలేకపోయింది. 5 సంవత్సరములు ప్రతిపక్షంలో ఉన్నా ప్రజల సమస్య పట్ల తెలుగు దేశం పార్టీ స్పందించింది. 1994లో మళ్ళీ ఎన్నికలు వచ్చినవి. తెలుగుదేశం పార్టీకి 150 సీట్ల కన్నా మించి రావనీ, ఆ 150 మంది శాసనసభ్యులలో ఏ పార్టీకో 50 మందిని ప్రలోభపెట్టి పార్టీని చీల్చి తెలుగుదేశం పార్టీ అధికారాన్ని చేజిక్కించుకోవాలనీ పార్టీలో కొందరు కుట్రదారులు ముందుగా పథకం వేశారు. కానీ వాళ్ళ ఆశలకు విరుద్ధంగా, రాజకీయ పండిత అంచనాలకు మించిన విధంగా అపూర్వమైన విజయాన్ని మీరు నాకు సాధించిపెట్టారు. మీ అన్న మీద ఉన్న విశ్వాసాన్ని మరోసారి మహాద్భుతంగా ప్రకటించారు. 224 సీట్లతో అధికారాన్ని చేపట్టిన తెలుగుదేశం పార్టీ ప్రాభవాన్ని ప్రకటించడం చేతగాని ఆ తెలుగు దేశం వ్యతిరేక శక్తులు కొంతమంది లోలోన గూడుపుఠాణి అవలం బించారు. ఈ గూడుపుఠాణికి గురువు, ఈ కుట్రకు గూడు, ఈ మోసానికి మూలస్తంభం, ఈ పద్మవ్యూహానికి కేంద్ర బిందువు చంద్రబాబునాయుడు. నా అల్లుడనబడుతున్నవాడు. నా గుండెల్లో చిచ్చుపెట్టినవాడు. మీ అందరికీ తెలుసు. తెలుగుదేశం ఆవిర్భవించడానికి ముందు అతనేమిటో! కాంగ్రెస్‌లో ఉండి, తెలుగుదేశం పార్టీని ఎదిరించి నాతోనైనా పోటీ చేస్తానని ప్రగల్భాలు పలికి, తెలుగుదేశం మహా ప్రభంజనంలో కొట్టుకుపోయిన ఒక చిన్న మిడత. తెలుగుదేశం అఖండ విజయం సాధించింది. అధికారానికి వచ్చిన తరువాత అతను పార్టీలో చేరతానని వస్తే, అతనిని పార్టీలో చేర్చుకోవద్దని కొందరు హితవు చెప్పారు. అయినా కానీ అతను పశ్చాత్తాపాన్ని ప్రకటించాడు కదా అని ఔదార్యంతో చేర్చుకున్నాను. తరువాత పార్టీలో ముఖ్యమైన పదవిని ఇచ్చాను. కానీ అతను ప్రజాసేవ కోసం కాక పదవి కోసం తెలుగుదేశం పార్టీలో చేరాడు అనే మర్మాన్ని నేను కనిపెట్టలేకపోయాను. ప్రజాసంక్షేమం, ప్రజా సమస్యలు తప్ప మరేమీ మనసులో ఉండని నేను... అతను కడుతున్న ముఠాలు, చేర దీస్తున్న గ్రూపులను గురించి పట్టించుకోలేదు. అసలు అతనిలో పదవీకాంక్ష ఇంతగా గూడుకట్టుకుందనీ, ఆ కోరిక అతనిని ద్రోహిగా మారుస్తుందనీ, అతని వల్లే ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం తప్పు కోవలసి వస్తుందనీ, అతని వలన ప్రజాభీష్టమే వ్యర్థమవుతుందనీ, ప్రజాస్వామ్యం పట్టపగలే హత్యకు గురవుతుందనీ, అధికారం కోసం ఆ పెద్ద మనిషి ఇంతటి అల్పమైన, నీచమైన, అతి దారుణమైన వెన్నుపోటుకు కూడా సిద్ధపడతాడనీ నేనూహించలేకపోయాను. నాతోనే ఉంటూ, ప్రభుత్వంలో ముఖ్యమైన బాధ్యతలను నిర్వహి స్తూనే చాటుగా, మాటుగా, రహస్యంగా పద్మవ్యూహం పన్నుతాడన్న విషయాన్ని నేను గుర్తించలేకపోయాను. తన పదవీకాంక్షను తీర్చుకోవడం కోసం తండ్రి నుంచి కొడుకును దూరం చేశాడు. తండ్రి పట్ల అంతులేని ఆరాధనాభావం ఉన్నవాడు నా హరి. నిద్రాహారాలు మాని చైతన్యరథాన్ని నడిపిన నా బిడ్డ. తండ్రి కాల్లో ముల్లు గుచ్చుకుంటే తన కంట్లో గుచ్చుకున్నంతగా వాపోయే నా హరిని నాకు దూరం చేశాడు. నా ముందు నిలబడి ఎరగని నా కుమారుణ్ణి నన్నే ఎదిరించి, కవ్వించేందుకు పురిగొల్పాడు. ఒక సాకు, ఒక వంక, ఒక అభియోగం సృష్టించాడు. కార్యకర్తలకు ఏదో అన్యాయం జరిగిందట. ఏమిటి ఆ అన్యాయం? ఎవరికి ఆ అన్యాయం? పార్టీ పట్ల శ్రద్ధాభక్తులతో, అంకిత భావంతో పనిచేసి ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న ఏ కార్యకర్తలకు, ఏ నా తమ్ముళ్ళకు అన్యాయం జరగలేదు. ఒకవేళ ఏదైనా లోటు జరిగితే అది అవకాశ వాదులకే జరిగింది. చంద్రబాబు, ఆ పెద్దమనిషి, ఆ మేక వన్నె పులి, ఆ తేనె పూసిన కత్తి తయారు చేసిన కుట్రదారులకే జరిగింది. నా దేవుళ్ళు ప్రజలు. ఆ ప్రజల ముందుకు ప్రభుత్వాన్ని తీసుకువెళ్ళాలని మరలా నేను పర్యటన ప్రారంభించాను. ఆ పర్యటనలో నాతోనే ఉంటూ, నేనే దేవుణ్ణి అని చెబుతూ, చాపకింద నీళ్ళ లాగా, పుట్టలో తేళ్ళలాగా, పొదల్లో నక్కల్లాగా, కుట్రలు, కుతంత్రాన్ని అల్లారు. మోసాన్ని పోషించారు. ప్రజాప్రభుత్వాన్ని దించడానికి బడా వ్యాపా రుల్ని, రాజకీయ దళారుల్ని, ఈనాడు గోబెల్స్ ప్రచారంలో దిట్టల్ని కూడగట్టారు. ఆగస్టు 23వ తేదీ వరకు నేను ఉత్తరాంధ్ర పర్యటనలో ఉన్నాను. పర్యటన ముగించుకుని నేను హైదరాబాదు తిరిగి వచ్చేలోపే చంద్రబాబు తన కుతంత్రాన్ని అమలు జరపడం ప్రారంభించాడు. పార్టీ సమస్యలను, ప్రభుత్వ విషయాలను చర్చించాలన్న మిషతో శాసనసభ్యులను పిలిపించాడు. 24వ తేదీన ఆ శాసన సభ్యుల్లో కొందరిని వైశ్రాయ్ హోటల్లో నిర్బంధించాడు. 70 మంది ఉంటే 150 మంది ఉన్నారని గోబెల్స్ ప్రచారం చేయించి శాసన సభ్యుల మనస్సును ప్రభావితం చేయించాడు. అమాయకులైన నా తమ్ముళ్ళను, నా శాసనసభ్యులను రకరకాలుగా మభ్యపెట్టి, బడా వ్యాపారుల సాయంతో ప్రలోభపెట్టి, నా దగ్గరకు రావడానికి యత్నించిన వాళ్ళను హోటల్ నుండి బయటకు రానివ్వకుండా రౌడీలను, గూండాలను కాపలా పెట్టి ఆ శాసన సభ్యులందరూ తనకు సపోర్టు అని ప్రచారం చేయించాడు. సిగ్గుచేటు. క్షమించరాని నేరం. వీళ్ళంతా ఇలా ఎందుకు చేశారు? ఎందుకు వెన్నుపోటు పొడిచారు? ఏమిటి... ఏమిటీ ఈ ఎన్టీఆర్ చేసిన తప్పు? ఏమిటీ... ఈ రామారావు చేసిన నేరం? ముఖ్యమంత్రిగా ప్రమాణం స్వీకరించిన మరుక్షణం మద్య నిషేధం ఫైలు మీద సంతకం పెట్టి, ఆడపడుచుల కన్నీళ్ళు తుడవడం తప్పా? కిలో బియ్యం రెండురూపాయలకే ఇవ్వాలని నిర్ణయించడం నా నేరమా? ఏమిటి నేను చేసిన తప్పు? అన్నదాత రైతన్న పంటలు పండించడానికి వాడే విద్యుచ్ఛక్తి సాలుకు హార్స్ పవర్ 50 రూపా యలకే సరఫరా చేయడమా? ఎన్ని కష్టనష్టాలు ఎదురైనా, ఆర్థిక ఇబ్బందులు ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టినా, ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలు చిత్తశుద్ధితో అమలు చేయడమా? ఏ దేవుళ్ళు నాకు అధికారాన్ని ఇచ్చారో ఆ ప్రజల వాకిటికే ప్రభుత్వాన్ని తీసు కెళ్ళడమా? ఏమిటీ నేను చేసిన నేరం? నోరు లేని జనానికి నోరు ఇవ్వడమా? బడుగు, బలహీన వర్గాల్లో రాజకీయ చైతన్యాన్ని రగిలించడమా? ఏ పథకం అమలు ఎలా జరుగుతున్నదో, జరగక పోతే ఎందుకు జరగడం లేదో నిలదీసి అడిగే అవకాశాన్ని, బలాన్ని అట్టడుగు వర్గాలకు అందించడమా? ఇవేమీ కావు. ఆ పెద్ద మనుష్యుల దృష్టిలో నా నేరం వాళ్ళ స్వార్థాలకు ఎన్టీఆర్ ఉపయోగ పడక పోవడం. బడావ్యాపారుల, సారాజుల చేతుల్లో కీలుబొమ్మ ప్రభుత్వం కాకపోవడం! దళారీలు, పవర్ బ్రోకర్స్‌కు ఆస్కారం లేకపోవడం... ఇవి నేను చేసిన నేరాలు. మరి వాళ్ళు పెద్ద మనుష్యులు! ప్రజాస్వామ్య రక్షకులట! రక్షకులా? కాదు, భక్షకులు. ధనకాంక్షతో, పదవీ వ్యామోహంతో, పెడదారులు పట్టిన వీరు స్వప్రయోజనాలు తప్ప ప్రజల గురించి ఏనాడూ ఆలోచించని ఈ స్వార్థపరులు ప్రజా ప్రయోజనాలు సాధిస్తారా? ప్రజాభిమతాన్ని తలక్రిందులు చేసిన వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తారా? అంకిత భావంతో ప్రజాసేవ చేస్తారా? ఇంత నీచానికి ఒడిగట్టిన చంద్ర బాబు... ఎన్టీఆర్ మా దేవుడు, ఆయన విధానాలే అమలు జరుపు తానంటాడు. చేతులు జోడించి నమస్కారం చేసి, తుపాకీ పేల్చిన గాంధీ మహాత్ముని పొట్టన పెట్టుకున్న గాడ్సే కన్నా మించిన హంత కుడు. పదవి ఉన్నా లేకపోయినా నేను ప్రజల మనిషిని. చివరి రక్తపు బొట్టు వరకు, ప్రజాసేవే పరమార్థంగా ఈ జీవితాన్ని సాగిస్తాను. ప్రజలే నా దేవుళ్ళు. ప్రజల హృదయమే నా దేవాలయం. ఈ వెన్నుపోటు తగిలింది నాకు మాత్రమే కాదు. ప్రజలకు, మీకు మీరు వేసిన ఓటుకు. మీరు నమ్మిన ప్రజాస్వామ్యానికి. మీరు విశ్వసించిన ఆశయాలకు, ఆధర్మాలకు ఈ వెన్నుపోటు. ఈ విఘాతం. తమ్ముళ్ళూ! చెల్లెళ్ళూ! ఇప్పుడు ఆలోచించండి. మీరు నాకు అండ. మీకు నా కైదండ. కుట్రదారులకు బుద్ధి చెప్పండి. దగాకోరులకు తగిన శాస్తి చేయండి. లాలూచీదారుల ఆటలు కట్టించండి. విశ్లేషణ డాక్టర్ నందమూరి లక్ష్మీపార్వతి ‘తెలుగుతేజం (ఎన్టీఆర్ రాజకీయం జీవితం)’ పుస్తకంలోని ‘జామాతా – దశమ గ్రహః’ అధ్యాయం లోంచి. -
టీఎఫ్‌సీఓ.. ప్రజాసేవలో 11 వసంతాలు
గోల్కొండ: 11 ఏళ్లుగా పేద బడుగు వర్గాలకు, వితంతువులకు సేవలు అందిస్తున్నామని తెలంగాణ ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఆర్గనైజేషన్ రాష్ట్ర చైర్మన్ మహ్మద్ నజీబ్ అన్నారు. ఆర్గనైజేషన్ స్థాపించి 11 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా గురువారం ఆయన టోలిచౌకిలోని తన కార్యాలయంలో వితంతువులు, వృద్ధమహిళలకు నిత్యావసరాలు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 11 ఏళ్లలో ఇప్పటి వరకు 4వేల మంది జంటలు, కుటుంబాలకు విజయవంతంగా కౌన్సెలింగ్ నిర్వహించి వారిని కలిపినట్లు చెప్పారు. అంతేగాకుండా 150 మంది వితంతువులు, వికలాంగులకు ప్రతినెలా నిత్యావసరాలు అందిస్తున్నామన్నారు. కరోనా విజృంభించిన సమయంలో కోవిడ్–19 పాజిటివ్ వారికి ఉచిత అంబులెన్స్ సర్వీస్ ఇవ్వడంతో పాటు ఉచిత ఆక్సిజన్ సిలిండర్లు సరఫరా చేశామన్నారు. మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. -
Narendra Modi: అధికార పీఠంపై 20 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ పదవిలో బాధ్యతలు స్వీకరించి నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠానెక్కారు. అనంతరం 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తదనంతరం 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఏడేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో పనిచేయడం ఆరంభించి నేటికి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ పదవుల్లో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానిగా వచి్చన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు విస్తృత చర్చలకు కేంద్రబిందువులయ్యాయి. అలాంటి కొన్ని నిర్ణయాలు క్లుప్తంగా... ► నోట్లరద్దు: 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం గురించి ప్రస్తావించిన మోదీ ప్రధానైన రెండేళ్లకు 2016 నవంబర్ 8 వతేదీ రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ► సర్జికల్ స్ట్రైక్స్: 2016 సెపె్టంబర్ 18న జమ్మూ కాశీ్మర్ ఉరి సెక్టార్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం పొందగా, 30 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఈదాడికి ప్రతికారంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2016 సెపె్టంబర్ 28న భారత సైన్యంలోని 25మంది పారా కమాండోలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై సర్జికల్ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించారు. ► వైమానిక దాడి: 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశీ్మర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో40 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతిగా మోదీ ఆదేశాల మేరకు2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశీ్మర్లో వైమానిక దాడి చేసింది. ఇందులో 300–400 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ► ఆర్టీకల్ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని మోదీ 2019 ఆగస్టు 5న రద్దుచేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు ఏర్పాటు చేశారు. నిర్ణయానంతరం రాష్ట్రంలో ఎలాంటి హింస జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. ► ముస్లిం మహిళా వివాహ హక్కు రక్షణ: 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించింది. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 28న ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017 ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కానీ రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వం మరోసారి లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించింది. ► నూతన విద్యా విధానం: 1986 తరువాత దేశంలో మొదటిసారిగా ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న ప్రకటించింది. ఇందులోభాగంగా 2030 నాటికి దేశంలో 100% స్థూల నమోదు నిష్పత్తిని సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. స్థానిక, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యను, ఉన్నత విద్యాసంస్థల్లో ఏకరీతి విద్యను అందించేందుకు ఈ విధానంలో ప్రాధాన్యత ఇచ్చారు. ► స్వచ్ఛ భారత్ అభియాన్: 2014 గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ అభియాన్‌ను మోదీ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రతే ఈ మిషన్ లక్ష్యం. మిషన్ కోసంపరిశుభ్రత పన్ను అంటే సెస్ కూడా తీసుకువచ్చారు. ► జన్ ధన్ యోజన: దేశంలో అందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశ్యంతో 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం రోజున 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో 20 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ► ఆయుష్మాన్ భారత్: దేశంలోని పేదలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు 2018 సెపె్టంబర్ 23న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పేదల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కేంద్రం అందిస్తుంది. ► అంతర్జాతీయ యోగా దినోత్సవం: 2014 సెప్టె ంబర్ 27న మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించి జూన్ 21ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించింది. -
వెక్కిరించిన వారే గెలిపించారు
ఆమెను చూసి నేషనల్ మీడియా కూడా మెచ్చుకుంటోంది. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు... ఊరినెలా చూసుకుంటావు’ అన్నారు ఆమె మొదటిసారి సర్పంచ్‌గా పోటీ చేసినప్పుడు ఊరి వాళ్లు. అయినా ప్రజా సేవకు తన శారీరక పరిమితులు అడ్డం కావు అనుకుంది నాసిక్‌కు చెందిన కవితా భోండ్వే. ఆమె పని చేయడం మొదలెట్టింది. మార్పును చూపించింది. వెక్కిరించిన నోళ్లు మెచ్చుకోళ్లు మెదలెట్టాయి. అంతేనా? రెండోసారి ఆమెను సర్పంచ్‌గా గెలిపించాయి. గత తొమ్మిదేళ్లుగా సర్పంచ్‌గా ఉన్న కవితా భోండ్వే స్ఫూర్తిగాధ ఇది. తండ్రి 15 ఏళ్ల పాటు పంచాయతీ మెంబర్‌గా ఉన్నాడు. ఉన్నాడు కాని మెల్లమెల్లగా తనకు చదువు రాకపోవడం పంచాయతీ వ్యవహారాల్లో అవరోధంగా మారుతోందని గ్రహించాడు. 2011 సంవత్సరం అది. మహారాష్ట్ర నాసిక్ జిల్లాలోని దిందోరి తాలుకాలో రెండు గ్రామాలకు (దెహెగావ్, వాల్గాగ్) సర్పంచ్ ఎన్నికలు వస్తున్నాయి. తన కుమార్తె చదువుకుంది. ఆమెను సర్పంచ్‌గా నిలబెడితే? అనుకున్నాడు. కాని ఆ అమ్మాయికి కుడి కాలికి పోలియో ఉంది. ‘ఏమ్మా పోటీ చేస్తావా?’ అని అడిగాడు ఆ తండ్రి పుండలిక్ భోండ్వే. ‘పోటీ చేస్తాను నాన్నా’ అంది కూతురు కవితా భోండ్వే. ఆ సమయానికి కవిత వయసు 25. అంత చిన్న వయసులో ఆ ప్రాంతంలో ఎవరూ సర్పంచ్ కాలేదు. అందునా స్త్రీ కాలేదు. పైగా శారీరక పరిమితులు ఉన్నవారు అసలే కాలేదు. రెండు ఊళ్లలోనూ ఈ విషయం పెద్ద వేళాకోళంగా మారింది. మగవారు దీనిని సహించలేకపోయారు. ‘నిన్ను నువ్వు సరిగ్గా చూసుకోలేవు. ఊళ్లను ఏం చూస్తావు?’ అని ప్రశ్నించారు. కవిత గంభీరంగా ఆ హేళనను భరించింది. తన ప్రచారం కొనసాగించింది. మెల్లమెల్లగా చాలామంది స్త్రీలు ఆమె పట్టుదలను గమనించారు. ఊరి మగవారు కూడా కొందరు మద్దతుగా నిలిచారు. సర్పంచ్‌గా ఆమె గెలిచింది. ‘వెక్కిరింతలను ఏమాత్రం మనసులోకి తీసుకోకపోవడం వల్లే నేను ముందుకు వెళ్లగలిగాను’ అని కవిత అంటోంది. కవిత పదవిలోకి వచ్చే సరికి ఊళ్లో ఆకతాయిల ఆట సాగుతోంది. కొన్ని సంఘ వ్యతిరేకమైన పనులు సాగుతున్నాయి. వాటిని మొదట నిలువరించింది ఆమె. ఆ తర్వాత రెండు ఊళ్లలోనూ బాలికల చదువు గురించి, రోడ్ల గురించి, మరుగుదొడ్ల గురించి, కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా మంజూరయ్యే ఇళ్ల గురించి పని చేసింది. అవినీతి ఊసు లేకుండా సర్పంచ్ అనే దాష్టీకం లేకుండా హుందాగా పని చేస్తున్న కవితా అతి త్వరగా జనానికి దగ్గరయ్యింది. ‘చిన్న వయసులో సర్పంచ్ అయ్యానని అక్కసు పడ్డవాళ్లు కూడా మెల్లగా నన్ను గుర్తించడం మొదలెట్టారు’ అని కవితా అంది. పదవిలో ఉన్న ఐదేళ్లు కవితకు ఒకటే పని. ఉదయాన్నే సోదరుడు ఆమెను బైక్ మీద దింపితే పంచాయతీ ఆఫీస్‌కు వస్తుంది. పనులు చూసుకుంటుంది. వచ్చినవారి ఇబ్బందులు వింటుంది. జరిగే పనుల అజమాయిషీకి బయలుదేరుతుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. మళ్లీ ఎలక్షన్లు వచ్చాయి. ఈసారి ఎలక్షన్లు జరగలేదు. ఎందుకంటే కవితనే ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. 34 ఏళ్ల కవిత 9 ఏళ్లుగా సర్పంచ్‌గా పని చేస్తూ మంచి పేరు తెచ్చుకుంది. ఆమె నడక మెల్లగా ఉండవచ్చు. కాని ఆమె సంకల్పం, చిత్తశుద్ధి, అంకితభావం, నిజాయితీ అత్యంత వేగవంతమైనవి. తన రెండు ఊళ్లలో ఆమె స్వయం ఉపాధి గ్రూపులను స్థాపించి స్త్రీల స్వావలంబన కోసం ప్రయత్నిస్తోంది. కవితకు చెట్లు నాటించడం ఇష్టం. గ్రామాల్లో పచ్చదనం కోసం కృషి చేస్తోంది. బహుశా మరికొన్నేళ్లు ఆమె సర్పంచ్‌గా ఏకగ్రీవంగా ఎన్నికవుతూ రావొచ్చు. ఎందుకంటే ఆ పాలనలో నీడ ప్రజలకు అంత చల్లగా ఉంది. -
ఇప్పుడు వీస్తున్న సైన్స్ గాలి
సందర్భం జీవితమంతా పరిశోధనల్లో గడిపిన సైంటిస్టులు శాస్త్ర జ్ఞానాన్ని సామాన్యులకు అర్థం చేయించేందుకు ప్రజలముందుకు రావడం విశేషం. రిచర్డ్ డాకిన్స్, నీల్ డి గ్రాస్, మైకల్ షెర్మర్ ఈ విషయంలో ఆదర్శనీయులు. ఇటీవల సైంటిస్టులు గణనీయమైన ప్రజాసేవ చేస్తున్నారు. జటిలమైన వైజ్ఞానిక పరిశోధనా ఫలితాలు పల్లెటూరి రైతులకు సైతం అర్థమయ్యేటట్టు వివరిస్తున్నారు. పరిశోధనాలయాల్లో జీవితమంతా గడిపిన సైంటిస్టులు ఇలా ప్రజల మధ్యకు రావడం చెప్పుకోదగిన అంశం. అమెరికా, యూరోప్, ఆస్ట్రేలియాలో ఈ వినూత్న మార్పు అనుసరించదగింది. ఇందులో ముఖ్యాంశాలు చూద్దాం. రిచర్డ్ డాకిన్స్, నీల్ డి గ్రాస్, మైకల్ షెర్మర్ లను ఈ విషయంలో ఆదర్శంగా తీసుకోవచ్చు. కేవలం పుస్తకాలు రాయడం కాక, కేసెట్లు తయారు చేసి వెబ్సైట్లో పెట్టి, యూట్యూబ్‌ల ద్వారా విజ్ఞానాన్ని వెదజల్లుతున్నారు. అది ప్రజాకర్షణగా మారింది. రిచర్డ్ డాకిన్స్ పరిణామ సిద్ధాంతాన్ని పెద్దలతోపాటు పిల్లల దగ్గరకూ తెచ్చారు. ది మ్యాజిక్ ఆఫ్ రియాలిటీ రాసి, బొమ్మలతో సహా పరిణామ క్రమాన్ని, విశ్వరహస్యాలను తేటతెల్లం చేశారు. విశ్వాన్ని, సృష్టిని వివరించడానికి పూర్వకాలం నుంచీ ప్రయత్నాలు జరి గాయి. వాటినే ఇప్పుడు డాకిన్స్ వైజ్ఞానిక వివరణతో ప్రజల మధ్యకు వచ్చారు. మాజిక్ ఆఫ్ రియాలిటీ అనే గ్రంథం చక్కని బొమ్మలతో ప్రచురించారు. డేవ్ మెకీన్ వీటికి అనుగుణంగా బొమ్మలు సమకూర్చారు. హైస్కూలు పిల్లలకు అరటిపండు ఒలిచిపెట్టినట్లుంది ఈ వివరణ. లోగడ మన పూర్వీకులు కథలుగా రాసి, నమ్మి, ఆచరించిన వాటికే ఇప్పుడు ఆధారాలతో అర్థమయ్యేట్టు చూపారు. అదీ విజ్ఞాన సేవ. పరిణామ సిద్ధాంత నిపుణుడుగా పేరొందిన రిచర్డ్ డాకిన్స్ రచనలన్నీ మనలోని అజ్ఞానాన్ని తొలగించి, వివరణ ఇస్తాయి. పరిణామం అంటే కోతి నుంచి మనిషి ప్రసవించడం కాదని క్రమక్రమంగా అన్ని జీవుల్లో జరిగే మార్పు అని సోదాహరణంగా చూపారు. హైస్కూలు స్థాయి పిల్లలు ఇవి చదివితే అసలు విషయాలు తెలిసి పరిణామ క్రమం తేటతెల్లమవుతుంది. అవి సిలబస్‌లో ప్రవేశపెడితే ఇంకా బాగుంటుంది. మరొక ఖగోళ శాస్త్రజ్ఞుడు నీల్ డి గ్రాస్ ప్రస్తుతం హైడెన్ పరిశోధనాలయం డైరెక్టర్‌గా ఉంటూ, విశ్వ రహస్యాలకు శాస్త్రీయ ఆధారాలతో జనం ముందుకు వచ్చారు. అనేక సభలు పెట్టి ప్రసంగాలు చేస్తున్నారు. వీడియోలు, ఆడియోలు, సౌండ్ ట్రాక్‌లు బయటపెట్టారు. విశ్వం గురించి మనకున్న భ్రమలు తొలగించి, విజ్ఞానం ఏం చెబుతున్నదో వివరిస్తున్నారు. హాస్య పూరితమైన ఆయన ప్రసంగాలు వింటే విశ్వరహస్యాలు సులభంగా ఆకళింపు అవుతాయి. లోగడ కార్ల్ శాగన్ విశ్వం గురించి పరిశోధించి ప్రజలకు చెప్పిన అంశాలనే ప్రస్తుతం నీల్ డి గ్రాస్ కొనసాగిస్తున్నారు. మాకు తీరిక లేదు అనేవాళ్లు గబగబా చదివి అర్థం చేసుకునేటట్టు రాశారు. మరొక ప్రముఖ సైంటిస్టు మైకల్ షెర్మర్ బిలీవింగ్ బ్రెయిన్ (Believing Brain) అనీ, ‘హెవెన్స్ ఆన్ ఎర్త్’ అనీ రాశారు. సర్వసాధారణంగా నమ్మే ఆత్మ గురించి గొప్ప వివరణ ఇచ్చి, విజ్ఞాన శాస్త్రం ఏం చెబుతున్నదో తెలియపరిచారు. వీరంతా పుస్తకాలు రాసి, క్యాసెట్లతో ఊరుకోక, ఊరూరూ తిరిగి ప్రచారం చేయడం నిజమైన విజ్ఞాన సేవ. ఆత్మ గురించి షెర్మర్ ఇంతగా పరిశీలించి శాస్త్రీయంగా కనువిప్పు కలిగించడం గొప్ప విషయం. ఇవన్నీ మతాలను తిట్టడానికో, మూఢనమ్మకాలను ఖండించడానికో కాదు. జనంలో ఉండే బహుళ ప్రచా రం పొందినవాటిని వైజ్ఞానికంగా విప్పిచెప్పడం వలన చదువుకున్న నమ్మకస్తులకు సైతం కనువిప్పు అవుతుంది. మనలో చాలామంది ఒక్కొక్క రంగంలో ప్రజ్ఞావంతులు కావచ్చు. మిగిలిన శాస్త్ర విభాగాలలో ఏం జరుగుతున్నదో తెలియక మూఢనమ్మకాలకు మొగ్గుతుంటారు. ఆ లోపాన్ని ఈ శాస్త్రజ్ఞులు తొలగించారు. వైజ్ఞానిక రంగంలో ఒక పరిధిలో నిపుణుడు కావడానికే ఎంతో కాలం పడుతుంది. అన్ని రంగాలూ తెలియడం చాలా దుర్లభం. ఆ లోపం పూరించడానికే ఫిలాసఫీ ఆఫ్ సైన్స్ కావాలి అన్నాడు ఎం.ఎన్. రాయ్ (మానవేంద్రనాథ్ రాయ్). ఇప్పుడు ఈ శాస్త్రజ్ఞులు సరిగ్గా అలాంటి కృషే చేస్తున్నారు. భారతదేశంలో ఇలాంటి కృషి చాలా అవసరం. శాస్త్రజ్ఞులు పి.ఎం. భార్గవ వలే తమకు తెలిసిన విజ్ఞానాన్ని సులభంగా అర్థమయ్యేటట్టు చెప్పాలి. దాన్ని తప్పకుండా సిలబస్‌లోకి తీసుకురావాలి. లోగడ ఐజాక్ అసిమోవ్, కార్ల్ శాగన్, రేనీ డ్యూబా, పాల్ కర్జ్, ఎం.ఎన్. రాయ్ చేసిన కృషి నిజమైన ప్రజాసేవ. కేవలం ఖండన మండనలు గాక, విషయాన్ని పోల్చి చెప్పాలి. ఉదాహరణకు జ్యోతి ష్యాన్ని ఖండించే బదులు, పక్కపక్కనే ఖగోళ శాస్త్రం రుజువులతో ఏమి చెబుతున్నదీ పట్టికవేసి చూపవచ్చు. అలాంటి పని వాస్తుకూ అన్వయించి, భవన నిర్మాణ శాస్త్రంతో పోల్చి చెప్పవచ్చు. విషయం తేటతెల్లమవుతుంది. మొత్తం మీద విజ్ఞానాన్ని రుజువులతో కూడిన పరిశోధనలను సామాన్యులకు అందించడం శాస్త్రవేత్తల కర్తవ్యం. - నరిశెట్టి ఇన్నయ్య వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు ఈ–మెయిల్ : innaaiah@gmail.com -
ప్రజలకు మరింతగా పోలీస్ సేవలు
విజయనగరం టౌన్: జిల్లా పోలీస్ శాఖ ప్రజలకు మరింతగా సేవలందించేందుకు పోలీస్ కమాండ్ కంట్రోల్ ఎంతగానో ఉపయోగపడుతుందని కలెక్టర్ వివేక్‌యాదవ్ పేర్కొన్నారు. కలెక్టరేట్ సమీపంలో, పోలీస్ క్వార్టర్స్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ వెబ్‌సైట్‌ను, పోలీస్ కమాండ్ కంట్రోల్ రూమ్‌ను శుక్రవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పోలీసు శాఖ సాంకేతిక పరంగా ఎంతగానో ముందుకు వెళ్తుందన్నారు. గతంలో విజయవాడ డీసీపీగా పని చేసిన కాలంలో పోలీస్ వ్యవస్థలో సీసీటీఎన్ఎస్, పోలీస్ డ్యాష్‌బోర్డ్, పోలీస్ ఈ రక్షక్, ఈ చలానా ప్రారంభించారని, అదే విధంగా జిల్లా పోలీసు శాఖలో కమాండ్ కంట్రోల్ ఏర్పాటు చేసి, జిల్లా పోలీసులు నిర్వహించే అనేకమైన విధులను, సమాచారాన్ని కంప్యూటరీకరించడంలో ఎస్పీ జి.పాలరాజు విశేష కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా, దేశ వ్యాప్తంగా డేటాబేస్ ఇంటిగ్రేషన్ చాలా ప్రచారంలోకి వచ్చిందన్నారు. ఈ వ్యవస్ధ అందుబాటులో రావడం వల్ల ప్రజలు పోలీసుల సేవలను సులభంగా పొందవచ్చన్నారు. ఐడియల్ పోలీసింగ్ జిల్లా వ్యాప్తంగా అబివృద్ధిపరిచేందుకు చేస్తున్న కృషి అమోఘమన్నారు. ఎస్పీ పాలరాజు మాట్లాడుతూ కమాండ్ కంట్రోల్‌ను అందుబాటులోకి తీసుకుని రావడం వల్ల పోలీస్ శాఖ 54 సర్వీసులను ప్రజలు సులభంగా పొందవచ్చన్నారు. పోలీసులకు చేసే ఫిర్యాదులు, డయల్ 100 కాల్స్, కోర్టు కేసుల స్థితిని ఎప్పటికప్పుడు ఏ స్థితిలో ఉన్నాయో తెలుసుకోవచ్చన్నారు. అంతేకాకుండా, జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసే సీసీ కెమెరాలను ఈ కమాండ్ కంట్రోల్‌కు అనుసంధానం చేశారన్నారు. సీసీ కెమెరాల ద్వారా అక్కడ జరుగుతున్న దృశ్యాలను లైవ్‌లోనే కమాండ్ కంట్రోల్ ద్వారా పర్యవేక్షించవచ్చన్నారు. జిల్లా వ్యాప్తంగా నేరస్తులు, కేసుల, కోర్టు కేసుల వివరాలు, పాస్‌పోర్టు వెరిఫికేషన్, ఈ చలానులు, ఈ డీఎస్ఆర్లు అందుబాటులోకి రానున్నాయన్నారు. వృద్ధమిత్ర, మహిళా రక్షక్, దత్తత పాఠశాలలు, పోలీసు శాఖ చేపట్టే అన్ని సామాజిక కార్యక్రమాల వివరాలను ఈ వెబ్సైట్లో పొందుపరుస్తామన్నారు. ఈ వ్యవస్థ ద్వారా రాష్ట్రంలో ఇక్కడి నుంచి ఎక్కడికైనా అధికారులతో నేరుగా మాట్లాడుకోవచ్చని, కేసుల దర్యాప్తును కమాండ్ కంట్రోల్ నుంచే పర్యవేక్షించవచ్చున్నారు. జిల్లా పోలీసు శాఖ అందించే సిటిజన్ సర్వీసులను పోలీస్ వెబ్సైట్ విజయనగరంపోలీస్.ఇన్ పరిశీలించి తెలుసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా ప్రాంగణంలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఓఎస్డీ విక్రాంత్ పాటిల్, అదనపు ఎస్పీ అట్టాడ వెంకటరమణ, పార్వతీపురం ఏఎస్పీ దీపికా ఎం.పాటిల్, డీఎస్పీలు, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఇష్టం లేనివారు వెళ్లిపోవచ్చు
వైద్య శాఖ అధికారుల సమీక్షలో కలెక్టర్ ప్రశాంత్ జీవన్పాటెల్ కాళోజీ సెంటర్ : ప్రభుత్వ సర్వీసుల్లో సేవ చేయడం ఇష్టం లేని వారు స్వచ్ఛందగా వెళ్లిపోవచ్చని కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ అన్నారు. మంçగళవారం కలెక్టరేట్ కార్యాలయలో వైద్య ఆరోగ్యశాఖ అధికారులు, పీహెచ్‌పీ డాక్టర్లతో జిల్లాలో అందుతున్న వైద్య సేవలపై సమీక్షించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పీహెచ్సీలో మెరుగైన వైద్య సేవలు అందిస్తు ప్రభుత్వం ఆస్పత్రులపై ప్రజలకు నమ్మకం కలిగే విధంగా వైద్యుల పనిచేయాలన్నారు. కొన్ని చోట్ల డాక్టర్లు విధుల్లో పూర్తిగా నిర్లక్ష్యం వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రగతి విషయంలో పూర్తిగా వెనుక బడిన బానోజీపేట పీహెచ్పీలోని ఇద్దరు వైద్యాధికారులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని డీఎంహెచ్ఓను కలెక్టర్ ఆదేశించారు. అదేవిధంగా మేడేపల్లి, అలాంకార్పేట, నల్లబెల్లి, పీహెచ్‌సీల పనితీరు సక్రమంగా లేదన్నారు. సమావేశంలో డీఎంహెచ్ఓ డాక్టర్ అశోక్అనంద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ అనురాధ, వెంకటరమణ, పీహెచ్‌సీల వైద్యాధికారులు పాల్గొన్నారు. చెరువు కట్టలపై మొక్కలు నాటాలి.. హరితహారం కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని ప్రతీ మండలంలో ఉన్న చెరువు కట్టలపై మొక్కలను నాటాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్‌జీవన్‌పాటిల్ అదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారులతో హరితహారం కార్యక్రమంపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ చెరువులను ఇరిగేషన్, ఎక్సైజ్‌శాఖలకు సమానంగా కేటాయించడంతో పాటు, చెరువు కట్టలపై ఈత, తాటి, కర్జూర మొక్కలు నాటే విధంగా కార్యచరణ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో డీఎఫ్ఓ పురుషోత్తం, ఇరిగేషన్ ఎస్ఈ శ్రీనివాస్‌రెడ్డి, ఎక్సైజ్ సూపరింటెండెంట్ కిషన్, డీఆర్డీఓ శేఖర్‌రెడ్డి, ఆర్డీఓ మహేందర్‌జీ, రవి పాల్గొన్నారు. -
యువతను ప్రజాసేవలో భాగస్వాములను చేయాలి
అధికారులకు కలెక్టర్ శశిధర్ సూచన అనంతపురం అర్బన్ : యువతని, విద్యార్థులను రెడ్‌క్రాస్‌లో సభ్యులుగా చేర్చి, ప్రజాసేవలో భాగస్వాములను చేయాలని ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ అధ్యక్షుడు, కలెక్టర్, కోన శశిధర్ అధికారులకు సూచించారు. ఆదివారం కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ జిల్లా కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ లాభాపేక్ష లేకుండా ప్రజాసేవే లక్ష్యంగా రెడ్‌క్రాస్ సంస్థ పనిచేస్తోందన్నారు. జిల్లాలో 800 మంది సభ్యులు ఉన్నారన్నారు. రెడ్‌క్రాస్ ద్వారా సేవా కార్యక్రమాలను విస్తృతం చేయాలనే సంకల్పంతో జూనియర్, యూత్ రెడ్‌క్రాస్ చాప్టర్లను పాఠశాల, కళాశాలల్లో ఏర్పాటు చేయాలని నిర్ణయించామన్నారు. 8వ తరగతి నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులతో జూనియర్ రెడ్ క్రాస్, డిగ్రీ, పీజీ విద్యార్థులతో యూత్ రెడ్‌క్రాస్ ఏర్పాటు చేస్తామన్నారు. సోమవారం నుంచే విద్యార్థులను సభ్యులుగా నమోదు చేసే ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశామన్నారు. ఈ నెల 22న రాష్ట్ర కమిటీ చైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేఛల్ ఛటర్జీ జిల్లాలో పర్యటించే అవకాశం ఉందని ఈ లోగా ప్ర క్రియ వేగవంతం చేయాలన్నారు. -
ప్రజా సేవకే అంకితం కావాలి
♦ సర్పంచ్‌లు వెల్ఫేర్ రోల్‌గా మార్పు చెందాలి ♦ ప్రజాప్రతినిధులతో గవర్నర్ ముఖాముఖి సిద్దిపేట జోన్: ‘ప్రజాప్రతినిధులు.. ప్రజా సేవకే అంకితం కావాలి.ప్రజలందరినీ భాగస్వాములను చేసుకుని కలిసి పనిచేయాలి. అభివృద్ధి సాధించాలి’ అని గవర్నర్ నరింహన్ అన్నారు. శుక్రవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో నాగుల బండ శివారులోని నర్సరీ వద్ద ముఖాముఖి నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి ముందుగా ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడారు. వారి మాటల్లోనే... హరీష్‌రావు : గవర్నర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రగతిని పరిశీలించడానికి వచ్చారు. కొందరి ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడాలను కుంటున్నారు. మీలో ఎవరైన ముందుకు రండి అనగానే సర్పంచ్ ఆంజనేయులు వేదిక మీదకు వచ్చారు. గవర్నర్ పలు ప్రశ్నలు అడిగారు. గవర్నర్ : మీ పేరు, ఏ గ్రామం? ఆంజనేయులు : గుర్రాలగొంది సర్పంచ్‌ను, నా పేరు ఆంజనేయులు గవర్నర్ : హరితహారం కింద గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు? ఆంజనేయులు : ప్రస్తుతం 25వేల మొక్కలు నాటాం, లక్ష లక్ష్యంతో ప్రణాళిక రూపొదించాం. గవర్నర్ : మొక్క విలువ తెలుసా? మొక్కను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం కూడా ముఖ్యమైన బాధ్యత, వైఫల్యం చెందింతే జరిమానా విధిస్తా. డిసెంబర్లో మొక్కల లెక్క చూస్తా తక్కువగా ఉంటే జరిమానా తప్పదు మరీ. అంటూ సీరియస్‌గా ప్లాన్ చేసుకోవాలి. ఆంజనేయులు : మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు నాటిన ప్రతి మొక్కను సమష్టిగా కాపాడుకుంటున్నాం. గవర్నర్ : గత ఏడాది గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు. ఆంజనేయులు : 34 వేల మొక్కలు నాటగా, వాటిలో 22 వేలు మొక్కలు బతికాయి. గవర్నర్ : మిగత వాటి మాటమేమిటి ? ఈ సారి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి. అంటునే మహిళ ప్రజా ప్రతినిధి ఒకరు ముందుకు రావాలని సూచించ గా రామంచకు చెందిన ఎంపీటీసీ విజయదేవి వేదిక మీదకు వచ్చారు. గవర్నర్ : ప్రస్తుతం మహిళా సర్పంచ్ల కాలం నడుస్తోంది. ఇప్పటి వరకు ఇబ్రహీంపూర్ సందర్శించా అక్కడి మహిళ సర్పంచ్ పనితీరు ఆదర్శనీయం. మీ గ్రామం కూడా ఇబ్రహీంపూర్ మాదిరిగా అభివృద్ధి చెందాలి. ఎంపీటీసీ: మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం. గవర్నర్ : సర్పంచ్ రోల్ చాల గొప్పది. సర్పంచ్ అనగానే రాజకీయాలు అనుకోవద్దు. సర్వీస్, సంక్షేమ భావంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రజలందరినీ కలుపుకుని వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలి. కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సర్పంచ్ల స్టోరీ మారింది. నేటి నుంచి కొత్త స్టోరిగా మారాలి. పొలిటికల్ రోల్ నుంచి వేల్ఫేర్ రోల్ దిశగా సర్పంచ్‌లు సాగాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఉపాధి కల్పనా, హరితహారం లాంటివి చేపట్టాలి. గ్రామంలో పనిలేకుండా ఎవ్వరూ ఉండరాదు. ఆ దిశగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సర్వీస్ రోల్‌తో మంచి పేరును సాధించుకోండి ఇప్పటికే మీ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుంది. మీ మంత్రి హరీష్‌రావు అనుకున్నది సాధిస్తాడు. గ్రామంలో బడి వయస్సు కలిగిన పిల్లలు ఇళ్లల్లో ఉండరాదు, అక్షరాస్యత శాతం పెంచాలి. ఈ ముఖాముఖిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, రాష్ట్ర హరితహారం పథకం ఇన్చార్జి ప్రియాంక నర్గీస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు. -
మంత్రులు... మహారాజులు
* ఐదేళ్లలో ఆస్తులు రెండింతలు * మహిళల్లో వలర్మతికి ప్రథమస్థానం చెన్నై, సాక్షి ప్రతినిధి: ప్రజా సేవ కోసమే రాజకీయాల్లోకి వచ్చే నేతల రోజులు పోయాయి. అలాగే ఎమ్మెల్యేలు, మంత్రులు సేవ చేసేందుకే ఉన్నారని ప్రజలు సైతం నమ్మే రోజులు అంతరించిపోయాయి. రాజకీయాలు, కోట్లు కుమ్మరించి ఎన్నికల్లో గెలవడం అంతకు రెట్టింపు సంపాదించుకోవడం కోసమేనని తమిళ మంత్రులు మరోసారి రుజువుచేశారు. అన్నాడీఎంకే అభ్యర్దులుగా నామినేషన్ వేసిన మంత్రి పుంగవులంతా తమ ఆస్తులను ప్రకటించారు. 2011 నాటి ఎన్నికల్లో పేర్కొన్న ఆస్తుల చిట్టాలో పోల్చుకుంటే ఎక్కువశాతం మంత్రులు మరింత ఆస్తి పరులైనారు. పురుష మంత్రుల్లో రూ.13.55 కోట్లతో మంత్రి వెంకటాచలం, మహిళా మంత్రుల్లో వలర్మతి రూ.8.92 కోట్ల ఆస్తులతో ప్రధమ స్థానం పొందారు. మంత్రి ఎడపాడి పళని స్వామి: 2011-రూ.65.15 లక్షలు, 2016-రూ.7.77 కోట్లు. మంత్రి తంగమణి: 2011-రూ.75.52 లక్షలు 2016-రూ.1.57 కోట్లు. మంత్రి పళనియప్పన్: 2011-రూ.29.69 లక్షలు, 2016- రూ.2.50 కోట్లు. మంత్రి సంపత్: 2011- రూ.2.08 కోట్లు, 2016-రూ.4.87 కోట్లు. మంత్రి ఎస్పీ షణ్ముగనాధన్: 2011- రూ.8.60 లక్షలు, రూ.2.27 కోట్లు. మంత్రి వేలుమణి: 2011- రూ.2.71 కోట్లు, 2016-రూ.4 కోట్లు. డిప్యూటీ స్పీకర్ జయరామన్: 2016 రూ.8.90 కోట్లు. మంత్రి మోహన్: 2011-రూ.85.60లక్షలు, 2016 రూ.73.62 లక్షలు. అలాగే తేని నుండి నామినేషన్ వేసిన మంత్రి ఓ పన్నీర్ సెల్వం: 2011- రూ.55.50 లక్షలు, 2016 రూ.1.53 కోట్లు. మధురై పడమర నుండి పోటీచేస్తున్న మంత్రి సెల్లూరు రాజా: 2011-39.44 లక్షలు, 2016- రూ.1.18 కోట్లు. మధురై తిరుమంగళం అభ్యర్ది మంత్రి ఉదయకుమార్: 2011-రూ.14.59లక్షలు, రూ.30.95లక్షలు. దిండుగల్లు ఆత్తూరు నియోజవర్గ అభ్యర్ది మంత్రి నత్తం విశ్వనాధం: 2011- రూ.1.39 కోట్లు, 2016- రూ.2.24 కోట్లు. విరుదునగర్ శివకాశీ అభ్యర్ది మంత్రి కేటీ రాజేంద్రబాలాజీ: 2011- రూ.51.33లక్షలు, 2016- రూ.2.14 కోట్లు. మంత్రి వెంకటాచలం: 2011-రూ.11.80 కోట్లు, 2016-రూ.13.55 కోట్లు. మాజీకి తగ్గిన ఆస్తి: తూత్తుకుడి నియోజకవర్గం నుండి గత ఎన్నికల్లో గెలిచి కార్మిక సంక్షేమశాఖా మంత్రిగా ఉండిన చెల్లపాండియన్ మధ్యలో పదవిని కోల్పోయారు. గత ఎన్నికల్లో రూ.17 కోట్ల స్థిరాస్థులు చూపిన ఆయన ప్రస్తుత ఎన్నికల్లో రూ.5.7 కోట్లుగా చూపడం విశేషం. మహిళల్లో వలర్మతికి మొదటి స్థానం జయలలిత మంత్రి వర్గంలోని మహిళా మంత్రుల్లో వలర్మతి 2016లో రూ.8.92 కోట్లతో మొదటి స్థానంలో నిలిచారు. 2011లో రూ.3.31 కోట్లు. మంత్రి గోకుల ఇందిర: 2011-రూ.1.4 కోట్లు, 2016-రూ.4.51 కోట్లు. -
ఏపీలో నో వేకెన్సీ!
-
మమ్మల్ని గుర్తించండి
కరీంనగర్ సిటీ : ‘పాలనలో మా పాత్రేంటో చెప్పండి... విధులు, నిధులు ఇవ్వండి... ప్రజాసేవ చేసే అవకాశం ఇవ్వండి... కనీసం మమ్మల్ని గుర్తించండి’ అంటూ ఎంపీటీసీలు ఆక్రోశం వెల్లగక్కారు. మధ్యాహ్నం సదస్సు ప్రారంభమైన కొద్దిసేపటికే ఎంపీటీసీలు లేచినిలబడి నినాదాలు చేశారు. తమకు హక్కులు కావాలని, ముందు తమను గుర్తించాలని బిగ్గరగా అరిచారు. కొద్దిమంది వేదిక వద్దకు దూసుకువచ్చి, వేదిక ముందు బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్‌విప్ కొప్పుల సర్ది చెప్పడానికి ప్రయత్నించినప్పటికి వారు వినలేదు. చివరకు మంత్రి ఈటల జోక్యం చేసుకొని ఎంపీటీసీల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడినే తానని, సమస్యలుంటే చెప్పుకోవాలి తప్ప, గొడవ చేస్తే లాభం లేదని అన్నారు. దీంతో పలువురు ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు మాట్లాడుతూ.. తాము ఉత్సవ విగ్రహాలుగా మారామని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీటీసీల ఫోరం జిల్లా క న్వీనర్ తులా బాలయ్య మాట్లాడుతూ పంచాయతీల్లో సర్పంచ్‌కు, వార్డుసభ్యులకు కుర్చీ ఉంది కాని తమకు లేదన్నారు. కనీసం పింఛన్ ఫారంపై కూడా సంతకం చేసే అధికారం లేదన్నారు. గ్రామజ్యోతిలో సర్పంచ్‌లతో సమానంగా ఎంపీటీసీలకు అవకాశం కల్పించాలని కోరారు. పలువురు ఎంపీటీసీలు... మండల పరిషత్ నుంచి తాము చేసే పనులకు పంచాయతీ తీర్మానం కావాలనడంతో సర్పంచ్‌లు వేధిస్తున్నారని చెప్పారు. పంచాయతీ తీర్మానాలపై ఎంపీటీసీల సంతకం తప్పనిసరిచేయాలన్నారు. మండల పరిషత్ కార్యక్రమాల్లో జెడ్పీటీసీలను భాగస్వాములు చేయాలని జెడ్పీటీసీ చల్ల నారాయణరెడ్డి కోరారు. మంత్రి ఈటల స్పందిస్తూ ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలకు గౌరవం పెంచేందుకు ప్రయత్నిస్తామని బదులిచ్చారు. -
అభివృద్ధే లక్ష్యం
ఏంబీఏ చదివిన కోన శశిధర్ అదిలాబాద్‌లో కలెక్టర్‌గా శిక్షణ పొందారు. రాజమండ్రి సబ్ కలెక్టర్‌గా, కరీంనగర్, తూర్పుగోదావరి జిల్లాలో సంయుక్త కలెక్టర్‌గా పనిచేశారు. విజయవాడ అర్బన్ డెవలప్మెంట్ వైస్ ఛైర్మన్‌గా, కడప జిల్లా కలెక్టర్‌గా రాణించారు. మీ సేవ డెరైక్టర్‌గా, ఐటీ శాఖ సెక్రటరీగా విధులు నిర్వర్తించారు. అనంతపురం అర్బన్ : పేదల కష్టనష్టాలు పంచుకుని వారిని గట్టెక్కించేందుకు ప్రయత్నిస్తానని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం 10.45 గంటలకు ఆయన జిల్లా కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకం పేద ప్రజలకు అందే విధంగా కృషి చేస్తానని తెలిపారు. జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల సహాయ సహకారాలతో ప్రజలకు సేవ చేయడానికి శయశక్తుల కృషి చేస్తానన్నారు. అనంతపురం జిల్లాకు రావడం చాలా సంతోషకరమని, ఇలాంటి జిల్లాలో పని చేసి ప్రజల కష్టాల్లో భాగస్వామినై వారికి సేవ చేస్తాన న్నారు. వరుస కరువులతో జిల్లాలో భూగర్భ జలాలు అడుగంటి పోవడంతో తాగునీటి సమస్య అధికంగా ఉన్నట్లు, రైతులు నష్టపోతున్నట్లు తెలుసుకున్నానన్నారు. ఈ సమస్యలను అధిగమించి జిల్లాను ప్రగతి పథంలో నడిపించడానికి అందరి సహకారంతో ముందుకెళ్తానన్నారు. గతంలో కడప జిల్లా కలెక్టర్‌గా పనిచేసిన సమయంలో అనంతపురం జిల్లాపై అవగాహన ఉందన్నారు. జిల్లా నూతన కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన కోన శశిధర్‌కు అధికారులు ఘన స్వాగతం పలికారు. సంయుక్త కలెక్టర్ లక్ష్మీకాంతం, అదనపు సంయుక్త కలెక్టర్ సయ్యద్ ఖాజామొిహ ద్దీన్, జిల్లా రెవిన్యూ అధికారులు సిహెచ్ హేమసాగర్, పౌర సరఫరాలశాఖ ఏడీ వెంకటేశ్వరరావు, డీపీఆర్ఓ బి.జయమ్మ, ఏపీఆర్ఓ పురుషోత్తం, కలెక్టరేట్ సిబ్బంది స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. మేయర్ మదమంచి స్వరూప కలెక్టర్‌ను కలిసి, అనంతపురం నగర పరిస్థితిని వివరించారు. జవాబుదారీగా పని చేయండి : ఉద్యోగులకు కలెక్టర్ పిలుపు అధికారులు జవాబుదారీతనం, నిర్దేశిత లక్ష్యాల సాధన దిశగా అంకిత భావంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ కోన శశిధర్ పిలుపునిచ్చారు. శుక్రవారం నూతన కలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అనంతరం రెవిన్యూ భవనంలో అన్ని శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. అధికారులు నిర్భయంగా పనిచేయాలని, చిత్తశుద్ధితో పనిచేసే వారికి పూర్తి స్థాయిలో సహకారం ఉంటుందన్నారు. ఇక్కడి అధికారులు పలువురితో తనకు పరిచయం ఉందన్నారు. ప్రభుత్వ ప్రాధాన్యత అంశాలైన ఏడు మిషన్లు, ఐదు గ్రిడ్లు, ఐదు క్యాంపెయిన్ల అమలే తన ప్రాధాన్యత అని తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం వినియోగంలో ముందున్నారన్నారు. ప్రతి శాఖకు సంబంధించిన రాష్ర్ట, జిల్లా స్థాయి సమాచారంతో పాటు గ్రామ స్థాయి ప్రగతి వివరాలు కూడా ముఖ్యమంత్రి పరిశీలిస్తున్నారని తెలిపారు. కాబట్టి శాఖపరమైన అన్ని అంశాలపై, క్షేత్ర స్థాయి సమస్యలపై అధికారులకు పూర్తి అవగాహన వుండాలన్నారు. ఐటీ శాఖ కార్యదర్శిగా పనిచేసిన కాలంలో పబ్లిక్ గ్రీవెన్స్ మానిటరింగ్‌కు ప్రత్యేక సాప్ట్‌వేర్‌ను రూపొందించినట్లు తెలిపారు. ప్రజలకు సకాలంలో సరైన న్యాయం చేసేందుకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఉపయోగపడుతుందని ముఖ్యమంత్రి భావిస్తున్నట్లు తెలిపారు. తదనుగుణంగా గ్రీవెన్స్ ఫిర్యాదుల పరిష్కారానికి కాలాన్ని నిర్దేశించుకొని పనిచేయాలని తెలిపారు. ప్రస్తుతం అమలులో ఉన్న ఉత్తమ మార్గాల ద్వారా అర్జీలను పరిష్కరించాలని సూచించారు. జిల్లాలో మాతా, శిశు మరణాల శాతాన్ని తగ్గించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు జిల్లా కలెక్టర్ కోన శశిధర్ తెలిపారు. వైద్యం, విద్య, మహిళా, శిశు సంక్షేమం, స్వయం సహాయక సంఘాల సాధికారిత, ఉపాధి హామీ పనుల కల్పన, ఇంజనీరింగ్ పనులు, ప్రభుత్వ ఆర్థిక సహాయంతో యూనిట్లు మంజూరు చేస్తున్న వివిధ శాఖల కార్పొరేషన్లు తమ లక్ష్యాల సాధనకు మండలాల వారీగా రెగ్యులర్‌గా మానిటరింగ్ చేసి నివేదించాలని అధికారులను ఆదేశించారు. పదవ తరగతి ఫలితాలు ఆశించిన స్థాయిలో లేవని, ఈ రెండు నెలల కాలంలో అధికారులందరినీ భాగస్వామ్యులను చేసి మెరుగైన ఫలితాల సాధనకు కృషి చేయనున్నట్లు తెలిపారు. తాగునీటి ఎద్దడి నివారణ, ఉపాధి పనుల కల్పనపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. స్మార్ట్ విలేజ్‌లో నిర్దేశించిన 20 అంశాలపై శ్రద్ధ తీసుకొని జిల్లా ర్యాంకును ఉన్నత స్థాయిలో నిలపాలని కోరారు. -
కార్యక ర్తలకు అండగా ఉంటాం
వైరా : ప్రజా సేవ కోసమే తాను రాజకీయాల్లోకి వచ్చానని ఖమ్మం పార్లమెంటు సభ్యుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. సేవ చేయాలనే తపన, కసితోనే ముందుకెళుతున్నానని చెప్పారు. బుధవారం వైరా నియోజకవర్గ స్థాయి నాయకులు, ముఖ్య కార్యకర్తల సమావేశం స్థానిక వాసవి కల్యాణ మండపంలో జరిగింది. 14 నెలల క్రితం పార్టీలోకి వచ్చి అందరి సలహాలు సూచనలు తీసుకోని పంచాయతీ ఎన్నికల నుంచి పార్లమెంట్ ఎన్నిక వరకు ప్రజల ప్రేమాభిమానాలను పొందుకుంటూ వచ్చామన్నారు. వెన్నుపోటు పొడిచినా తట్టుకునే శక్తి తనకు ఉందన్నారు. తనను గెలిపించి ఆదరించిన జిల్లా ప్రజలు, కార్యకర్తలకు తాను అన్ని విధాలుగా అండగా ఉంటానని ఆయన భరోసా ఇచ్చారు. ఎవరైనా పార్టీని వీడాలనుకున్నా వారి వెంట వైఎస్సార్సీపీ శ్రేణులెవరూ వెళ్లరని అన్నారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం సరికాదని, పార్టీని వీడాలనుకుంటున్నవారు పునరాలోచన చేసుకోవాలని సూచించారు. పొంగులేటి నిర్ణయానికి కట్టుబడి ఉంటాం.. వైరా నియోజకవర్గ ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో నాయకులు బొర్రా రాజశేఖర్, సూతకాని జైపాల్, కొణిజర్ల మండల కన్వీనర్ రాయల పుల్లయ్య మాట్లాడుతూ ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీసుకోనే నిర్ణయానికి కట్టుబడి ఉంటామని చెప్పారు. ఈ కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నిరంజన్‌రెడ్డి, ఆకుల మూర్తి, వైఎస్సార్సీపీ నాయకులు శీలం కరుణాకర్ రెడ్డి, తేలప్రోలు నర్సింహారావు, శీలం వెంకటరామిరెడ్డి, ఏలూరి శ్రీను, ముళ్ళపాటి సీతారాములు, శీలం సురేందర్‌రెడ్డి, శీలం ఆదినారాయణరెడ్డి, మన్నెపల్లి శ్రీను, కొణిజర్ల మండల వైస్ ఎంపీపీ తాళ్ళూరి చిన్నపుల్లయ్య, దొడ్డపనేని రామారావు, పాముల వెంకటేశ్వర్లు, అప్పం సురేష్, నల్లమల్ల వెంకటేశ్వర్లు, కారేపల్లి మండల నాయకులు ఇమ్మడి తిరుపతిరావు, జూలూరుపాడు నాయకులు పూర్ణకంటి నాగేశ్వరరావు, మిట్టపల్లి నాగి, కాంపాటి శేషగిరి, రే చర్ల సత్యం, తుమ్మల చిన్ని, జాలాది రామకృష్ణ, వివిధ గ్రామాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లు పాల్గొన్నారు. -
ప్రజల కోసమే పనిచేద్దాం
సాక్షి, ఏలూరు :‘ప్రజల కోసమే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆవిర్భవించింది.. వారికోసమే పనిచేద్దాం.. పార్టీని సంస్థాగతంగా మరింత పటిష్టం చేసేందుకు పునరంకితం అవుదాం’ అని పిలుపునిచ్చారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని). పార్టీ సారథిగా బుధవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా స్థానిక ఎన్ఆర్ పేటలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ప్రసంగించారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర 13 జిల్లాల్లో అత్యంత దారుణంగా నష్టపోయిన జిల్లా పశ్చిమగోదావరి అని, జిల్లా ప్రజలు కష్టాల్లో ఉన్నారని నాని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతిక్షణం ప్రజల పక్షాన పోరాడటానికి పార్టీ శ్రేణులను సన్నద్ధం చేసి ముందుకు నడిపిస్తామన్నారు. వచ్చేనెల 15 నుంచి జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో పర్యటించి, గ్రామస్థాయి వరకూ వెళ్లి ప్రతి కార్యకర్తను కలుస్తానన్నారు. ఎక్కువ సమయం తీసుకోకుండా అక్టోబర్ 3 నాటికి జిల్లా కమిటీలను ప్రకటిస్తామని వెల్లడిం చారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, రాష్ట్ర రాజధాని ఏర్పాటు, రాష్ట్రానికి ప్రత్యేక హోదా వంటి అంశాలపై ఇప్పటికీ స్పష్టత ఇవ్వలేకపోతున్నారని ప్రభుత్వంపై నాని విరుచుకుపడ్డారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి కావడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. రుణమాఫీ పేరుచెప్పి రైతులు, డ్వాక్రా మహిళలను, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగులు, యువకులను చివరకు బడుగు, బలహీన వర్గాల వారిని చంద్రబాబు మోసం చేశారని విమర్శించారు. అక్టోబర్ 2 నుంచి పెంచిన పింఛన్లు ఇస్తామంటున్న ప్రభుత్వం ఆ మాటనైనా నిలుపుకోవాలన్నారు. జిల్లాకు జరుగుతున్న అన్యాయంపై నిరంతరం పోరాడతామన్నారు. జిల్లా పార్టీ నాయకులు, కార్యకర్తల అభిప్రాయాలకు అనుగుణంగా పార్టీని ముందుకు తీసుకెళతానని ఆళ్ల నాని అన్నారు. నానికి అభినందనల వెల్లువ జిల్లాలోని పార్టీ నేతలందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి పార్టీని ముందుకు నడిపించగల సత్తా ఉన్న నేత ఆళ్ల నాని అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా మాజీ కన్వీనర్ తెల్లం బాలరాజు అన్నారు. పదేళ్లుగా పదవికి దూరంగా ఉన్న తెలుగుదేశం పార్టీ నాయకులు అధికారం రాగానే అరాచకాలకు పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ఇకపై ఆ పార్టీ వారి ఆటలు సాగవని అన్నారు. పార్టీకి నాని చేసిన సేవలకు, ఆయన పడిన కష్టానికి దక్కిన గౌరవమే జిల్లా అధ్యక్ష పదవి అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ర్ట నాయకులు ఇందుకూరి రామకృష్ణంరాజు అభిప్రాయపడ్డారు. అసెంబ్లీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపక్ష నేత హోదాలో మాట్లాడుతుంటే అధికార పార్టీకి చెమటలు పడుతున్నాయన్నారు. టీడీపీ ఇచ్చిన రుణమాఫీ హామీ నెరవేరడం లేదనే విషయాన్ని నాని ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రజల్లోకి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే జీఎస్ రావు పిలుపునిచ్చారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై దాడులకు పాల్పడటం మినహా ఒక్కపని కూడా చేయలేదని మాజీ ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వరావు అన్నారు. డ్వాక్రా రుణాలు సక్రమంగా చెల్లించే మహిళలను డిఫాల్టర్లుగా మార్చిన ఘనత చంద్రబాబు నాయుడిదేనన్నారు. ‘వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వారిని వేధిస్తే ఖబడ్దార్’ అని కారుమూరి హెచ్చరించారు. వచ్చే ఎన్నికల్లో జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొందేలా పార్టీని నడిపించాలని మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత ఆకాంక్షించారు. చంద్రబాబుకు అత్యధిక స్థానాలు దక్కడంతో ప్రజలకు మేలు చేస్తారని ఆశించామని, ఆయన అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని నరసాపురం పార్లమెంటరీ నియోజకవర్గ కన్వీనర్ వంక రవీంద్ర అన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్ష నేతకు తగిన సమయం కేటారుుంచకపోవడం దారుణమన్నారు. నాని ఆధ్వర్యంలో ప్రతి నియోజకవర్గంలోని నెలకొన్న సమస్యలపై పార్టీ నేతలు స్థానిక ఎమ్మెల్యేకు వినతిపత్రం అందజేసి వాటి పరిష్కారానికి కృషి చేయాలని రవీంద్ర సూచించారు. నియోజకవర్గ స్థాయి కమిటీలు వేసుకుని, ప్రతి సోమవారం ప్రజల సమస్యలను మండలస్థాయి నుంచి జిల్లాస్థాయి అధికారుల దృష్టికి తీసుకువెళ్లాలని మాజీ ఎమ్మెల్యే ఘంటా మురళి సూచించారు. రూ.లక్షన్న మాత్రమే రుణమాఫీ చేస్తే రూ.మూడు లక్షల రుణం ఉన్న రైతులకు వడ్డీకే సరిపోదన్నారు. రాష్ట్రాన్ని విడగొట్టమని ఆనాడు లేఖ ఇచ్చి, కాంగ్రెస్‌పై అవిశ్వాసం పెడితే సహకరించకుండా ఇప్పుడు రాష్ట్రాభివృద్ధికి ఒక్క రూపాయి లేదంటున్న చంద్రబాబు తీరును ఎమ్మెల్సీ మేకా శేషుబాబు ఎండగట్టారు. గతంలో ప్రజల పక్షాన ఏవిధంగా పోరాటం చేశామో అదేవిధాంగా భవిష్యత్‌లోనూ నాని నాయకత్వంలో పోరాటాలు చేస్తామని మాజీ ఎమ్మెల్యే ముదునూరి ప్రసాదరాజు అన్నారు. పార్టీ క్యాడర్‌ను ఏకతాటిపైకి తెచ్చి సత్తా ఏమిటో మరోసారి చూపించాలని మాజీ ఎమ్మెల్యే మద్దాల రాజేష్ అన్నారు. వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని చింతలపూడికి కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాజకీయం అనేది పుట్టిన తరువాత టీడీపీ వంటి అరాచక పార్టీని ఎన్నడూ చూడలేదని మాజీ ఎమ్మెల్యే పాతపాటి సర్రాజు అన్నారు. నానికి పూర్తిగా సహరించి పార్టీని ముందకు నడిపిస్తామని పార్టీ నేత చీర్ల రాధయ్య అన్నారు. దెందులూరు, గోపాలపురం నియోజకవర్గాల్లో పార్టీ కార్యకర్తలపై సెక్షన్-307 కింద కేసులు పెట్టి వేధిస్తున్నారని, ఇక మీదట అలా జరగకుండా నాని అండగా ఉండాలని పార్టీ నేత తలారి వెంకట్రావు కోరారు. సమావేశంలో మాజీ మంత్రి మరడాని రంగారావు, పార్టీ నేతలు చలుమోలు అశోక్‌గౌడ్, ఊదరగొండి చంద్రమౌళి, కొఠారు రామచంద్రరావు, బొద్దాని శ్రీనివాస్, గుడిదేశి శ్రీనివాసరావు, మంచెం మైబాబు, అప్పన ప్రసాద్, పార్టీ నాయకురాలు రంగమ్మ, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి పాల్గొన్నారు. రుణమాఫీ చేయకుండా రైతు బడ్జెట్ ఎందుకు: కొత్తపల్లి ‘అధికార పార్టీ ఎన్నికలముందు ఇచ్చిన రుణమాఫీ హామీని నెరవేర్చకుండా వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించడం వల్ల ఏం ప్రయోజనం’ అని మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. ‘రాజకీయాల్లో గెలుపు ఓటములకు కాకుండా బాధ్యతలకు ప్రాధాన్యం ఇవ్వాలని పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి నిరూపిస్తున్నారు. ముఖ్యమంత్రి కాలేకపోయాననే నిరుత్సాహం ఆయనలో ఎక్కడా కనిపించడం లేదు. శాసనసభలో జగన్ ఎంతో హుందాగా వ్యవహరిస్తున్నారు. రాజకీయాల్లో 30 ఏళ్ల అనుభవం ఉన్నవాళ్లు కూడా ఇంత సమర్థవంతంగా ప్రతిపక్ష పాత్రను పోషించలేరు. వైఎస్ జగన్ మాట్లాడుతుంటే ప్రభుత్వానికి ముచ్చెమటలు పడుతున్నాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్క నిమిషం కూడా అసెంబ్లీ సమావేశాలను సక్రమంగా జరగనివ్వకుండా, మైకులు విరగొట్టిన ఘనత టీడీపీ నేతలది. ఇప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు మైకులు పట్టుకుంటే రాద్ధాంతం చేస్తున్నారు. ప్రతిపక్షం మాట్లాడకూడదనుకున్నప్పుడు అసెంబ్లీలో కాకుండా ఎన్టీఆర్ భవన్లో సమావేశాలు పెట్టుకుంటే మంచిది’ అని పేర్కొన్నారు. జిల్లాలో ఆళ్ల నాని నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని, ఆయనకు పార్టీ నేతలంతా పూర్తి సహాయ సహకారాలు అందిస్తారని సుబ్బారాయుడు స్పష్టం చేశారు. -
పోలీసుల ప్రజాసేవ
మక్కువ, న్యూస్‌లైన్: ప్రజలకు రక్షణ కల్పించడంతో తమ పని అ యిపోయిందని వారు భావించలేదు. తమ పరిధిలో ఉన్న అమాయక గిరిజన యువకులను ఆదుకోవాలని, వారికి సరైన శిక్షణ అందించి ఉపాధి కల్పించాలని భావించారు. అందుకు తగ్గట్టే విధులతో పాటు గిరిజనుల సేవా కార్యక్రమాలనూ బాధ్యతగా నిర్వర్తిస్తున్నారు సీఆర్పీఎఫ్ పోలీసులు. మక్కువలో ఉన్న పోలీస్‌స్టేషన్ ఆవరణలో 2011 పిబ్రవరి 18న విశాఖపట్టణం 198 బెటాలియన్ నుంచి సీఆర్పీఎఫ్ బలగాలు చేరుకున్నాయి. అప్పటి నుంచే ఇక్కడ సేవా కార్యక్రమాలకు బీజం పడింది. మండలంలోని పలు గిరిజన గ్రామాలతో పాటు మైదాన ప్రాంతాల్లో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు పోలీసులు వారి వంతు ప్రయత్నాలు మొదలుపెట్టారు. సివిక్ యాక్షన్ ప్రొగ్రాంలో భాగంగా మండలంలోని ఏ.వెంకంపేట గ్రామం జిల్లా పరిషత్ పాఠశాలలో బోరు ఏర్పాటు చేశారు. అలాగే సీఆర్పీఎఫ్ కమ్యూనిటీ నిధులు రూ.లక్షతో అంటివలసలో మినీ రక్షిత మంచినీటి ట్యాంక్‌ను నిర్మించారు. అలాగే చెక్కవలస గిరిజన గ్రామంలో రూ.42వేలతో బోరు ఏర్పాటు చేశారు. ఇటీవల మెండంగి గ్రామంలో 1500 లీటర్ల సామర్థ్యం గల వాటర్‌ట్యాంక్‌లను కూడా ఏర్పాటు చేశారు. మరికొన్ని పనులు ఇంకా నిర్మాణ దశల్లో ఉన్నాయి. మండలంలోని నంద, దుగ్గేరు గ్రామాల్లో పోలీసు సిబ్బంది తరచుగా వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు. వారపు సంతలకు అధికంగా గిరిజనులు వచ్చే అవకాశం ఉన్నం దున ఆ సమయంలో శిబిరాలు నిర్వహిస్తూ వైద్య సేవలు అందిస్తున్నారు. అలాగే ఈ ఏడాది జనవరిలో మండలంలోని బొడ్డవలస గ్రామంలో దుప్ప ట్లు పంపిణీ చేయగా, మూలవలసలో గిరిజన మహిళలకు వంటపాత్రలు పంపిణీ చేశారు. గిరిజన యువత పెడదోవ పట్టకుండా ఉండేందుకు సీఆర్పీఎఫ్-ఎఫ్ 198 బెటాలియన్ ఆధ్వర్యంలో పలు క్రీడలు పోటీలను నిర్వహిస్తున్నారు. వాలీబాల్ పోటీలు, క్రికెట్ పోటీలు నిర్వహిస్తూ బహుమతులు అందిస్తున్నారు. గిరిజన యువకులకు క్రీడా పరికరాలను కూడా అందిస్తున్నారు. క్రీడలపై ఆసక్తి కనబరిచిన గిరిజన గ్రామాలను గుర్తించి క్రీడా పరికరాలను అందిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నోటిఫికేషన్లకు సంబంధించి అర్హత, ఆసక్తి గల యువతను గుర్తించి వారికి శిక్షణ కూడా అందిస్తున్నారు. గిరిజన గ్రామాల్లో కూంబింగ్‌కు వెళ్లేటపుడు వారు ఎదుర్కొనే సమస్యలను గుర్తించాం. వారిని ఆదుకోవాలనే సంకల్పంతోనే సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. మున్ముందు కూడా ఇవి సాగుతాయి. - రాజేశ్‌కుమార్ గుడ్డూ, సీఆర్పీఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ -
ప్రజాసేవ కోసమే పోలీసులు
ఆదిలాబాద్ క్రైం, న్యూస్‌లైన్ : ప్రజాసేవ కోసమే పోలీసులు ఉన్నారని, ఈ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించి విధులకు న్యాయం చేయూలని కరీంనగర్ రేంజ్ డీఐజీ భీమానాయక్ అన్నారు. గురువారం జిల్లా ప్రజాపరిషత్ సమావేశ మందిరంలో 2013 అర్ధ వార్షిక నేర సమీక్ష సమావేశానికి డీఐజీ హాజరయ్యూరు. గత ఆరు నెలల్లో జరిగిన నేరాలకు సంబంధించిన కేసులపై జిల్లాలోని పోలీసు అధికారులు, డీఎస్పీలు, సీఐలు, ఎస్సైలతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ఆరు నెలల్లో జిల్లాలో జరిగిన నేరాలను అదుపు చేయడంలో పోలీసులు వెనుకబడ్డారని పేర్కొన్నారు. పంచాయతీ ఎన్నికల్లో మినహా మిగతా నేరాలను అదుపు చేయడంలో విఫలమయ్యారన్నారు. సమస్యాత్మక ప్రాంతమైన జిల్లాలో నేరాల అదుపునకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఇకనైనా ప్రత్యేక దృష్టి సారించి జిల్లా ప్రజలకు మెరుగైన సేవలందించేందుకు కృషి చేయాలన్నారు. కానిస్టేబుళ్లు, ఇతర కింది స్థాయి సిబ్బంది సమస్యలు పరిష్కరించడంలో పోలీసు అధికారులు విఫలమయ్యారని తెలిపారు. కానిస్టేబుళ్లను చిన్నచూపు చూడకుండా పోలీసు కుటుంబంలో వారూ ఒకరుగా భావించి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేయూల్సిన బాధ్యత అధికారులపై ఉందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. అనంతరం జిల్లాలోని పోలీసు స్టేషన్లలో వివిధ కేసులకు సంబంధించిన సమస్యలను డీఐజీకి విన్నవించారు. సమావేశంలో ఎస్పీ డాక్టర్ గజరావు భూపాల్, బెల్లంపెల్లి ఏఎస్పీ భాస్కర్ భూషణ్, ఓఎస్డీ పనసారెడ్డి, ఏపీసీ రాంభక్షి, పోలీసు అధికారులు పాల్గొన్నారు.