'మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపింది'.. ప్రధానికి హీరో రిప్లై! | Kannada Hero Sudeep Reply To PM Modi Letter On His Mother Demise | Sakshi
Sakshi News home page

Sudeep: 'మీ మాటలు ధైర్యాన్ని నింపాయి'.. ప్రధాని లేఖపై స్పందించిన సుదీప్

Published Mon, Oct 28 2024 6:04 PM | Last Updated on Mon, Oct 28 2024 6:13 PM

Kannada Hero Sudeep Reply To PM Modi Letter On His Mother Demise

కన్నడ హీరో కిచ్చా సుదీప్‌ పీఎంవో నుంచి వచ్చిన లేఖపై స్పందించారు. ఇలాంటి కష్ట సమయంలో అండగా నిలిచినందుకు ప్రధాని నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మీ లేఖ నాలో ధైర్యాన్ని నింపిందని కిచ్చా సుదీప్ ట్విటర్ ద్వారా పోస్ట్ చేశారు.

కాగా ఇటీవల కన్నడ స్టార్ కిచ్చా సుదీప్‌ మాతృమూర్తి సరోజా సంజీవ్ (86) కన్నుమూసింది. అనారోగ్యంతో బెంగళూరులోని ఓ ఆస్పత్రిలో చేరిన ఆమె తుదిశ్వాస విడిచింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు సినీ ప్రముఖులు, అభిమానులు ఆమె మరణం పట్ల సంతాపం తెలిపారు. ఆమె మృతి పట్ల సంతాపం ప్రకటిస్తూ పీఎంవో నుంచి లేఖ కూడా వచ్చింది. తాజాగా ఆ లేఖకు హీరో సుదీప్ రిప్లై ఇచ్చారు. 
 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement