Chief Minister of Gujarat
-
Narendra Modi: అధికార పీఠంపై 20 ఏళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ ప్రధాని నరేంద్ర మోదీ రాజ్యాంగ పదవిలో బాధ్యతలు స్వీకరించి నేటికి 20 ఏళ్ళు పూర్తయ్యాయి. 2001 అక్టోబర్ 7న గుజరాత్ ముఖ్యమంత్రిగా ఆయన అధికార పీఠానెక్కారు. అనంతరం 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా కొనసాగారు. తదనంతరం 2014లో దేశ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించి, ఏడేళ్లుగా అదే పదవిలో కొనసాగుతున్నారు. ఆయన వివిధ రాజ్యాంగబద్ధ పదవుల్లో పనిచేయడం ఆరంభించి నేటికి 20 సంవత్సరాలు అవుతోంది. ఈ పదవుల్లో ఆయన అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా ప్రధానిగా వచి్చన తర్వాత తీసుకున్న పలు నిర్ణయాలు విస్తృత చర్చలకు కేంద్రబిందువులయ్యాయి. అలాంటి కొన్ని నిర్ణయాలు క్లుప్తంగా... ► నోట్లరద్దు: 2014 సార్వత్రిక ఎన్నికల సమయంలో నల్లధనం గురించి ప్రస్తావించిన మోదీ ప్రధానైన రెండేళ్లకు 2016 నవంబర్ 8 వతేదీ రాత్రి 8 గంటలకు రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించారు. ► సర్జికల్ స్ట్రైక్స్: 2016 సెపె్టంబర్ 18న జమ్మూ కాశీ్మర్ ఉరి సెక్టార్‌లోని ఆర్మీ ప్రధాన కార్యాలయంపై ఉగ్రవాదులు చేసిన దాడిలో 19 మంది సైనికులు వీరమరణం పొందగా, 30 మందికి పైగా సైనికులు గాయపడ్డారు. ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదులు మృత్యువాతపడ్డారు. ఈదాడికి ప్రతికారంగా ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం ప్రకారం 2016 సెపె్టంబర్ 28న భారత సైన్యంలోని 25మంది పారా కమాండోలు పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని ఉగ్రవాద కేంద్రాలపై సర్జికల్ స్ట్రైక్‌ను విజయవంతంగా నిర్వహించారు. ► వైమానిక దాడి: 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కాశీ్మర్ పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్‌పై ఉగ్రవాదులు చేసిన దాడిలో40 మంది సైనికులు వీరమరణం పొందారు. దీనికి ప్రతిగా మోదీ ఆదేశాల మేరకు2019 ఫిబ్రవరి 26న భారత వైమానిక దళం పాక్ ఆక్రమిత కాశీ్మర్లో వైమానిక దాడి చేసింది. ఇందులో 300–400 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ► ఆర్టీకల్ 370 రద్దు: జమ్మూ కాశ్మీర్‌కి ప్రత్యేక ప్రతిపత్తినిచ్చే 370 అధికరణాన్ని మోదీ 2019 ఆగస్టు 5న రద్దుచేశారు. అదే సమయంలో జమ్మూ కాశ్మీర్, లడఖ్‌లను కేంద్రపాలిత ప్రాంతాలుగా మార్చారు ఏర్పాటు చేశారు. నిర్ణయానంతరం రాష్ట్రంలో ఎలాంటి హింస జరగకుండా పలు చర్యలు తీసుకున్నారు. ► ముస్లిం మహిళా వివాహ హక్కు రక్షణ: 2017 ఆగస్టు 22న సుప్రీంకోర్టు ట్రిపుల్ తలాక్ చట్ట విరుద్ధమని ప్రకటించింది. దీనికనుగుణంగా కేంద్ర ప్రభుత్వం 2017 డిసెంబర్ 28న ముస్లిం మహిళల (వివాహ హక్కుల రక్షణ) బిల్లు 2017 ను లోక్‌సభలో ప్రవేశపెట్టింది కానీ రాజ్యసభ ఆమోదం పొందలేకపోయింది. రెండో దఫా ప్రధానిగా ఎన్నికైన తర్వాత మోదీ ప్రభుత్వం మరోసారి లోక్‌సభ, రాజ్యసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి ఆమోద ముద్ర వేయించింది. ► నూతన విద్యా విధానం: 1986 తరువాత దేశంలో మొదటిసారిగా ప్రభుత్వం నూతన జాతీయ విద్యా విధానాన్ని 2020 జూలై 29న ప్రకటించింది. ఇందులోభాగంగా 2030 నాటికి దేశంలో 100% స్థూల నమోదు నిష్పత్తిని సాధించాలని లక్ష్యం నిర్దేశించారు. స్థానిక, మాతృభాషలో 5వ తరగతి వరకు విద్యను, ఉన్నత విద్యాసంస్థల్లో ఏకరీతి విద్యను అందించేందుకు ఈ విధానంలో ప్రాధాన్యత ఇచ్చారు. ► స్వచ్ఛ భారత్ అభియాన్: 2014 గాంధీ జయంతి నాడు స్వచ్ఛ భారత్ అభియాన్‌ను మోదీ ప్రారంభించారు. పరిసరాలను పరిశుభ్రతే ఈ మిషన్ లక్ష్యం. మిషన్ కోసంపరిశుభ్రత పన్ను అంటే సెస్ కూడా తీసుకువచ్చారు. ► జన్ ధన్ యోజన: దేశంలో అందరికీ బ్యాంకింగ్ సౌకర్యాలు కలి్పంచాలనే ఉద్దేశ్యంతో 2014 ఆగస్టు 28న ప్రారంభించారు. పథకం ప్రారంభోత్సవం రోజున 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలు తెరిచారు. ప్రభుత్వ పథకాల సబ్సిడీ నేరుగా లబి్ధదారుల బ్యాంకు ఖాతాలకు జమ చేయడం ప్రారంభించారు. ఇప్పటివరకు దేశంలో 20 కోట్లకు పైగా జన్ ధన్ బ్యాంక్ ఖాతాలు తెరిచారు. ► ఆయుష్మాన్ భారత్: దేశంలోని పేదలకు మెరుగైన ఆరోగ్య సౌకర్యాలను అందించేందుకు 2018 సెపె్టంబర్ 23న ఆయుష్మాన్ భారత్ పథకాన్ని మోదీ ప్రకటించారు. ఈ పథకంలో భాగంగా పేదల కుటుంబాలకు రూ.5 లక్షల వరకు ఆరోగ్య బీమాను కేంద్రం అందిస్తుంది. ► అంతర్జాతీయ యోగా దినోత్సవం: 2014 సెప్టె ంబర్ 27న మొదటిసారిగా ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఆయన విజ్ఞప్తిని అంగీకరించి జూన్ 21ని ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయ యోగా దినోత్సవంగా ఐరాస గుర్తించింది. -
మోడీ వారసుడి ఎంపికపై కసరత్తు?
గాంధీనగర్‌లో ఎమ్మెల్యేలు,నేతలతో మోడీ భేటీ అహ్మదాబాద్‌లో బీజేపీ రాష్ట్ర కోర్ గ్రూప్ సమావేశం గుజరాత్ తదుపరి సీఎంపై చర్చించేందుకే ఈ భేటీలంటూ కథనాలు అహ్మదాబాద్: సార్వత్రిక ఎన్నికల ఘట్టం ముగిసింది. ఇక ఫలితాలు వెలువడటమే మిగిలి ఉంది. ఈలోగా ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమికే అధికారం ఖాయమని చెప్పడంతో గుజరాత్ ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరనే విషయంపై అప్పుడే ఊహాగానాలు మొదలయ్యాయి. గుజరాత్ సీఎం నరేంద్రమోడీ బీజేపీ ప్రధానమంత్రి అభ్యర్థిగా బరిలో ఉన్న సంగతి తెలిసిందే. ఇక మోడీ ప్రధానిగా ఢిల్లీ వెళ్లడం ఖాయమని, గుజరాత్లో ఆయన వారసుడిగా ఎవరిని ఎంపిక చేయాలనే అంశంపై కసరత్తు ప్రారంభించినట్టు కథనాలు వెలువడ్డాయి. గుజరాత్ బీజేపీ చీఫ్ ఆర్.సి.ఫల్దు అధ్యక్షతన పార్టీ కోర్ గ్రూప్ మంగళవారమిక్కడ సమావేశం కావడం ఈ కథనాలకు మరింత బలం పెంచింది. అనంతరం గాంధీనగర్‌లో బీజేపీ శాసనసభాపక్షం, పార్టీ రాష్ట్ర అగ్రనేతలతో నరేంద్ర మోడీ సమావేశమయ్యారు. దీంతో సీఎం వారసుడి ఎంపికపై చర్చించేందుకే వీరు భేటీ అయ్యారనే ఊహాగానాలు మరింతగా ఎక్కువయ్యాయి. అయితే వీటిని పార్టీ వర్గాలు తోసిపుచ్చాయి. ఇవి సాధారణంగా జరిగే సమావేశాలేనని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయ్ రుపానీ చెప్పారు. గుజరాత్ తదుపరి సీఎం ఎవరనే అంశంపై మే 16న లోక్‌సభ ఫలితాలు వెల్లడైన తర్వాతే చర్చిస్తామని స్పష్టంచేశారు. దీనిపై కేంద్ర పార్లమెంటరీ బోర్డు నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. కాగా, గుజరాత్లో మోడీ వారసుడిగా ఇప్పటికే పలు పేర్లు తెరపైకి వచ్చాయి. ఇందులో మోడీ సన్నిహితుడు, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అమిత్‌షా, గుజరాత్ మహిళా మంత్రి ఆనంది బెన్ పటేల్, మంత్రులు నితిన్ పటేల్, సౌరభ్ పటేల్‌లతోపాటు పార్టీ రాష్ట్ర నేత భింకు దల్సానియాలు ఉన్నారు. నితిన్ పటేల్, దల్సానియాలు తాము గుజరాత్ సీఎం పదవి చేపట్టడానికి సన్నద్ధంగా ఉన్నామని ఇప్పటికే ప్రకటించారు. హస్తినలో బీజేపీ నేతలు బిజీబిజీ.. న్యూఢిల్లీ: పోలింగ్ ముగిసి, ఎగ్జిట్ పోల్ సర్వేలు వెలువడిన నేపథ్యంలో మంగళవారం బీజేపీ నేతలు భేటీలతో బిజీబిజీగా గడిపారు. ఎగ్జిట్ పోల్ సర్వేలన్నీ ఎన్డీఏకే అధికారం అని చెప్పడంతో వాటి పై చర్చించుకున్నారు. బీజేపీ మాజీ అధ్యక్షుడు నితిన్ గడ్కారీ.. పార్టీ అగ్రనేత అద్వానీని కలిసి భవిష్యత్ కార్యాచరణపై చర్చించారు. మరోవైపు జాతీయ ప్రయోజనాల దృష్ట్యా తమకు ఎవరు మద్దతిచ్చినా స్వాగతిస్తామని బీజేపీ నేత అమిత్ షా తెలిపారు. కలసిమెలసి పనిచేస్తాం: ఒబామా వాషింగ్టన్:భారత్‌లో రాబోయే ప్రభుత్వంతో కలసిమెలసి పనిచేయడానికి తాము ఎదురుచూస్తున్నామని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా అన్నారు. రాబోయే కాలాన్ని రెండు దేశాలకు మరింత ప్రయోజనం చేకూర్చేలా వినియోగించుకునేందుకు ప్రయత్నిస్తామన్నారు. లోక్‌సభ ఎన్నికలు దిగ్విజయంగా ముగిసిన తరుణాన్ని పురస్కరించుకుని ఒబామా భారత ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.