ప్రధానికి టాలీవుడ్ స్టార్ హీరో రిక్వెస్ట్‌.. అదేంటో తెలుసా? | Senior Tollywood Actor Arjun Sarja Request For PM Modi About His Temple Visit - Sakshi
Sakshi News home page

Arjun Sarja: ప్రధానిని కలిసిన అర్జున్ సర్జా... ఎందుకంటే?

Published Sun, Jan 21 2024 3:27 PM | Last Updated on Sun, Jan 21 2024 3:38 PM

Senior Tollywood Actor Request For Pm Modi About His Temple Visit - Sakshi

ప్రస్తుతం అందరి దృష్టి అంతా అయోధ్య రామమందిరం వైపే ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రస్తుతం తమిళనాడులోని చెన్నైలో పర్యటిస్తున్నారు. ఖేలో ఇండియా గేమ్స్‌ను ప్రారంభోత్సవానికి పీఎం హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధానిని ప్రముఖ సినీ నటుడు, అర్జున్ సర్జా కలిశారు. తన కుమార్తెతో కలిసి ప్రత్యేక జ్ఞాపికను అందజేశారు.

ఈ సందర్భంగా చెన్నైలో తాను స్వయంగా నిర్మించిన హనుమాన్ ఆలయాన్ని సందర్శించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు. అర్జున్‌ సర్జా విజ్ఞప్తిపై పీఎం సానుకూలంగా స్పందిచారు. త్వరలోనే ఆలయాన్ని సందర్శిస్తానని హామీ ఇచ్చినట్లు అర్జున్ వెల్లడించారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement