Narendra Modi: అధికార పీఠంపై 20 ఏళ్లు | Prime Minister Narendra Modi completes 20 years in public service | Sakshi
Sakshi News home page

Narendra Modi: అధికార పీఠంపై 20 ఏళ్లు

Published Thu, Oct 7 2021 5:16 AM | Last Updated on Thu, Oct 7 2021 11:34 AM

 Prime Minister Narendra Modi completes 20 years in public service - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ పదవిలో బాధ్యతలు స్వీకరించి నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్‌ 7న గుజరాత్‌ ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠానెక్కారు. అనంతరం 13 సంవత్సరాలు గుజరాత్‌ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తదనంతరం 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఏడేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో పనిచేయడం ఆరంభించి నేటికి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ పదవుల్లో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానిగా వచి్చన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు విస్తృత చర్చలకు కేంద్రబిందువులయ్యాయి.  

అలాంటి కొన్ని నిర్ణయాలు క్లుప్తంగా...
► నోట్లరద్దు: 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం గురించి ప్రస్తావించిన మోదీ ప్రధానైన రెండేళ్లకు 2016 నవంబర్‌ 8 వతేదీ రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు.  

► సర్జికల్‌ స్ట్రైక్స్‌: 2016 సెపె్టంబర్‌ 18న జమ్మూ కాశీ్మర్‌ ఉరి సెక్టార్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం పొందగా, 30 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఈదాడికి ప్రతికారంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2016 సెపె్టంబర్‌ 28న భారత సైన్యంలోని 25మంది పారా కమాండోలు పాకిస్తాన్‌ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై సర్జికల్‌ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించారు.

►  వైమానిక దాడి: 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశీ్మర్‌ పుల్వామాలో సీఆర్‌పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో40 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతిగా మోదీ ఆదేశాల మేరకు2019 ఫిబ్రవరి  26న భారత వైమానిక దళం పాక్‌ ఆక్రమిత కాశీ్మర్‌లో వైమానిక దాడి చేసింది. ఇందులో 300–400 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.  

► ఆర్టీకల్‌ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని మోదీ 2019 ఆగస్టు 5న రద్దుచేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు ఏర్పాటు చేశారు. నిర్ణయానంతరం రాష్ట్రంలో ఎలాంటి హింస జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు.  

► ముస్లిం మహిళా వివాహ హక్కు రక్షణ: 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్‌ తలాక్‌ చట్ట విరుద్ధమని ప్రకటించింది. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్‌ 28న ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017 ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కానీ రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వం మరోసారి లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించింది.

► నూతన విద్యా విధానం: 1986 తరువాత  దేశంలో మొదటిసారిగా ప్రభుత్వం నూతన  జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న ప్రకటించింది. ఇందులోభాగంగా 2030 నాటికి దేశంలో 100% స్థూల నమోదు నిష్పత్తిని సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. స్థానిక, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యను, ఉన్నత విద్యాసంస్థల్లో ఏకరీతి విద్యను అందించేందుకు ఈ విధానంలో ప్రాధాన్యత ఇచ్చారు.  

► స్వచ్ఛ భారత్‌ అభియాన్‌: 2014 గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్‌ అభియాన్‌ను మోదీ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రతే ఈ మిషన్‌ లక్ష్యం. మిషన్‌ కోసంపరిశుభ్రత పన్ను అంటే సెస్‌ కూడా తీసుకువచ్చారు.

► జన్‌ ధన్‌ యోజన: దేశంలో అందరికీ  బ్యాంకింగ్‌ సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశ్యంతో  2014 ఆగస్టు 28న ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం రోజున 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో 20 కోట్లకు పైగా జన్‌ ధన్‌ బ్యాంక్‌ ఖాతాలు తెరిచారు.  

► ఆయుష్మాన్‌ భారత్‌: దేశంలోని పేదలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు 2018 సెపె్టంబర్‌ 23న ఆయుష్మాన్‌ భారత్‌ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పేదల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కేంద్రం అందిస్తుంది.  

► అంతర్జాతీయ యోగా దినోత్సవం:  2014 సెప్టె ంబర్‌ 27న మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్‌ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించి జూన్‌ 21ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement