ప్రజా సేవకే అంకితం కావాలి | governer visits today medak district | Sakshi
Sakshi News home page

ప్రజా సేవకే అంకితం కావాలి

Published Sat, Jul 16 2016 1:59 AM | Last Updated on Mon, Sep 4 2017 4:56 AM

ప్రజా సేవకే అంకితం కావాలి

ప్రజా సేవకే అంకితం కావాలి

సర్పంచ్‌లు వెల్ఫేర్ రోల్‌గా మార్పు చెందాలి
ప్రజాప్రతినిధులతో  గవర్నర్ ముఖాముఖి

 సిద్దిపేట జోన్: ‘ప్రజాప్రతినిధులు.. ప్రజా సేవకే అంకితం కావాలి.ప్రజలందరినీ భాగస్వాములను చేసుకుని కలిసి పనిచేయాలి. అభివృద్ధి సాధించాలి’ అని గవర్నర్ నరింహన్ అన్నారు.  శుక్రవారం సిద్దిపేట, చిన్నకోడూరు, నంగునూరు మండలాల ఎంపీటీసీలు, సర్పంచ్‌లతో నాగుల బండ శివారులోని నర్సరీ వద్ద ముఖాముఖి నిర్వహించారు. మంత్రి హరీశ్‌రావుతో కలిసి ముందుగా ప్రజాప్రతినిధులను పరిచయం చేసుకున్నారు. అనంతరం వారితో మాట్లాడారు.

 వారి మాటల్లోనే...
హరీష్‌రావు : గవర్నర్ సిద్దిపేట నియోజకవర్గ ప్రగతిని పరిశీలించడానికి వచ్చారు. కొందరి ప్రజాప్రతినిధులతో ఆయన మాట్లాడాలను కుంటున్నారు. మీలో ఎవరైన ముందుకు రండి అనగానే సర్పంచ్ ఆంజనేయులు వేదిక మీదకు వచ్చారు.  గవర్నర్ పలు  ప్రశ్నలు అడిగారు.

 గవర్నర్ :  మీ పేరు, ఏ గ్రామం?

 ఆంజనేయులు : గుర్రాలగొంది సర్పంచ్‌ను, నా పేరు ఆంజనేయులు

 గవర్నర్ : హరితహారం కింద గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు?

 ఆంజనేయులు : ప్రస్తుతం 25వేల మొక్కలు నాటాం, లక్ష లక్ష్యంతో ప్రణాళిక రూపొదించాం.

 గవర్నర్ : మొక్క విలువ తెలుసా? మొక్కను నాటడమే కాకుండా వాటిని పరిరక్షించడం కూడా ముఖ్యమైన బాధ్యత, వైఫల్యం చెందింతే జరిమానా విధిస్తా. డిసెంబర్‌లో మొక్కల లెక్క చూస్తా తక్కువగా ఉంటే జరిమానా తప్పదు మరీ. అంటూ సీరియస్‌గా ప్లాన్ చేసుకోవాలి.

 ఆంజనేయులు : మంత్రి హరీశ్‌రావు సూచన మేరకు నాటిన ప్రతి మొక్కను సమష్టిగా కాపాడుకుంటున్నాం.

 గవర్నర్ : గత ఏడాది గ్రామంలో ఎన్ని మొక్కలు నాటారు.

 ఆంజనేయులు : 34 వేల మొక్కలు నాటగా, వాటిలో 22 వేలు మొక్కలు బతికాయి.

 గవర్నర్ : మిగత వాటి మాటమేమిటి ? ఈ సారి మళ్లీ పునరావృతం కాకుండా చూసుకోండి. అంటునే మహిళ ప్రజా ప్రతినిధి ఒకరు ముందుకు రావాలని సూచించ గా రామంచకు చెందిన ఎంపీటీసీ విజయదేవి వేదిక మీదకు వచ్చారు.

 గవర్నర్ : ప్రస్తుతం మహిళా సర్పంచ్‌ల కాలం నడుస్తోంది. ఇప్పటి వరకు ఇబ్రహీంపూర్ సందర్శించా అక్కడి మహిళ సర్పంచ్ పనితీరు ఆదర్శనీయం. మీ గ్రామం కూడా ఇబ్రహీంపూర్ మాదిరిగా అభివృద్ధి చెందాలి.

 ఎంపీటీసీ: మంత్రి సహకారంతో గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తున్నాం.

 గవర్నర్ : సర్పంచ్ రోల్ చాల గొప్పది. సర్పంచ్ అనగానే రాజకీయాలు అనుకోవద్దు. సర్వీస్, సంక్షేమ భావంతో పనిచేయాలి. గ్రామాల్లో ప్రజలందరినీ కలుపుకుని వారిని ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో భాగస్వామ్యం చేయాలి. కలిసి పనిచేసినప్పుడే మంచి ఫలితాలు వస్తాయి. సర్పంచ్‌ల స్టోరీ మారింది. నేటి నుంచి కొత్త స్టోరిగా మారాలి. పొలిటికల్ రోల్ నుంచి వేల్ఫేర్ రోల్ దిశగా సర్పంచ్‌లు సాగాలి. గ్రామాల్లో పారిశుద్ధ్యం, నీటి సరఫరా, ఉపాధి కల్పనా, హరితహారం లాంటివి చేపట్టాలి. గ్రామంలో పనిలేకుండా ఎవ్వరూ ఉండరాదు. ఆ దిశగా ఉపాధి శిక్షణ కార్యక్రమాలను ఏర్పాటు చేసి సర్వీస్ రోల్‌తో మంచి పేరును సాధించుకోండి ఇప్పటికే మీ నియోజకవర్గం ఆదర్శంగా నిలుస్తుంది. మీ మంత్రి హరీష్‌రావు అనుకున్నది సాధిస్తాడు. గ్రామంలో బడి వయస్సు కలిగిన పిల్లలు ఇళ్లల్లో ఉండరాదు, అక్షరాస్యత శాతం పెంచాలి. 

 ఈ ముఖాముఖిలో డిప్యూటీ స్పీకర్ పద్మాదేవేందర్‌రెడ్డి, రాష్ట్ర అంచనాల కమిటీ చైర్మన్ సొలిపేట రామలింగారెడ్డి, ఎంపీలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్, రాష్ట్ర హరితహారం పథకం ఇన్‌చార్జి ప్రియాంక నర్గీస్, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి నియోజకవర్గ పరిధిలోని ప్రజాప్రతినిదులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement